Saturday, July 27, 2024

లీక్ బీజేపీ కుట్ర

బీజేపీ కుట్రపూరిత చర్యల్లో భాగమే పేపర్ లికేజ్
-ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

వరంగల్ జిల్లాలో పదవ తరగతి హిందీ పేపర్ లీకేజ్ అయ్యిందంటూ ప్రభుత్వం మీద ప్రతిపక్షాల ఆరోపణలు తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
ఈ విషయంలో ప్రతిపక్ష నాయకుకు చేస్తున్న ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

కమలాపూర్ పరీక్ష కేంద్రంలోకి గుర్తు తెలియని వ్యక్తి అక్రమంగా వెళ్లి పేపర్ను ఫోటో తీసుకొని బయటికి వెళ్లి ఆ ఫోటోను 11:30 గంటలకు నేరుగా ఎంపీ బండి సంజయ్ కి పంపించారని పోలీసు విచారణలో తేలిందని వరంగల్ సిపీ రంగనాథ్ మీడియాకు తెలిపారని
ప్రతిపక్షాలు ఇంతటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని నిస్సిగ్గుగా దగ్గరుండి కావాలని వారి కార్యకర్తలు, విద్యార్థి నాయకులతో తప్పులు చేయించి, ప్రోత్సహించడాన్ని నేరంగా భావించి బండి సంజయ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు
పరీక్షా కేంద్రంలోకి అక్రమంగా వెళ్లిన వ్యక్తి ప్రతిపక్ష పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాలకు చెందిన వ్యక్తిగా పోలీస్ గుర్తించారని పరీక్షా కేంద్రంలో తీసిన ఫోటోను ఆ వ్యక్తి ఎంపీ బండి సంజయ్ గారికి పంపించడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు..?
ప్రభుత్వాన్ని కావాలనే బద్నాం చేస్తున్నారని నిన్నటి తెలుగు పేపర్ లీకేజీ వ్యవహారంలో సైతం ఇలాంటి కుట్రే దాగి ఉండవచ్చని ఎమ్మెల్యే నరేందర్ సందేహం వ్యక్తం చేసారు ప్రజల్లో,విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలు కలిగే విదంగా చిల్లర రాజకీయాలు చేస్తున్న బండి సంజయ్ ని వెంటనే ఎంపీ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు
ఈ చర్యలకు పాల్పడిన వారిని వదిలిపెట్టేదే లేదని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నన్నపునేని పోలీసు ఉన్నతాధికారులను కోరారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular