Thursday, July 25, 2024

కేసీఆర్ నీకు కావాల్సిందే…!

రాజకీయాల్లో అధికార దాహం నిజంగా తీరనిదే… ఎన్ని ఏండ్లు అధికారంలో ఉన్న …అధికారం పోగానే మళ్ళీ అధికారం ఉంటే బాగుండు అనిపిస్తుంది…తప్పులు చేస్తే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిన ఇక ఆ తప్పులు చేయం అంటూనే మళ్ళీ అధికారంలోకి వచ్చి అవే తప్పులను మళ్ళీ పునరావృతం చేసి ఇక వీరు మారరు అని అనిపించుకున్న నేతలు ఉన్నారు…ఇది ఒక అంశం ఐయితే అధికారంలో ఉన్న పార్టీ లో ఉండి అధికార దర్పాన్ని తనివితీరా అనుభవించి అధికారం కోల్పోగానే అప్పటివరకు తాము కొనసాగిన పార్టీని ఎడం కాలితో తన్ని అధికారంలో ఉన్న పార్టీ వైపు గోడ దూకే నాయకులు ఉన్నారు…విచిత్రం ఏంటంటే పెవికాల్ లాగా పార్టీనే అతుక్కుని ఉన్న నాయకులను ఏ పార్టీ అధినాయకత్వం పట్టించుకోదు సరికదా అవకాశవాద రాజకీయం, సీజనల్ రాజకీయం చేసే రాజకీయ నాయకులకే పెద్ద పీట వేస్తారు…ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చూస్తుంది సరిగ్గా అదే…2001 లో తెలంగాణ ఉద్యమ పార్టీగా తన పార్టీ ప్రస్థానాన్ని మొదలుపెట్టి తెలంగాణాను సాధించి పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఒక్కరిద్దరిని తప్ప తనతో ఉద్యమంలో కలిసి వచ్చిన వారిని,ఉద్యమ కారులను పూర్తిగా విస్మరించాడనడంలో ఎవరేమి అన్న ,మీకు అవగాహన లేదు అనుకున్న ఇది అక్షరాల సత్యం… తన తన వీరాభిమానులను, పొమ్మన్న పార్టీ వదిలి పోనీ వారికి కేసీఆర్ చేసిందేమిలేదు…వారికి అధికారంలో ఉన్నప్పుడు ఓ పదవి కూడా ఇచ్చింది లేదు…. పదవీ యావ, అధికార దాహం ఉన్నవారికే పదవులు ఇచ్చి సామాజిక సమీకరణ ,రాజకీయఎత్తుగడలు,ప్రత్యర్థిని చిక్కుల్లోకి నెట్టడం,అవతలి పార్టీని నామరూపాలు లేకుండా చేయడం లాంటి సిద్ధాంతాలను కేసీఆర్ తనకు తోచినట్లు అమలు చేసి ఇప్పుడు అధికారం కోల్పోగానే ఇలా ఎందుకు అవుతుంది….?అని ఆలోచించడం అచ్చంగా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు గానే ఉందనడంలో ఆవగింజంతయిన అనుమానం లేదు…కేసీఆర్ రాజకీయంగా అనేక ఎత్తు పల్లాలు చూసారు…అనేక రాజకీయ సంక్షోభాలనూ చూసారు…కేసీఆర్ పినిక్స్ పక్షి లాంటి వాడు… ఇదంతా బాగానే ఉన్న గుండె ధైర్యం ,రాజకీయ వ్యూహం బాగానే ఉన్నా క్యాడర్ కావాలి కదా… అవకాశవాదులు అందరూ పార్టీ ని వదిలి వెళ్ళితే…గులాబీ కోసం మిగిలిన కరడు గట్టిన గులాబీ కార్యకర్తలు ,నాయకులు ఉన్న కేసీఆర్ కోసం వారెందుకు పని చేయాలి….కష్టపడి అంతా సిద్ధం చేశాక పార్టీని వదిలి వెళ్ళిన వారు సానుభూతి మాటలు చెప్పి,రాజకీయ వ్యూహం అంటూ ఊకదంపుడు మాటలు చెప్పి మళ్ళీ అధికారదాహం తీర్చుకోవడానిక …?కేసీఆర్ అధికారాన్ని కోల్పోవడం,ఉద్యమ నాయకులను, కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో అధికారం అనుభవించిన వాళ్ళు ఒక్కొక్కరుగా పార్టీని వదిలి వెళుతుంటే బయటి పార్టీ వాళ్ళు కాదు…సొంత పార్టీ వాళ్ళు గులాబి అభిమానులే కేసీఆర్ నీకు ఇలా కావాల్సిందే…అంటూ ఉన్నారు…ఇప్పటికి బి ఆర్ ఎస్ లో చెక్కుచెదరకుండా కేసీఆర్ ఉద్యమ బ్యాచ్ ఉంది కాని ఎం లాభం పది సంవత్సరాల అధికారంలో వారికి లభించిన ప్రాధాన్యత ఏంటో ఎవరు చెప్పనక్కరలేదు కేసీఆర్ ఒంటరిగా ఉన్నప్పుడు కాసింత వెనక్కి వెళ్లి ఆలోచించుకుంటే చాలు… రాజకీయ వ్యూహాలు బాగా రచించే కేసీఆర్ తనకంటూ ఓ రాటుదేలిన సైన్యం కావాలని, అధికారం ఉన్న, అది పోయిన తన వెంటే ఉండాలని ఎందుకు అనుకోలేదో…? ఆయనకే తెలియాలి…. రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణలు గులాబీ గోడ దూకి కాంగ్రెస్,బీజేపీ ల్లో గులాబీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీ లు చేరుతున్న కేసీఆర్ లో మార్పు రావడం లేదు అనిపిస్తుంది… నిన్నటికి నిన్న టికెట్ వద్దు నేను కమలం లోకి పోత అన్న వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను బలవంతంగా నందినగర్ కు రప్పించారు…వరంగల్ ఎంపీ టికెట్ నీకే అన్నారు…వద్దు అనగానే కాంగ్రెస్ లోకి జంప్ అవుతా అని పరోక్ష సంకేతాలు ఇచ్చిన కడియం శ్రీహరి కూతురుకు ఎంపీ టికెట్ ఇచ్చారు…. ఇది అధికార దాహమని ,పదవుల యావ అని ఇస్తే ఉంటారు లేకుంటే పక్క పార్టీ వాళ్లు ఆఫర్ ఇస్తే వెళ్తారు అని గులాబీ బాస్ కేసీఆర్ కు తెలియదా…? ఇప్పటికే కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇవ్వడం వల్ల ఉమ్మడి జిల్లాలో ఉద్యమకారులు రగిలిపోతున్నారు… ఉద్యమకారులకు ఇవ్వకుండా తండ్రి వారసత్వం తప్ప ఏ రాజకీయ అనుభవం లేని కావ్యకు ఇవ్వడం ఏంటని వారు ప్రశ్నిస్తుండగా ఇప్పుడున్న సంక్షోభంలో అది బి ఆర్ ఎస్ గెలుపుకు అవరోధం కాదా…?మరోవైపు పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి వ్యతిరేకత ఉన్న అధినేత టికెట్ ఇచ్చిన ఓడిపోయిన ఆరూరి రమేష్ బిజెపి లో చేరి ఎంపీ గా గెలిచి అధికారం అనుభవించాలని చూస్తున్నాడంటే కేవలం పదవి కోసం ఆరూరి వెంపర్లాడుతున్నాడని ఇప్పటికైనా అధినేతకు బోధపడుతుందో…లేదో…? అధికారం కోల్పోగానే పక్క చూపులు చూస్తున్న గులాబీ నేతలు అధినేత బుజ్జగించిన వినే స్థితిలో లేనివారు తనకు అవసరమో లేక పార్టీ కోసం తన వెన్నంటి నడిచే వారు అవసరమో ఇప్పటికైనా కేసీఆర్ తేల్చుకోవాలి…..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular