Thursday, July 25, 2024

కలెక్టర్ మేడం ఇదేంటి…?

ములుగు జిల్లాలో జిల్లా అధికారిగా కొనసాగేందుకు అసలు అర్హులైన ఉద్యోగులే లేనట్లు ఆ కలెక్టర్ మేడం కు కనపడినట్లు ఉంది….ఎన్నికల సంఘం మార్గదర్శకాలను సైతం పక్కనపెట్టి తనకు నచ్చిన ఓ జూనియర్ ఉద్యోగికి అర్హతలు పక్కన పెట్టి జిల్లా అధికారిగా అందలం ఎక్కించినట్లు ఆరోపణలు వస్తున్నాయి….మొన్నటివరకు ములుగు జిల్లా డి డబ్ల్యు ఓ గా కొనసాగిన ఈ ఉద్యోగి కి ఆ పోస్ట్ సరైంది కాదని తన పాత పోస్టింగ్ అయిన ఏ సి డి పి ఓ పోస్ట్ కే ఇటీవల తిరిగి పంపిస్తే రెండు వారాలు గడవక ముందే స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఆ ఉద్యోగిని మైనార్టీ శాఖలో అది జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిగా ఆఘమేఘాల మీద నియంనిచడం గంటల్లో ఆర్డర్ రావడం ఆ మేడం జాయిన్ కావడం ఓ ప్రెస్ విడుదల చేయడం చకచకా జరిగిపోవడం తో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ,మైనార్టీ శాఖ ఉద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేయడం వారి వంతైంది…అసలు జిల్లాలో జిల్లా అధికారి పోస్టుకు అర్హులే లేనట్లు ఏ సి డి పి ఓ ను మైనార్టీ సంక్షేమ శాఖ అధికారికి నియమించడం ఉద్యోగుల్లో చర్చకు దారితీస్తోంది….. అసలు ఓ ఏ సి డి పి ఓ గతంలో డి డబ్ల్యూ ఓ గా కొనసాగడాన్ని ఉద్యోగులంతా వ్యతిరేకించి ఇటీవలే మంత్రి సీతక్క కు మొరపెట్టుకుంటే ఆ పోస్టు నుంచి తొలగిస్తే తాజాగా ములుగు కలెక్టర్ ఆ ఏ సి డి పి ఓ పనిచేస్తున్న శాఖ కాకుండా మైనార్టీ శాఖ జిల్లా అధికారిగా నియమించడంలో ఆంతర్యం ఏంటో వారికే తెలియాలి…పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం అవుతుంటే ఓ వైపు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు బదిలీలు జరుగుతుంటే అర్హత లేని ఓ జూనియర్ ఉద్యోగికి కలెక్టర్ ఎలా జిల్లా అధికారి పోస్ట్ ఇచ్చారని జిల్లాలో పలువురు ప్రశ్నిస్తున్నారు….జిల్లా అధికారిగా విధులు నిర్వహించడానికి ఆయా జిల్లాలో అర్హులు లేకుంటే అర్హులైన సీనియర్ అధికారులను ఎఫ్ ఏ సి గా నియామించాలి తప్ప ఇలా ఓ ఏ సి డి పి ఓ స్థాయి ఉద్యోగిని జిల్లా అధికారిగా నియమిస్తే ఎలా అనే విషయాన్ని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గమనించకపోవడం ఏంటో అర్థం కావడంలేదు….మరోవైపు మొన్నటి వరకు ములుగు జిల్లా జిల్లా సంక్షేమ అధికారిగా కొనసాగి ఇప్పుడు మైనార్టీ సంక్షేమ అధికారిగా కలెక్టర్ చే నియమించబడ్డ ఇ పి ప్రేమలత డి డబ్ల్యు ఓ గా తొలగించాక తన పాత పోస్ట్ ఏ సి డి పి ఓ గా ఏటూరునాగారం లో కనీసం బాధ్యతలు చేపట్టనట్లు తెలిసింది…స్త్రీ శిశు సంక్షేమ శాఖలో సీనియర్లు ,అర్హత ఉన్న సి డి పి ఓ లు ఉన్న డి డబ్ల్యు ఓ గా కొనసాగిన ప్రేమలత ఆ విధులనుంచి పక్కన పెట్టగానే తాను జిల్లా అధికారిగా పనిచేసి ఏ సి డి పి ఓ గా పనిచేయలేనని మళ్ళీ పట్టుబట్టి జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిగా బాధ్యతలు చేపట్టినట్లు ప్రచారం జరుగుతోంది… ఏదిఏమైనా జిల్లా అధికారిగా పనిచేసేందుకు అర్హులు ఎవరు లేనట్లు ములుగు జిల్లా కలెక్టర్ ఓ ఏ సి డి పి ఓ ను జిల్లా అధికారిగా నియమించడం విమర్శలకు దారితీస్తుంది… మరి జిల్లా కలెక్టర్ ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకొని అర్హులను నియమిస్తార…లేక అలాగే కొనసాగిస్తార….? చూడాలి….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular