Monday, May 6, 2024

సిఐ ల బదిలీల్లో ఇష్టారీతి…?

ప్రజాప్రభుత్వం.ఎలాంటి పైరవీలకు తావులేదు…అంతా పారదర్శకత అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగా చెప్పిన పోలీసు శాఖలో ఇది ఏమాత్రం చెల్లుబాటు ఐయ్యేలా కనపడడం లేదు ….ప్రధానంగా పోలీసు బదిలీల్లో పారదర్శకత కు గండి పడినట్లే కనపడుతుంది….సాధారణంగా పోలీస్ శాఖలో బదిలీల విషయంలో ఆ శాఖ ఉన్నతాధికారులు కొంచెం కఠినంగానే వ్యవహరించేవారు
ఆ శాఖలో పోస్టింగులు పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు(పీఈబీ) ప్రతిపాదనల మేరకు జరగాలనే నిబంధన సైతం ఉంది… సాధారణంగా రెండున్నరేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత బదిలీ చేసి కొత్తవారికి అవకాశం కల్పించాలి. లేదంటే అక్రమాలకు పాల్పడినట్లు రుజువైనా మార్చేయాల్సి ఉంటుంది. విధినిర్వహణలో పనితీరు, సమర్థత, పోలీస్ అకాడమీలో మార్కులు.. తదితర అంశాల్ని పరిగణనలోకి తీసుకొంటారు. కానీ గతకొన్ని సంవత్సరాలుగా ఇదంతా కేవలం కాగితాల్లో మాత్రమే కనిపించే అంశంగా మిగిలిపోయిందనే విమర్శలు ఉన్నాయి…ఆయా ప్రాంతాల్లో పోస్టింగ్ దక్కించుకోవాలనుకునేవారు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేసే సంస్కృతి మొదలయ్యిందనేది ముమ్మాటికీ వాస్తవం…ఇంకొందరు తమకు నచ్చిన పెద్దపెద్ద పోస్టుల కోసం ఇలాంటి విధానంలోనే ముందుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. చాలా సంవత్సరాలుగా ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు ఉన్నవారికే ముఖ్య పోస్టింగులు ఇచ్చే పరిస్థితులున్నాయి. అంతా ప్రణాళిక ప్రకారమే జరిగిపోయేది. అవసరమైన స్థానం కోసం వారు ఎమ్మెల్యేల నుంచి లేఖలు తీసుకెళ్లి ఐజీ కార్యాలయంలో ఇచ్చేవారు. కొన్నిరోజులకే ఆ పోస్టింగ్ ఖరారు చేస్తూ ఐజీ కార్యాలయం ఉత్తర్వులిచ్చేది. ఇలాంటి వ్యవహారాల్లో పలుచోట్ల కొంతమంది ఎమ్మెల్యేల అనుచరులు సైతం భారీగా వసూలు చేసేవారనే ఆరోపణలు బహిరంగంగా వినిపించేవి….ఐయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి సిపార్సు లేఖలు ఉండవని చెప్పిన ఆచరణలో మాత్రం పూర్తిగా విఫలం ఐయినట్లు కనపడుతుంది….ఇటీవల జరిగిన బదిలీలు పోస్టింగుల విషయంలో సిపార్సు లేఖలదే హవా నడిచినట్లు పోలీసు శాఖలో ప్రచారం జోరుగా సాగుతుంది…. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆయా పొలిస్టేషన్ల సి ఐ ల బదిలీలు,పోస్టింగుల విషయంలో ఇష్టారీతిన వ్యవహారించినట్లు ఆరోపణలు బాగానే వినిపిస్తున్నాయి…ఈ బదిలీలు,పోస్టింగుల వ్యవహారంలో కొందరు ప్రజాప్రతినిధులు తమ పవర్ చూపించి సిపార్సు లేఖలు ఇచ్చి తమకు నచ్చిన వారిని నచ్చిన చోటికి తీసుకువచ్చినట్లు తెలిసింది….పోలీస్ బదిలీలు ,పోస్టింగుల విషయంలో సిపార్సు లేఖలకు కాలం చెల్లిందని అనుకున్న ఈసారి బదిలీల్లో అధికారులు వాటికే ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల ఎలాంటి సిపార్స్ లేని కొందరు సిఐ లు పోస్టింగులు లేక సంవత్సరాల తరబడి అలాగే ఉంటున్నట్లు తెలిసింది…ఇటివల ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా జరిగిన సి ఐ ల బదిలీల్లో కొందరు సమర్థులైన అధికారులకు పోస్టింగ్ దక్కిన అర్హులైన కొందరికి అసలు పోస్టింగ్ లు దక్కలేదనే వాదనలు సైతం ఉన్నాయి….

సిన్సియర్లకు రిక్త హస్తం…..?

కొత్త సర్కార్ ఏర్పడిన తర్వాత పోలీస్ శాఖలో జరిగిన బదిలీల్లో అర్హులకు న్యాయం జరుగుతుందని…కొన్ని సంవత్సరాలుగా పోస్టింగ్ లేకుండా ఖాళీగా ఉంటున్న కొందరు సి ఐ లకు ఎక్కడైనా పోస్టింగ్ దక్కుతుందని అనుకుంటే వారికి ఈసారి నిరాశే ఎదురైయ్యింది….సిన్సియర్ గా విధులు నిర్వర్తించి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పనిచేసిన కొందరు సిఐ లకు పోస్టింగ్ దక్కకపోవడంతో వారు నిరాశలో ఉన్నట్లు సమాచారం…కాగా గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కడ పోస్టింగ్ దక్కక ఈసారైనా దక్కుతుందని ఆశగా ఉన్న ఓ సిఐ పోస్టింగ్ దక్కకపోవడంతో కన్నీరు పెట్టుకున్నట్లు తెలిసింది….పోస్టింగుల విషయంలో ప్రజాప్రతినిధుల సిపార్స్ లేఖలే ప్రధాన పాత్ర పోషిస్తుండడంతో చాలామంది సిఐ లు నారాజ్ గా ఉన్నట్లు తెలుస్తుంది…..అంతేకాదు ఇటీవల కొంతమంది సి ఐ లను బదిలీ చేసి వారిలో కొంతమందికి పోస్టింగ్ ఇచ్చి కొద్దిరోజులకే మళ్ళీ వారిని అక్కడ నుంచి తప్పించడం…సిపార్స్ లేఖలు పోలీస్ శాఖలో ఎంతటి మాయ చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు …ఇంతేకాకుండా ఇంకొందరు రాజకీయనాయకులు తమకు నచ్చని పోలీస్ అధికారి తమ ప్రాంతంలో పోస్టింగ్ వేసుకుంటే వారిపై ఏవో ఫిర్యాదులు చేయించి విధుల్లో చేరిన కొద్దిరోజులకే బదిలీ బహుమానం ఇచ్చినట్లు సమాచారం…..పోలీస్ అధికారుల బదిలీల్లో ఇంతటి గజిబిజి గందరగోళం నెలకొని ఉండడంతో పోస్టింగ్ వచ్చిన కొందరు సిఐ లు సైతం ఎప్పుడో ఏ బదిలీ వార్త వినాల్సివస్తుందేమోనని అసంతృప్తి లోనే ఉన్నట్లు తెలుస్తుంది…..ఇప్పటికైనా పోలీస్ అధికారులు బదిలీలు,పోస్టింగుల విషయంలో సిపార్స్ లేఖలను పక్కనపెట్టి సంవత్సరాల తరబడి పోస్టింగ్ లేకుండా వి ఆర్ లో ఇతర ప్రాధాన్యత లేని పోస్టుల్లో కొనసాగుతున్నవారికి పోస్టింగులు ఇస్తారా లేక సిపార్స్ లేఖలదే హవా అని నిరూపిస్తార చూడాలి…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular