స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య గులాబీని వీడే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది… ఘనపూర్ ఎమ్మెల్యే టికెట్ తనకు ఇవ్వకుండా కడియం శ్రీహరి కి ఇవ్వడంతో మనస్థాపం చెందిన ఆయన గులాబీని వదిలి హస్తం అందుకోనున్నట్లు సమాచారం… ఈ నేపథ్యంలో ఆయన సోమవారం సాయంత్రం కాంగ్రెస్ నేత ,మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నర్సింహ తో వరంగల్ లోని ఓ హోటల్ ల్లో భేటీ ఐయ్యారు… పొద్దున బి ఆర్ ఎస్ నేతలతో కలిసి వల్మిడి సీతరామ చంద్ర స్వామి ఆలయ కార్యక్రమంలో పాల్గొని అక్కడ సరదాగా కడియం తో ముచ్చటించిన రాజయ్య సాయంత్రం దామోదర రాజనర్సింహ ను కలవడం చర్చనీయాంశంగా మారింది…. ఈ భేటీ తో రాజయ్య జంప్ కావడం కాంగ్రెస్ లో చేరడం ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి…