Friday, July 19, 2024

కన్నతల్లి సంతకం ఫోర్జరీ చేసిన పెద్ద కొడుకు..???

కన్నతల్లి సంతకం ఫోర్జరీ చేసిన పెద్ద కొడుకు

– అత్యుస్తాహం చూపిస్తున్న పోలీసులు

– 67 వయసులో న్యాయం కోసం కాళ్ళు అరిగేలా పోలీసులు, కోర్టు చుట్టూ తిరుగుతున్న తల్లి..
నా పేరు రెడ్డి సులోచన హైదరాబాద్ మీర్ పేట లో ఉంటాను,, సొంత ఊరు గద్దపాక, కేశవపట్నం మండలము కరీంనగర్. ఆమెకి ఇద్దరు కొడుకులు పెద్దకొడుకు విధ్యాధర్ రెడ్డి, చిన్న కొడుకు శశిధర్ రెడ్డి చిన్న కొడుకు 2005 లో ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్లి సంపాదిస్తూ ఇంటి పోషణ నిమిత్తం ప్రతినెలా డబ్బులు తల్లి బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు పంపించేవారు, పెద్ద కుమారుడు తల్లి కి తెలియదనీ తానే ఇంటి భాద్యతలు చూసుకుంటా అని మభ్య పెట్టీ ఏటీఎం కార్డ్ తన దగ్గరే పెట్టుకుని ప్రతి రోజు 10 వేల నుంచి 40,000 వేల దాకా డబ్బులు డ్రా చేస్తూ మోసం చేసి 8 సంవత్సరాల్లో 50 లక్షల దాకా వాడుకున్నాడు తల్లికి తెలిసి 2019 లో నిలదియగా ఆస్తి మొత్తం తనకే కావాలని తల్లిని మానసికం గా శారీరకం గా హింసించడం మొదలు పెట్టాడు తరువాత తల్లి కి తెలియకుండా పెళ్లి చేసుకొని వేరు కాపురం పెట్టుకున్నడు బయట నుంచి ఇంటికి వచ్చి రోజు కొడుతూ, భూతులు తిడుతూ ఊరిలో ఉన్న 4 ఎకరాల పొలం తన పేరున పట్టా చేయమని హింసించేవాడు ఈ క్రమం లో ఇంట్లో ఆమెని తిడుతూ చీర కొంగుతో ఉరివేసి చంపే ప్రయత్నం కూడా చెయ్యబోయ్యాడు ఈ విషయం సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో ఆ రికార్డ్ ఆధారంగా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో తల్లి ఫిర్యాదు చేయగా FIR No. 463/2019 కేస్ బుక్ చేశారు పోలీస్ వారి ముందు మంచిగా నటించి ఆరెస్ట్ చేయకుండా చూసుకున్నడు, పోలీస్ వాళ్ళు కూడా సొంత కొడుకు పైన కేసు ఏమిటని తల్లికి సర్ది చెప్పారు తల్లి కూడా సరే అని ఉరుకున్నారు. హైదరాబాదులో కేస్ అయిందని గద్దపాక వచ్చి తల్లి లేని సమయంలో ఇంటి తాళాలు తీసుకొని బీరువాలో ఉన్న ఇంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తల్లి పేరున ఉన్న భూమి పట్టా పాస్ బుక్కులు ఎత్తుకొని వెళ్ళాడు ఈ విషయమై కేశపట్నం పోలీస్ స్టేషన్ నందు రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు ఎంక్వయిరీ చేస్తామని చెప్పారు ఈ కేసులో ఏ విధమైన యాక్షన్ తీసుకోకపోవడంతో తల్లి రిజిస్టర్ పోస్టు ద్వారా కేశవపట్నం పోలీసువారికి కమిషనర్ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది అప్పటినుంచి చాలా ఫిర్యాదులు ఇచ్చినా ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడంతో హుజురాబాద్ కోర్టు నందు సివిల్ కేసు ఫైల్ చేపించారు తల్లి బతికున్నంత వరకు ఆస్తులు భూములు అనుభవించే హక్కు తల్లికే ఉండాలని కోర్టు ద్వారా పర్మినెంట్ ఇంజక్షన్ ఇవ్వమని, విచారణ చేసి తల్లి వైపున టెంపరరీ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు అయిన కూడా పెద్ద కొడుకు, విద్యాధర అయిన పులికోట విద్యానందం, సురేష్ వాసా, లంకుస్, మాజీ ఎంపీటీసీ పరశురాములు, మాజీ సర్పంచ్ బసవయ్య, కొమురయ్య, దేవునూరి భాగ్యమా, అజయ్ ఇంకా కొందరు గ్రామస్తులతో కుమ్మక్కై తల్లి ని బెదిరిస్తూ దౌర్జన్యంగా పొలం దున్నుకుంటున్నారు ఈ విషయమై కేశవపట్నం పోలీసులకి ఎమ్మార్వో కి ఫిర్యాదు చేసినప్పటికీ ఏ విధమైన చర్య తీసుకోకపోవడంతో ఈ విషయంలో కోర్టు ధిక్కరణ కేసు వేశారు. ఊరిలో తల్లిపై దౌర్జన్యం చేసినందుకు హైదరాబాద్ ఏసిపికి ఫోన్ చేసి చెప్పగా విద్యాధర్ నీ అరెస్టు చేసి రంగారెడ్డి కోర్టు నందు రిమాండ్ చేసి చర్లపల్లి జైలులో 14 రోజులు ఉన్నాడు మళ్లీ ఒక సంవత్సరం తర్వాత దేవుని కొమురయ్య భాగ్యమ్మ మా ఊరి సర్పంచు గోపు విజయకుమార్ నీ ఇంటి మీద తీసుకొచ్చి ఎస్సీ వారికి భూమి రిజిస్ట్రేషన్ చేయాలి అని గొడవ చేస్తూ తల్లి పైన ఎస్సీ ఎస్టీ కేసులు పెడతానని బెదిరించారు తల్లి ఏ విధమైన భూమి అమ్మలేదని భూమి అమ్మినట్టు పత్రాలు ఉంటే చూపియమని నిలదీయగా 2009 సంవత్సరంలో రాసినట్టున్న ఒక తెల్ల కాగితం చూపించారు దానిపైన 102 సర్వేనెంబర్ లోని తల్లి పేరును ఉన్న రెండెకరాల ఏడు గుంటల భూమిని తల్లి విద్యాధర్ కలిసి అమ్మినట్టు తల్లి భర్త తమ్ముడు నరేందర్ రెడ్డి సాక్షి సంతకంతో మరికొందరు సాక్షుల సంతకంతో అమ్మినట్టు పత్రం సృష్టించారు ఆ సంతకం నేను పెట్టలేదు నాకు సంతకం తో సంబంధం లేదని తల్లి వెంటనే పోలీసు స్టేషన్ నందు నా సంతకం ఫోర్జరీ చేశారని విద్యాధర్, నరేందర్ రెడ్డి, దేవి నూరి కొమరయ్య, భాగ్యమ్మ వారి పైన ఫిర్యాదు చేసినా పోలీసు వారు ఏ విధమైన యాక్షన్ తీసుకోకపోవడంతో హుజురాబాద్ కోర్టు నందు ప్రైవేట్ కంప్లైంట్ వేసి ఫోర్జరీ ఎఫ్ ఐ ఆర్ నమోదు చేపించారు కోర్టులో తల్లి సంతకాలు తీసుకొని పరీక్ష నిమిత్తం ల్యాబ్ కి పంపించారు రిపోర్టు కోసం పలుమార్లు స్టేషన్లో అడగగా రాలేదని చెప్పారు ఇంతలో చిన్న కొడుకు శశిధర్ జూన్ 30వ తారీఖున పెళ్లి నిమిత్తం అమెరికా నుంచి కుటుంబ సమేతంగా వచ్చాడు జులై 13 తేదీన మేమంతా కలిసి గతపాక వేళ్ళాము 15వ తేదీన శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకి కేశవపట్నం పోలీస్ స్టేషన్ కి వెళ్ళాము ఫోర్జరీ కేసు రిపోర్టు వచ్చినందున ఫోర్జరీ పరీక్షల నిమిత్తం మేము ఇచ్చిన ఇంటి పత్రాలు తిరిగి ఇవ్వమని అడిగాము ఎస్ఐ చంద్రశేఖర్ ఫోర్జరీ కేసు ఫైనల్ కాలేదని ఆర్డర్ రాలేదని చెప్పారు మేము ఫోర్జరీ చెయ్యలేదు అని కోర్టులో ప్రూఫ్ అయింది అని అడగగా ఏమీ లేదని చెప్పారు అయినా కొడుకు మీద కేసు లేనిది అన్నారు. 16 వ తారీకు పొద్దున్న విధ్యదర్ పంపించారని భూమి రిజిస్టర్ చేయండి ఫోర్జరీ కేసు లేదు ఎం లేదు అని దేవునూరి భాగ్యమ్మ ఆమె భర్త కొమురయ్య మా ఇంటి పైకి గొడవకి వచ్చారు మేము బయటకి రాలేదు 100 కి డయల్ చేసి పోలీస్ కి పిలిచే క్రమం లో భయపడి వెళ్ళిపోయారు 17వ తేదీ ఉదయం పోలీస్ వారు మా ఇంటి వచ్చి కులం పేరుతో దూషించామని తప్పుడు కేసు పెట్టి కొన్ని పత్రికలలో పత్రికా ప్రకటన విడుదల చేశారు అది చూసి మేము వెంటనే కరీంనగర్ సీపీని కలిసాము వారు హుజురాబాద్ ఏసిపి కి రిఫర్ చేశారు మేము ఎసిపి ని కలవగా చాలా అవమానకరంగా మాట్లాడుతూ ఫోర్జరీ కేసులు ఏమి లేవు మీరు ఆ భూమి వారికి రిజిస్ట్రేషన్ చెయ్యండి అంటూ లేకుంటే మీ పై కేసులు పెట్టి జైలుకు పంపిస్తా అంటూ భయబ్రాంతులకు గురి చేయడంతో ఎం చెయ్యాలో అర్ధంకాని పరిస్థితి లో పోలీసులు న్యాయం చేస్తారు అని నమ్మితే వాళ్ళు ఈ విధంగా చెయ్యడం కరెక్ట్ కాదు, నాకు పసుపు కుంకుమ కింద 10 ఎకరాల భూమి వస్తే ఇద్దరు కొడుకులను చదివించటానికి కోసం అమ్మేసాను, పిల్లలని కరీంనగర్, హైదరాబాద్ తీసుకుని వచ్చి ఇల్లు కిరాయికి తిసుకుని బట్టలు కుట్టి ఇల్లు నడిపించాను,పెద్ద కొడుకు మాత్రం పోలీస్ వారితో కుమ్మక్కు అయ్యి ఇలా మానసిక వేదన కి గురిచేస్తూ కుట్రపూరిత కేసులు పెడుతూ జీవిత చివరిదశలో నేను ప్రశాంత జీవితాన్ని గడిపే హక్కుని కాల రాస్తునాడు అని ఇప్పటికైనా విచారణ చేసి మాకు న్యాయం చెయ్యండి, విధ్యాధర్ ఫోన్ కాల్స్ ఎంక్వైరీ చేస్తే అతను ఎప్పుడు ఊరిలోకి వచ్చాడు, కేస్ పెట్టిన 3 సంవత్సరాల నుండి కేశవ పట్నం పోలీస్ వారికి, హుజురాబాద్, ఏసిపి గారికి, కరీంనగర్ కలెక్టర్ గారికి,RDO, MRO, గార్లకి ఉన్న లావాదేవీలు అన్ని బహిర్గతం ఔతాయి, కావున న్యాయపరమైన విచారణ చేయాలి అంటూ తల్లి, చిన్నకొడుకు ముఖ్య మంత్రి గారిని, డీజీపీ గారిని వేడుకుంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular