Tuesday, May 28, 2024

హ(ర)మేష ఇదే పనా….?

ప్రభుత్వ గురుకులాల్లో తాను ఆడిందే ఆట , పాడిందే పాట అన్నట్లు వ్యవహరిస్తున్నాడు ఆ కాంట్రాక్టర్ రెడ్డి సాబ్ …ప్రతి విద్యా సంవత్సరం గురుకులాల్లో కాంట్రాక్టు దక్కించుకొని నాసిరకం సరుకుల సరఫరా తో మమ అనిపించి… బాగానే ఈ కాంట్రాక్టర్ వెనకేసినట్లు ఆరోపణలు ఉన్నాయి….టెండర్ వేస్తే చాలు కాంట్రాక్ట్ ఆరు నూరైన తనకే వచ్చేలా చేసుకునే ఇతగాడిని ఏ అధికారి హ(ర)మేష కాంట్రాక్టు నీకెలా….?అని ప్రశ్నించడం లేదట…అంటే గురుకులాల్లో ఈ రెడ్డి సాబ్ పరపతి ఏ స్థాయిలో ఉందో ఈజీగా అర్థం అవుతుంది…వరంగల్ ఉమ్మడి జిల్లాలోని సాంఘీక సంక్షేమ ,కేజిబివి, ఎం జె పి,గిరిజన,మైనార్టీ గురుకులాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో శాఖ గురుకులాల్లో పదుల సంఖ్యలో కాంట్రాక్టు దక్కించుకున్న ఆయన గురుకులాలకు నాసిరకం సరుకులు సరఫరా చేయడంలో ఆరితేరారట…ప్రొవిజేన్స్ కాంట్రాక్టుల్లో తాను దిట్ట అంటూ తనకుతానే గొప్పగా చెప్పుకొనే ఇతగాడు మిగతా ప్రొవిజేన్స్ కాంట్రాక్టర్లను డామినేట్ చెయ్యడానికి ప్రయత్నిస్తాడట…ఏ సమస్య వచ్చినా తానే పరిష్కారం చేస్తానని పసలేని వాగ్దానాలు చేస్తూ వారిని అప్పుడప్పుడు బురిడీ కొట్టిస్తాడని ప్రచారం జరుగుతోంది….అంతేకాదు టెండర్ వేసి పదుల సంఖ్యలో కాంట్రాక్టులు దక్కించుకునే వరకు జీ హుజూర్ అన్నట్లు ఉండే ఈ ప్రొవిజేన్స్ కాంట్రాక్టర్ ఒక్కసారి తనకు టెండర్ ఒకే కాగానే కొద్ది రోజులు ఆగి ఈ ప్రొవిజేన్స్ రేటు తక్కువ ఇస్తున్నారు..ఆ ప్రొవిజేన్ రేటు తక్కువ ఇస్తున్నారని వస్తువుల సరఫరా విషయంలో కొర్రీలు పెడతాడట….అంతేకాదు ఏకంగా ఉన్నతాధికార్లనే కలిసి ఇలా అయితే కాంట్రాక్టర్ గా కొనసాగలేం అంటూ డాంబికపు మాటలు మాట్లాడుతాడట….ఇలాగే గతంలో ఓ ఉన్నతాధికారిని కలిసి కంది పప్పు బయట మార్కెట్ లో మూడు వందలు ఉంది సర్కార్ ఇచ్చే రేటు తమకు గిట్టుబాటు కాదని చెప్పి రేటు పెంచితేనే ఉంటామని చెప్పి సర్కార్ కేటాయించిన ధర కంటే ఓ పది రూపాయలు ఎక్కువ పెంచేలా చేశాడట….ఆ ఉన్నతాధికారి కందిపప్పు రేటు ఎంతపెంచినా ఇతగాడు గురుకులాలకు సరఫరా చెసేది మాత్రం థర్డ్ క్వాలిటీ నాసిరకం కండిపప్పేనట ఈ పప్పు మార్కెట్ లో ముఖ్యంగా ఖమ్మంలో 70 నుంచి 90 రూపాయలకే దొరుకుతుందట…. ఇలా గురుకులాలకు నాసిరకం కందిపప్పు అందించే ఈ కాంట్రాక్టర్ సర్కార్ రేటు విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాడట….కాగా ఈ విద్యా సంవత్సరం ముగిసి గురుకులాలకు ప్రొవిజేన్స్ సరఫరా చేసేందుకు త్వరలోనే టెండర్ నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో మళ్ళీ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు ఈ కాంట్రాక్టర్ రెడ్డి సాబ్ అప్పుడే పావులు కదుపుతున్నాడట….ఇదిలాఉంటే ఓ శాఖ గురుకులాలకు అధికారిగా వ్యవహరిస్తున్న ఓ అధికారి తనకు క్లాస్ మెట్ అని ఇతర అధికారులు,కాంట్రాక్టర్ల వద్ద ఈ కాంట్రాక్టర్ తెగ పోజులు కొడుతున్నట్లు తెలిసింది…..

కాంట్రాక్టర్లకు కాసులు కురిపిస్తున్న కందిపప్పు….?
మరోసంచికలో…..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular