Saturday, July 27, 2024

మైనింగ్ అధికారి ఎం చేస్తున్నట్లు…?

వరంగల్ ఉమ్మడి జిల్లాలో గ్రానెట్ క్వారీల ఇష్టారాజ్యం కొనసాగుతుంది…హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం లింగవారి గూడెం లో ఓ రెండు క్వారీలకు ఈ సి లేకున్నా పనులు కొనసాగిస్తున్నారు…ఈ రెండు క్వారీలకు ఈ సి లేదని మైనింగ్ అధికారులకు తెలిసిన వారిపై కనీస చర్యలు తీసుకోకుండా గమ్మున ఉంటున్నారు….ఈ సి ఉంటేనే గ్రానైట్ క్వారీ నిర్వహించాలని నిబంధనలు ఉన్న ఈ రెండు క్వారీల యాజమాన్యాలు మాత్రం నిబంధనలతో తమకేం పనిలేదన్నట్లు వ్యవహరిస్తున్నారు….కాగా మీకు మేము మాకు మీరు అనే రీతిలో మైనింగ్ అధికారులు ,కొంతమంది గ్రానైట్, స్టోన్ మెటల్ క్వారీల యజమానులు పరస్పరం సహకరించుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ క్వారీలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నప్పటికి ఇరువురి మధ్య జరిగిన రహస్య ఒప్పందం ప్రకారం మైనింగ్ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ సి లేకుండా క్వారీల్లో తవ్వకాలు జరుపొద్దని నిబంధనలు ఉన్నప్పటికీ ఇటు మైనింగ్ అధికారులు కానీ క్వారీల యాజమాన్యం కానీ ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనేది హన్మకొండ జిల్లా లింగవారిగూడెం లో నడుస్తున్న గ్రానైట్ క్వారీలను చూస్తేనే అర్ధమవుతుంది

మైనింగ్ “ఏడి” మౌనమెందుకో…. ?

హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం లింగవారిగూడెంలో ఉన్న ఆ రెండు క్వారీలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈ సి లు లేకుండా నడుస్తున్న విషయం జిల్లా మైనింగ్ ఏ డి కి తెలిసినప్పటికీ మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది.లింగవారిగూడెం లోని సాయి గ్రానైట్, జె ఎమ్ జె గ్రానైట్ క్వారీలు ప్రభుత్వం నుండి “ఈ సి” లు లేకుండానే తమ ఇష్టానుసారంగా తవ్వకాలు చేపట్టడం వెనుక మైనింగ్ అధికారుల హస్తం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. నిత్యం గ్రానైట్ క్వారీలు, స్టోన్ మెటల్ క్వారీల పై తనిఖీలు చేసే మైనింగ్ అధికారులు ఈ రెండు క్వారీలపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో ఆ శాఖ అధికారులకే తెలియాలి. ఆ రెండు క్వారీలకు “ఈ సి” లు లేకున్నా యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారంటే క్వారీల యాజమాన్యo మైనింగ్ అధికారులకు ఏస్థాయిలో అమ్యామ్యాలు ముట్టజెపుతున్నారో నని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు…. ఇకనైనా ఈ గ్రానెట్ క్వారీలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు…..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular