Thursday, July 25, 2024

కొట్టే హక్కు ఎస్ పి సారుకెక్కడిదో..?

ఆ పోలీసు అధికారికి కొట్టే హక్కు ఎక్కడిది…..?

అవును ఇది ముమ్మాటికి నిజమే అడిగి నిలదీయాల్సిన ప్రశ్నే పెద్ద సారు ఐయినంత మాత్రాన ఆ పోలీసు అధికారికి కొట్టే హక్కు ఎవరిచ్చారు…భార్య పిల్లలను వదిలి,వ్యక్తిగత పనులను అత్యవసరాలను వదిలి…సెలవు పెట్టి పనులను చక్కబెట్టుకునే వెసులుబాటు ఉన్నా జాతర కోసం రాత్రింబవళ్లు కష్టపడితే ఎస్ పి సారు పెత్తనం తో ఓ ఆర్ ఎస్సై ని లాఠితో ఓ నిందితున్ని చితకబాదినట్లు చితకబాదడం ఆ ఎస్పీ సారుకే చెల్లింది….భార్య పిల్లలను అమ్మవార్ల దర్శనం కోసం తీసుకువెలితే అదేదో చెయ్యరాని తప్పు చేసినట్లు ఆ ఎస్సై భార్య పిల్లల ముందే బూతులు తిడుతూ ,లాఠీ తో చితకబాదడం కొట్టదని ఎస్సై భార్య పిల్లలు కాళ్లపై పడ్డ వినకుండా మరింత రెచ్చిపోయి కొట్టడమే కాకుండా మోకాళ్లపై కూర్చో బెట్టడం ఎస్ పి దొరగారికే చెల్లింది….ఈ తతంగాన్ని అక్కడ ఉన్న పోలీసులు అందరూ గమనిస్తున్న అయ్యో ఇదెక్కడి అన్యాయం అంటూ ఎస్ పి ని ప్రశ్నించాలని ఉన్న ఎక్కడ ఉద్యోగానికి ముప్పొ అని గమ్మున ఉండి ఘటన అనంతరం నిరసన తెలిపి ఎస్ పి దొరగారు మేము సైతం ప్రశ్నిస్తాం అని నిరూపించుకున్న… భార్య పిల్లల ముందు లాఠీ తో దెబ్బలు తిని,బండబూతులు తిన్న ఆ ఎస్సై పరిస్థితి ఏంటి…?పోలీసు శాఖ పై ఆ కుటుంబానికి కలిగే అభిప్రాయం ఏంటి…?అవసరమైన సమయంలో కూడా మాతో గడపకుండా విధుల్లో 24 గంటలు తలమునకలు ఐయ్యే మా నాన్న పరిస్థితి ఇదా…మా నాన్న పై అధికారులు మరి ఇంతటి ఆలోచన లేని వారిలా ఉంటారా…?అని వారు అనుకుంటే ఎలా…?నిజానికి వీటన్నింటికి అధికారం ఉంది కదా అని ఎదుటి అధికారి హక్కును కూడా గుర్తించకుండా ఇష్టారీతిన ప్రవర్తించిన ఆ ఎస్పీ చెప్పాలి….విధులు సరిగా నిర్వర్తించకుంటే అక్కడి డ్యూటీ నుంచి తొలగించాలి ,ఇది సరైన పద్ధతి కాదని వార్నింగ్ ఇవ్వాలి ,లేదంటే సస్పెండ్ చేయాలి ఇది ఓ పెద్దాపీసర్ వ్యవహరించాల్సిన తీరు…అంతేకాని లాఠీ తో కొట్టే హాక్కు ఎవరు ఇచ్చారు…. ఉద్యోగ పరంగా పెద్ద సారే కావచ్చు…కానీ ఆయన పోలీసు శాఖ లో ఓ ఉద్యోగే అనే విషయం మరిచిపోతే ఎలా….?విధుల్లో ఉన్న అధికారిపై సామాన్య ప్రజలు తిరగబడితే,తప్పిదారి చేయి చేసుకుంటే ఇంతెత్తున లేచి కేసులు నమోదు చేసి పోలీస్ సత్తా చూపిస్తారు కదా…మరి కంచె చేను మేసిన చందాన…ఓ పోలీసు ఉన్నతాధికారి మరో పోలీసు అధికారిని కొడితే,అసభ్యపదజాలంతో దూషిస్తే ఏ కేసు నమోదు చేయాలి…?పోలీసు పెద్ద దొరలు చెప్పాలి ….?ఇప్పుడు ఆ ఎస్ పి దొరపై ఏ కేసు నమోదు చేస్తారో చెప్పాలి…లేదంటే పోలీసు మాన్యువల్ లో ఓ పెద్ద అధికారి కిందిస్థాయి అధికారిని కొట్టొచ్చు, బూతులు తిట్టొచ్చు ఇంకేమైనా చేయచ్చు అని ఉందని స్పష్టం చేయాలి…ఇంకోమాట పోలీసులను దూషించిన ,ఒకవేళ వారు ఏమైనా తప్పులు చేసిన అలాకాదు ఇలా,ఎందుకు దూషిస్తారు అని ప్రశ్నించే పోలీసు సంఘం ఎందుకు మౌనంగా ఉంటుందో కూడా చెప్పాలి…మేము మేము కొట్టుకుంటాం మీకెందుకు అని సమాజంలోకి ఓ మెసేజ్ పంపి చేతులు దులుపుకోండి….మరోవైపు మేడారం లో విధులు నిర్వహిస్తున్న ఆర్ ఎస్సై రవీందర్ ను ఎస్ పి గౌష్ ఆలం బూతులు తిడుతూ కొట్టడంపై అక్కడే జాతర నిర్వహణలో తలమునకలై ఉన్న మంత్రి సీతక్క కాని ఇతర ఉన్నతాధికారులు కానీ కనీసం మాటవరసకైనా ఈ విషయాన్ని ఖండించక పోవడం కింది స్థాయి పోలీసు అధికారుల్లోకి ఏ మెసేజ్ పంపినట్లో వారికే తెలియాలి….ఇప్పటికైనా పోలీసు పేద్ద సార్లు ఈ విషయంపై ఎలా స్పందిస్తారో… ఆలస్యంగానైనా సరైన రీతిలో స్పందిస్తారో లేదో చూడాలి…..ఇప్పటికే చేసిందంతాచేసి కుటుంభం ముందు ఆ ఎస్సై ని కొట్టి బండ బూతులు తిట్టి ఎస్పీ సాబ్ ఇంగ్లీషులో ఓ సారి చెప్పి ఒకే అనిపించారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular