Thursday, June 13, 2024

నాగజ్యోతి కి మా మద్దతు లేదు

మావోయిస్టుల సంచలన ప్రకటన

ములుగు బి ఆర్ ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతికి తాము ఎప్పుడు మద్దతు ప్రకటించలేదని ఆమెకు మా మద్దతు లేదని మావోయిస్టులు సంచలన లేఖ విడుదల చేశారు…కావాలనే బి ఆర్ ఎస్ నాయకులు బోగస్ ప్రచారం చేస్తున్నారని అన్నారు …తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో తాము ఎప్పుడో అధికార పార్టీ నాయకులను తన్ని తరమాలని,ప్రతిపక్షాలను నిలదీయాలని చెప్పామన్నారు…ఈ విషయమై జె ఎం డబ్ల్యు పి మావోయిస్టు కార్యదర్శి వెంకటేష్ మీడియాకు ప్రకటన విడుదల చేసారు… ఆ ప్రకటన సారాంశం యదాతదంగా మీకోసం…

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

JMWP 25 52

పత్రికా ప్రకటన

తేదీ నవంబర్ 2023

ములుగు నియోజకవర్గంలో TRS పార్టీ అభ్యర్థిని మావోయిస్టు పార్టీ మద్దతు ఇస్తున్నారని TRS లీడర్లు, మాజీ మావోయిస్టులు చేస్తున్న ప్రచారం బూటకం, పచ్చి అబద్ధం ప్రజలు ఎవరు నమ్మవద్దు,

మా పార్టీ సాధారణంగా పార్లమెంటు వ్యవస్థలో భాగంగా జరుగుతున్న బూటకపు ఎన్నికలను బహిష్కరిస్తుందనే మా పార్టీ విధానం ప్రజలందరికీ తెలిసిందే. అందులో భాగంగానే తెలంగాణలో బూటకపు ఎన్నికలను బహిష్కరించండి, బ్రాహ్మణీయ హిందుత్వ BJP కి BJP కి మద్దతునిచ్చే అవకాశవాద BRS ను తన్ని తరిమండి ప్రతిపక్ష పార్టీలన్నింటిని నిలదీయండి.ఈ స్పష్టమైన వైఖరిని మేము పత్రికలకు, ఎలక్ట్రానిక్ మీడియాకు విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే, ఎందుకంటే ఈ దేశంలో అర్ధ వలస- అర్ధ భూస్వామ్యమే రాజ్యమేలుతోంది. అంటే సామ్రాజ్యవాదులు దళారి నిరంకుశ పెట్టుబడిదారులు, భూస్వాములే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. బ్రిటీష్ వలసవాదుల నుండి అధికార మార్పిడి జరిగింది కాని ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు.

నీళ్ళు, నిధులు, నియామకాల కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసి తెలంగాణాను సాధించుకున్నారు. BRS పార్టీ 2014 లో అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు పరిపాలించింది.కాని ప్రజలకు కోసం ప్రకటించిన ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు,సంస్కరణ పథకాలన్నీ వారి అనుచరులకు చెందినవి. కాబట్టి వారి, బ్రతుకులో ఎలాంటి మార్పు రాలేదు. Delta * s_{2} ^ 6 ఏండ్ల నుండి సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు రాలేదు. హరిత హారం పేరుతో సాగుచేస్తున్న భూములను స్వాధీనం చేసుకుని మొక్కలు నాటారు. రైతు బందు రాలేదు. 5వ షెడ్యూల్, పెసా చట్టాన్ని అమలు చేయడం లేదు. G 0 3 ని ఎత్తి వేయడమంటే నామమాత్రపు ఉద్యోగాలు కూడా రావు. ఈ పాలకులు దోపిడీ వర్గాలకు దోచిపెట్టడమే వారి ప్రధాన లక్ష్యం.

76 సంవత్సరాల నుండి అనేకసార్లు బూర్జువా పార్టీలకు ఓట్లు వేస్తూ అధికారాన్ని మారుస్తూ వచ్చాము కాని ఏ బూర్జువా పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రజల మౌలిక సమస్యలు ఒక్కటి కూడా పరిష్కరించబడలేదు. కాబట్టి దోపిడీదారులైన సామ్రాజ్యవాదులు, దళారి నిరంకుశ పెట్టుబడిదారులు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారానే అన్ని సమస్యలు పరిష్కరించబడుతాయి.

బూర్జువా పార్టీలన్నీ కులం, మతం, జాతి బంధు ప్రీతిని ఉపయోగించి డబ్బు వెదజల్లుతూ, మద్యం ఏరులై పారిస్తు,సంస్కరణ పథకాలు మీకు ఇస్తామని ఒక పక్క చెప్పుతూనె, మరోపక్క ఓటు వేయకుంటే మీకు అన్ని బందు చేస్తామని బెదిరింపులకు గురి చేసి అన్ని హంగులను ఉపయోగించి ఓట్లు వేయించుకుని అధికారంలోకి రావాలని చూస్తారు. కాని మావోయిస్టులు పార్టీ పీడిత ప్రజల కోసం పనిచేస్తుందని ప్రజలందరికీ తెలిసిందే. కాని కొంత మంది BRS లీడర్లు,మాజీ మావోయిస్టులు ఈ నియోజకవర్గంలో BRS పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు ఎవరు నమ్మవద్దు. మేము ఏ అభ్యర్థికి, ఏ పార్టీకి సపోర్ట్ చేయడం లేదని మేము ఈ బూటకపు ఎన్నికలను బహిష్కరించండి అనే పిలుపు పత్రికలకు, ఎలక్ట్రానిక్ మీడియాకు విడుదల చేసిన విషయం తెలిసిందే,బూర్జువ పార్టీలు, వ్యక్తులు ప్రజలను మోసం చేయడానికి పై కమిటీతో మాట్లాడుకున్నామని మా పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారాన్ని ప్రజలు ఎవరు నమ్మవద్దు. మా పార్టీ పేరు చెప్పుకుంటూ మాపై తప్పుడు ప్రచారం చేస్తున్న BRS లీడర్లు, మాజీ మావోయిస్టులు, వ్యక్తులు ఎవరు చెప్పినా ప్రజల్లో బహిర్గత పరుస్తామని హెచ్చరిస్తున్నాం.

Note: ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులారా ఈ పత్రికా ప్రకటన పూర్తి పాఠం ఇవ్వగలరు.

విప్లవాభివందనాలతో

కార్యదర్శి

వెంకటేశ్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular