Tuesday, May 28, 2024

వరంగల్ పశ్చిమలో బీజేపీ కి షాక్

బి జేపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి ఆ పార్టీకి షాక్ ఇచ్చారు….ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఒక్కో నేత బిజెపి ని వీడుతుంటే తాజాగా రాకేష్ రెడ్డి తాను సైతం బీజేపీ కి గుడ్ బై చెపుతున్నట్లు హన్మకొండలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ప్రకటించారు…పార్టీ నుంచి తనకు అన్ని అవమానాలే ఎదురయ్యాయని కన్నీటి పర్యంతమయ్యారు…. వరంగల్ పశ్చిమ టికెట్ ఆశించిన రాకేష్ రెడ్డి ఆ టికెట్ రావు పద్మ రెడ్డి కి ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు….మహిళలకు టికెట్ ఇస్తారు సరే మరి బీజేపీ లోని యువ నాయకుల పరిస్థితి ఏంటి….నెత్తురు చచ్చాక ఇస్తారా…?బీజేపీ లో ప్రశ్నించే గొంతులను కోసేస్తున్నారు అంటూ రాకేశ్ రెడ్డి ఆవేదన చెందారు…..

పార్టీ నే కుటుంబం అనుకున్న….

పార్టీ నే కుటుంబం అనుకున్న, పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు అనుకున్న అని ఏనుగుల అన్నారు
11 ఏండ్ల ప్రస్థానంలో ఏ కార్యక్రమం ఇచ్చినా నిబద్ధతతో శక్తి వంచన లేకుండా పని చేసానని కానీ టికెట్ అడిగిన పాపానికి పార్టీ తనను పక్కన పెట్టిందన్నారు…రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు తిరిగి వందల మంది కార్యకర్తలను తయారు చేశానని, పార్టీలో తన పదేళ్ల శ్రమ ఉందని,ఇంచార్జిగా బాధ్యతలు ఇస్తే ఆదిలాబాద్, కొత్తగూడెం అడవులకు వెళ్లి పనిచేసినా కానీ పార్టీ అనేక అవమానాలకి గురి చేసిందన్నారు

ప్రెస్ మీట్లు పెట్టోద్దా….?

రాష్ట్ర అధికార ప్రతినిధి హోదాలో కనీసం పార్టీ జిల్లా ఆఫీస్ లో తనను కనీసం ప్రెస్ మీట్లు కూడా పెట్టనివ్వలేదని అయినా ఏ నాయకుడు ప్రశ్నించలేదని,
ఏ డివిజన్ కి వెళ్తే ఆ డివిజన్ అధ్యక్షుడితో కంప్లైంట్ చేయించి నోటీసులు అంటూ ప్రచారం చేసారని రాకేష్ రెడ్డి అన్నారు….
తనతో మాట్లాడిన పాపానికి డివిజన్ అధ్యక్షులను పార్టీ నుంచి తొలగించారని,11 ఏండ్ల లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక్క కంప్లైంట్ కూడా చేయలేదన్నారు…

సమస్యలపై పోరాడా….

ఓరుగల్లులో ప్రతి సమస్య పై గొంతు విప్పి పార్టీకి తాను ఆదరణ పెంచానని, పార్టీ గౌరవాన్ని పెంచిన. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లానని,
కార్యకర్తలను మోటివేట్ చేసి సర్పంచ్, ఎంపీటీసీ నుంచి కార్పొరేటర్ల వరకు అందరినీ గెలిపించానని రాకేశ్ అన్నారు….

టికెట్ అడగడం తప్పా….?

అన్ని అర్హతలు సాధించిన తర్వాత
చివరకు వరంగల్ వెస్ట్ అభ్యర్థి గా తనపేరు కన్సీడర్ చేయాలని చేయడమే తాను చేసిన తప్పా..? అని బిజేపి పెద్దలను రాకేశ్ రెడ్డి ప్రశ్నించారు….టికెట్ అడిగినప్పటి నుంచే ఎన్నో రకాలుగా తనను ఇబ్బంది పెట్టారని,తనకు నోటీస్ ఇస్తే.. ఏ ఒక్కరూ స్పందించలేదని.. ఇదేం పార్టీ అన్న ఆయన సర్వేల ఆధారంగానే టికెట్ ఇస్తామని బీజేపీ నాయకులు చెప్పడం పచ్చి బూటకమని అన్నారు….

పశ్చిమలో కష్టపడ్డా…..

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో
సర్వేలు, పబ్లిక్ టాక్ మొత్తం తన వైపే ఉందని . కానీ టికెట్ ఎవరికి ఇచ్చారని రాకేశ్ ప్రశ్నించారు… ప్రతి డివిజన్ తిరిగి 30 వేల కుటుంబాలను తాను కలిసానని. ఏమైనా అంటే భవిష్యత్ ఉందని అంటున్నారని,వయస్సు ఐపోయాక, నెత్తురు చచ్చినంక ఇస్తారా.? బీజేపీ లో యువతకు స్థానం లేదు. ప్రశ్నించే గొంతులను కోసేస్తున్నరని అన్నారు..నాడు దేవు సాంబయ్య నుంచి తన వరకు.. ప్రజా బలం ఉన్నోళ్లను అణచి వేస్తున్నారని రాకేశ్ ఆరోపించారు

సిద్ధాంతాలు లేవు…మన్ను లేవు

బీజేపీ పార్టీలో సిద్ధాంతాలు లేవు మన్ను లేవని రాకేశ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు….వరంగల్ పశ్చిమ అభ్యర్థిగా మూడు సర్వేల్లో తన పేరే ఉందని టికెట్ ప్రకటించే 25 రోజుల ముందు కమిటీ తన పేరుతోనే రిపోర్ట్ ఇచ్చిందని,ప్రజా బలం ఉండి టికెట్ అడిగిన ఏకైక నాయకుడిని తానెనన్నారు…బీజేపీ రెండవ లిస్ట్ ఒకే ఒక పేరుతో ఇచ్చారని.. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కొడుకు, వేల కోట్ల ఆస్తి పరుడు కాబట్టి ఆయనకు టికెట్ ఇచ్చారని ,పేద, రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్లకు టికెట్ ఇవ్వరా..?అని రాకేశ్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు….జిల్లా బీజేపీ ని శాసిస్తున్న ఒకాయన 30 ఏండ్ల నుంచి బీజేపీ కి పట్టిన శని అని,సిద్ధాంతం పేరు చెప్పి బానిసలుగా మారుస్తున్నారు. బీజేపీ లో ఎవరికీ అవకాశాలు లేవు. రావని రాకేశ్ రెడ్డి స్పష్టంచేశారు…
2019 లో 4 ఎంపీ లు గెలిచిన తర్వాత బీజేపీ కి మంచి అవకాశాలు ఉన్నాయని
కానీ వర్గ పోరు వల్ల పార్టీని భూ స్థాపితం చేశారని విమర్శించారు…అసలు
బీజేపీ కి మేనిఫెస్టో ఉందా? ప్రజల దగ్గరికి ఎలా వెళ్తారు.?అని ప్రశ్నించిన ఆయన
వరంగల్ పశ్చిమలో కరోనా, వరదల సమయంలో ఎంతగానో సేవ చేసినని వరద తాకిడికి నిలబడి ఆహారం అందించామని,. దీన్ని కనీసం పార్టీ ప్రశంసించలేదు. కానీ, ప్రజలు గుర్తించారని రాకేశ్ రెడ్డి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు…మొత్తానికి రాకేశ్ రెడ్డి బీజేపీ పై చేసిన విమర్శలు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో చర్చకు దారి తీస్తున్నాయి ఓ డైనమిక్ లీడర్ గా బీజేపీ ని ప్రజల్లోకి తీసుకెళ్లిన ఏనుగుల రాకేశ్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయడం ఎన్నికల వేళ ఆ పార్టీకి పెద్ద దెబ్బె…బీజేపీ ఓట్లకు సైతం పశ్చిమలో బాగానే గండి పడే అవకాశం ఉందని కమలం పార్టీలో చర్చ జరుగుతోంది…..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular