Thursday, July 25, 2024

విశ్వ సుందరి షెన్నీస్

ఏడాది మిస్ యూనివర్స్ కిరీటాన్ని నికరాగ్వా దేశానికి చెందిన అందాల భామ షెన్నిస్ పలాసియోస్ద దక్కించుకుంది. ఎల్ సాల్వడార్‌లోని జోస్ అడాల్ఫో పినెడా అరేనాలో జరిగిన 72వ మిస్ యూనివర్స్ పోటీల్లో ఆమె విజేతగా నిలిచింది. మాజీ విశ్వ సుందరి ఆర్‌ బానీ గాబ్రియేల్‌ చేతుల మీదుగా ఆమె ఈ కిరీటాన్ని అందుకుంది. దీంతో ఈ విశ్వ సుందరికి నెటిజన్లు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ పోటీల్లో మనదేశం తరపున పోటీపడిన శ్వేతా శారదా సెమీస్‌లో టాప్-20కు అర్హత సాధించినప్పటికీ టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయింది. శ్వేతా శారదా చండీగఢ్‌కు చెందిన యువతి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular