Thursday, July 25, 2024

“వైబ్రాంట్” వింత పోకడ

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే తల్లిదండ్రుల ఆశలను పెట్టుబడి మలుచుకొని కార్పొరేట్ విద్యా వ్యాపారానికి తెర లేపాయి కొన్ని విద్యా సంస్థలు. ఆకర్షణీయమైన రంగురంగుల కరపత్రాలు ముద్రించి విద్యార్థులకు అఫ్ లైన్ టెస్టు ద్వారా కోట్లల్లో స్కాలర్షిప్ లు ఇస్తామంటూ ఆశ చూపుతూ వారి తల్లిదండ్రుల నుండి లక్షల్లో ఫీజులు వసూలు చేసి వారిని నిలువు దోపిడీ చేసే ప్రయత్నం చేస్తున్నాయి.బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుండి ఎలాంటి అనుమతులు లేకున్నా  ప్రత్యేకంగా పీ ఆర్ ఓ లను నియమించుకొని యథేచ్ఛగా అడ్మిషన్ల ప్రక్రియ మొదలుపెట్టి సీటు రిజర్వ్ పేరుతో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు.రాజస్థాన్ కోట కార్పొరేట్ విద్య పేరుతో హన్మకొండ నగరంలోని నక్కలగుట్ట లో  సరికొత్త దందాకు తెరలేపారు విద్యా వ్యాపారులు.నీట్,జే ఈఈ మెయిన్స్ లాంగ్ టర్మ్ కోచింగ్ పేరుతో అందిన కాడికి దోచుకునేందుకు సిద్ధపడుతున్నారు.ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేరన్న విమర్శలు నగరవాసుల నుండి వెల్లువెత్తుతున్నాయి పైగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులే ఆ కళాశాల యాజమాన్యానికి సహకరిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.. సరిగ్గా ఇదే కోవాకు చెందింది హన్మకొండ నక్కలగుట్టలోని వైబ్రాంట్  అకాడమీ నగరంలో కాలేజి నిర్వాహణకు విద్యాశాఖ నుండి ఎలాంటి అనుమతులు లేనప్పటికీ ఏసీ క్యాంపస్ అంటూ రెండు కోట్ల రూపాయల స్కాలర్షిప్ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను బురిడీ కొట్టించే ప్రయత్నం మొదలుపెట్టింది.అల్ ఇండియా ర్యాంకులంటూ అమాయక విద్యార్థులను బుట్టలో వేసుకుంటుంది.నగరంలో భారీగా హోర్డింగులు ఏర్పాటుచేసుకున్న వైబ్రాంట్ కళాశాలకు ఇప్పటి వరకు కళాశాల బిల్డింగ్ లేకపోవడం అనేది కొసమెరుపుగా మారింది.

కార్పొరేట్ స్కూల్ టెన్త్ విద్యార్థులే వీళ్ళ టార్గెట్..

ఇక అడ్మిషన్ల విషయానికి వస్తే వైబ్రాంట్ కాలేజీకి సంబంధిత శాఖల నుండి అనుమతులు లేకున్నప్పటికి ఇప్పటికే యాబైకి పైగా అడ్మిషన్లు పూర్తి చేసినట్లు సమాచారం.ప్రత్యేకంగా అడ్మిషన్ల కొరకు పీఆర్వో లను నియమించుకొని వారికి ప్రతి అడ్మిషన్ పై విద్యార్థి చెల్లించిన ఫీజులో వారికి కమిషన్ ముట్టజెప్పుతూ అక్రమంగా సొమ్ముచేసుంకుంటుంది ఈ కార్పొరేట్ విద్యాసంస్థ.ప్రయివేటు పాటశాలల్లో చదివే టెన్త్ విద్యార్థులనే టార్గెట్ గా వీరు అడ్మిషన్లు రిజిస్టర్ చేస్తూ లక్షల్లో వెనకేసుకుంటున్నారని విద్యార్థుల తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు.

వైబ్రాంట్ అకాడమీపై చర్యలుంటాయా….?

అకాడమీ అసలు కథ…

ఇంటర్మీడియట్ విద్యాశాఖకు ఎందుకింత నిర్లక్ష్యం…?

పూర్తి వివరాలు మరో సంచికలో….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular