Thursday, July 25, 2024

లీక్ ఆటకట్టు

ప్రశ్న పత్రం కాపీయింగ్ వ్యవహరంలో మైనర్ తో పాటు మరో ఇద్దరు అరెస్ట్

పదవ తరగతి వార్షిక హింది పరీక్ష పేపర్ కాపీయింగ్ వ్యవహరంలో ఒక మైనర్ బాలుడితో పాటు ఒక మరో ఇద్దరు నిందితులను కమలాపూర్ పోలీసులు అరెస్ట్ చేసారు. అరెస్ట్ చేసిన నిందితుల నుండి మూడు సెల్: ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిలో ఒక మైనర్ బాలుడితో పాటు మౌటం శివ గణేష్. వయస్సు 18 సం. కమలాపూర్ గ్రామం, హనుమకొండ మండలం, బూరమ్ ప్రశాంత్ మాజీ విలేకరి, ఆరెపల్లి, హసన్పర్తి మండలం, హనుమకొండ జిల్లాకు చెందిన వారిగా గుర్తించడం జరిగింది.

ఈ అరెస్టు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ వివరాలను వెల్లడిస్తూ నిందితుల్లో ఒకడైన మైనర్ నిందితుడు ఉప్పల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్ష వ్రాస్తున్న తన మిత్రుడికి పరీక్షలో సహయం అందించడం కోసం మైనర్ నిందితుడు ఈ రోజు పదవ తరగతి హింది పరీక్ష జరుగుతున్న సమయంలో కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ బాలుర పాఠశాల వెనుక భాగంలోని ప్రహరీ ప్రక్కనే వున్న చెట్టు సహాయంతో ప్రహరీ గోడ ఎక్కి దాని పాఠశాల మొదటి అంతస్తులోని మూడవ సంబర్ల గడికి సంబంధించి ప్రహరీ గోడ ప్రక్కనే వున్న కిటికి ప్రక్కనే పరీక్ష వ్రాస్తున్న బాలుడి నుండి మైనర్ నిందితుడు ఉదయం 9.45 నిమిషాలకు హింది పరీక్ష పత్రాన్ని తీసుకోని దానిని తన సెల్ఫోన్ ద్వారా ఫోటోను తీసుకున్నాడు. అనంతరం నిందితుడు తన సెల్ఫోన్లోని హిందీ ప్రశ్నపత్రం ఫోటో ను మరో నిందితుడైన మౌటం శివ గణేషు వాటప్స్ నంబర్కు పోస్ట్ చేయడం జరిగింది. అనంతరం రెండువ నిందితుడైన మౌటం శివ గణేష్ ఉదయం 9.59 నిమిషాలకు తన సెల్ ఫోన్ ద్వారా ఎస్.ఎస్.సి 2019-20 అనే వాటప్స్ గ్రూప్కు ఫార్వడ్ : చేయగా, మూడవ నిందితుడు ప్రశాంత్ సెల్ ఫోన్ క్కు ఎస్.ఎస్.సి 2019-20 గ్రూప్ నుండి ప్రశ్న పత్రం రావడంతో ఈ ప్రశ్న పత్రాన్ని నిందితుడు ప్రశాంత్ వివిధ గ్రూపులకు ఫార్వర్డ్ చేసాడు. దీనితో సదరు ప్రశ్న పత్రం వివిధ వాట్సప్ నంబర్కు ఫార్వర్డ్ కావడం నేడు నిర్వహించిన హింది పరీక్షకు సంబంధించి ప్రశ్న పత్రం వాట్సప్ లో చక్కర్లు కొట్టడంతో విద్యా శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీస్ కమిషనర్ అదేశాల మేరకు సైబర్ విభాగంతో పాటు స్థానిక పోలీసులు చేపట్టిన దర్యాప్తులో నిందితులను గుర్తించడం. జరిగింది.

నిందితులను గుర్తించడంలో ప్రతిభ కనబరిచిన కాజీపేట ఏసిపి శ్రీనివాస్, ఏసిపి తిరుమల్, సైబర్ క్రైం విభాగం ఇన్స్పెక్టర్ జనార్ధన్ రెడ్డి, కమలాపూర్ ఇన్స్పెక్టర్ సంజీవ్, కమలాపూర్ ఎస్.ఐలు చరణ్, సతీష్, హసన్పర్తి ఎస్.ఐ విజయ్ సతీష్, సైబర్ క్రైమ్ విభాగం ఏఏఓ ప్రశాంత్, కానిస్టేబుళ్ళు కిషోర్, రాజు, ఆంజనేయులు లను వరంగల్ పోలీస్లను కమిషనర్ అభినందించారు

కమిషనర్ అభినందించారు…

=

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular