Thursday, July 25, 2024

విచారణ ముగిసేదెప్పుడు…?

రాష్ట్ర రవాణాశాఖలో అక్రమ ప్రమోషన్ల విచారణ ఇప్పటికీ అతిగతి లేకుండా పోయినట్లు కనిపిస్తోంది… గత ప్రభుత్వ హయాంలో రవాణాశాఖలో తన హావాను కొనసాగించి రవాణాశాఖ అంటేనే తాను అన్నట్లు అక్రమ వ్యవహారాలు నడిపిన పాపాలరాయుడు అతనికి శాఖలో అత్యంత దగ్గరగా ఉండే తమ్ముడు శీను ఇతరులపై అక్రమ ప్రమోషన్ల ఆరోపణలు వచ్చాయి… సీనియర్లను కాదని అసలు అర్హత లేకున్నా ఈ డి టి సి లు ప్రమోషన్లు పొందారని ఆ శాఖలో ఆరోపణలు వెల్లువెత్తాయి… అంతేకాదు కొందరు సీనియర్లు ఈ అక్రమ ప్రమోషన్ల పై పదవీ విరమణ పొందిన ఇప్పటికి ప్రశ్నిస్తున్నారు…ఐయితే అప్పట్లో తమకు అనుకూలమైన సర్కార్ ఉంది కాబట్టి పాపాలరాయుడు, తమ్ముడు శీను అండ్ కో ఆడింది ఆటగా పాడింది పాటగా కొనసాగింది కానీ ప్రభుత్వం మారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పాపాలరాయుడు,తమ్ముడు శీను అక్రమ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి… వీరి వ్యవహారాలపై న్యూస్10 అనేక కథనాలు వెలువరించింది… దింతో వీరికి సంబంధించిన అక్రమ ప్రమోషన్లపై విచారణ చేసేందుకు ప్రభుత్వం జె టి సి స్థాయి అధికారి నేతృత్వంలో ఓ విచారణ కమిటీని వేసింది….కానీ ఈ విచారణ కమిటీ అక్రమ ప్రమోషన్ల విషయంలో ఇప్పటివరకు ఎం తేల్చిందనే విషయం ఎవరికి శాఖ లోని వారికే ఎం అర్థం కాకుండా పోయిందట… అంతేకాదు అసలు ఈ విచారణ కమిటీ నామమాత్రంగా కొనసాగుతుంది తప్ప అక్రమ ప్రమోషన్ల విచారణ విషయంలో ఒక్క అడుగు ముందుకు వేసింది లేదనే ఆరోపణలు సైతం ఉన్నాయి…మరోవైపు ఈ కమిటీ వేసిన తర్వాత పాపాలరాయుడు తన ఉద్యోగానికి స్వస్తి చెప్పి వి ఆర్ ఎస్ తీసుకోగా ,బదిలీల్లో భాగంగా తమ్ముడు శీను స్థాన చలనం పొందగా ఇంకొందరు సైతం బడిలీపైనే వెళ్లారు కానీ అక్రమ ప్రమోషన్ల విచారణ విషయంలో మాత్రం ఆవగింజంత పురోగతి లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి….. కాగా ఈ అక్రమ ప్రమోషన్ల విషయంలో విచారణ జరువుతున్న కమిటీకి నేతృత్వం వహిస్తున్న జె టి సి అక్రమ ప్రమోషన్లు పొందారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాపాలరాయుడు, తమ్ముడు శీనుకు అత్యంత ఆప్తుడని తెలుస్తుంది…వీరికి దగ్గరి వ్యక్తి కావడం అందులో తమ్ముడు శీనుకు రవాణాశాఖలో మార్గదర్శి లాంటివాడు కావడంతో ఇక విచారణ ఎందుకు ముందుకు సాగుతుందని రవాణాశాఖలోనే పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు…. అక్రమ ప్రమోషన్లపై విచారణ జరిగితే ప్రధానంగా తమ్ముడు శీను అక్రమ లీలలు,వసూళ్ల భాగోతం బయటపడుతుందని అందరూ భావిస్తుంటే ఇప్పటికి ఈ విచారణ అసలు ముందుకు కొనసాగకపోవడం ,విచారణ అధికారిగా వారికి దగ్గరి అధికారే ఉండడం ఈ విచారణపై పూర్తిస్థాయి నీలినీడలు కమ్ముకున్నట్లు రవాణాశాఖలో ఉద్యోగులు చర్చించుకుంటున్నారు….కొందరైతే అసలు ఆర్ టి ఏ లో అక్రమ ప్రమోషన్ల పై విచారణ ఏమైనట్లు …? అని ప్రశ్నిస్తున్న రవాణాశాఖ ఉన్నతాధికారులు ఎం తేల్చకుండా పూర్తి నిర్లక్ష్యంగా వ్య వహరిస్తున్నారని బాహాటంగానే రవాణాశాఖ ఉద్యోగుల్లో చర్చ సాగుతోంది….మరి ఈ అక్రమ ప్రమోషన్ల వ్యవహారంపై రవాణా శాఖ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి….

అన్ని జిల్లాల్లో అదే వసూళ్ల దందా….?

బదిలీలు జరిగినా వసూళ్లలో తేడా లేదు..

రవాణాశాఖలో వసూళ్ల దందా పై న్యూస్10 విశ్వసనీయ వరుస కథనాలు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular