Thursday, July 25, 2024

ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన మావోయిస్టులు

రాష్ట్రంలో త్వరలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టు పార్టీ ప్రజలకు పిలుపునిచ్చింది….బి జె పి కి మద్దతు ఇస్తున్న అవకాశవాద బి ఆర్ ఎస్ ను తన్ని తరమాలని ప్రతిపక్ష పార్టీలను నిలదీయాలని పిలుపునిచ్చింది….ఈ మేరకు మావోయిస్టు రాష్ట్ర కమిటీ పేరుతో ఓ లేఖను మీడియాకు విడుదల చేశారు…. ఆ ప్రకటన పూర్తి యదాతదంగా …..

బ్రహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు బీజేపీని, బీజేపీకి మద్దతునిచ్చే అవకాశవాద బీఆర్ఎస్ ను తన్ని తరమండి ప్రతిపక్ష పార్టీలన్నింటిని నిలదీయండి అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించండి

ప్రజాస్వామిక తెలంగాణను సాధిద్దాం! నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేద్దాం!!

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో గెలుపుల కోసం పార్లమెంటు పార్టీలన్నీ సన్నాహాలు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షాలు. నువ్వా నేనా అన్నట్లు ప్రజలకు ఇస్తున్న వాగ్దానాలు పోటీపడి మరీ ప్రకటిస్తున్నాయి. అధికారం కోసం అత్యంత అవినీతి పరులు, దుర్మార్గులు గత పాలనలో చేసిన అవినీతి, అక్రమాలన్నింటిని మరిచి మేము నిజాయితీ కలిగిన, అవినీతి రహిత, పారదర్శకమైన పాలకులమంటూ సిగ్గూ ఎగ్గూ లేకుండా ప్రజల వద్దకొస్తున్నారు. పాలక ప్రభుత్వాలపై విసుగు చెంది నిస్పృహలకు లోనై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న ప్రజలను నమ్మించడానికి ప్రజల తక్షణ అవసరాలను, డిమాండ్లను తమ వాగాడంబరంతో ఆకర్షణీయంగా ప్రకటిస్తున్నారు. అధికారం వున్నంత కాలం ప్రజల సంక్షేమాన్ని, ప్రజల మౌళిక సమస్యలను గాలికి వదిలిన బూర్జువా పార్లమెంటరీ పార్టీలన్నీ సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేయడానికి సిద్ధమయ్యాయి. అధికారం సాధించడమే ప్రధాన లక్ష్యంగా ప్రజల రాజకీయ వెనక బాటు తనాన్ని ఆసరా చేసుకొని అబద్దపు వాగ్దానాలూ, డబ్బు, మద్యం, కులం, మతం అనే దుర్మార్గాలను ఓట్ల కోసం ఉపయోగించుకుంటున్నారు.

గత 10 సంవత్సరాల నుండి తెలంగాణ ప్రజలను దగా చేసినా బీఆర్ఎస్ మూడో సారి అధికారాన్ని చేపట్టడానికి సిద్ధమైంది. మరోసారి ప్రజలను మోసగించడానికి అభివృద్ధి మంత్రాన్ని జపిస్తుంది. వాస్తవానికి ప్రజల మౌళిక సమస్యలను పరిష్కరించడంలో విఫలమైంది. గతంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేదు. ఎన్నికలు రాగానే రైతు బంధు, దళిత బంధు, బీసి బంధు, గిరిజన బంధు అంటూ ప్రజలను మాయ చేస్తుంది. భూమి లేని దళితులకు మూడు ఎకరాలు భూమిని ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గద్దెనెక్కిన వాడే మరిచింది. ఆదివాసీ చట్టాలను తుంగలో తొక్కి హరిత హారం, యూరేనియం, టైగర్ జోన్ పేర్లతో వ్యవసాయ భూముల నుండి, అడవుల నుండి గెంటి వేస్తూనే మరో పక్క కొద్ది మంది పోడు భూములకు పట్టాలు ఇచ్చి ఆదివాసులు సానుబూతిని పొందాలనుకుంటుంది. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కేసీఆర్ రైతాంగం పండించిన పంటలకు గిట్టు బాటు ధరలు కల్పించిన దాఖలాలు లేవు. కౌలు రైతులను పట్టించుకొనూ లేదు. కూలీల సమస్యలు ప్రభుత్వానికి పట్టవు. సరైనా విత్తనాలు, ఎరువులు ఇవ్వలేదు. ధరణి పోర్టల్ ద్వారా రైతుల భూములనూ, భూస్వాముల, బీఆర్ఎస్ నాయకుల ఆక్రమనకు అవకాశాలు కల్పించారు.

టీఎస్ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రవేట్ పరం చేయాలనే పథకం పన్నారు. సింగరేణిని ప్రవేట్ కార్పొరేటు కంపెనీలకు దారాదత్తం చేస్తున్నారు. విద్యార్ధులకు, నిరుద్యోగులకు ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించక పోగా ఉద్దేశ్య పూర్వకంగా గ్రూపు-1 ను అనేక సార్లు రద్దు చేయిస్తూ వస్తుంది. చేతివృత్తుల వారికి లక్ష రూపాయాలు చేయూతనిస్తామని, మొండి చేయి చూపించింది. ఆసరా రైతు బంధు, దళిత బంధు వంటి అనేక పథకాలను ప్రవేశ పెట్టి కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ బంధు మిత్రులు లబ్ది దారులయి వాటాలు పంచుకుంటున్నారు. కాళేశ్వరం ద్వారా కేసీఆర్ కుటుంబం కోట్ల డబ్బును పోగేసుకుంది, రైతాంగానికి చెందాల్సిన ప్రభుత్వ రుణాలు పాలకులు, భూస్వాములు, పొందుతున్నారు. పేద రైతాంగం మాత్రం భూస్వాముల నుండి, వడ్డీ వ్యాపారుల నుండి రుణాలు తీసుకుంటున్నారు. ప్రజల సంక్షేమాలన్నింటిని దుర్వినియోగం చేసి రాష్ట్ర బడ్జెట్ ఖజనాను ఖాళీ చేసి ఉద్యోగులకు జీతాలు చెల్లించ లేని దుస్థితి ఏర్పడింది. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి వడ్డీలు చెల్లించడానికి భూములను అమ్ముకోవాల్సిన దుస్థితి రాష్ట్రానికి పట్టింది.

కేంద్రంలో మోదీ ప్రభుత్వం పార్లమెంటులో చేసిన చట్టాలను బీఆర్ఎస్ ప్రభుత్వం సమర్ధించింది. ఈ విధంగా బీఆర్ఎస్, బీజేపీ మధ్య అందం ఉంది..

దేశంలో మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం గత 9 1/2 సంవత్సరాలుగా అధికారంలో వుండి దేశాన్ని పెను ప్రమాదంలోకి నెట్టింది. బ్రాహ్మణీయ హిందుత్వ మతోన్మాదం భారత ప్రజల ప్రధాన శతృవుగా మారింది. కార్మిక వర్గం, రైతాంగం, మేధావి వర్గాలలో విప్లవ శక్తులపై భయంకర కక్షసాధింపు చర్యలు కొనసాగిస్తుంది. ఇతర మతాల పట్ల పీడిత సామాజిక సెక్షన్ల పట్ల అతి హేయమైన విద్వేషాన్ని రెచ్చ గొట్టే అత్యంత కరుడు గట్టిన బ్రాహ్మణీయ మతోన్మాద దురహంకారానికి పాల్పడుతుంది. బ్రాహ్మణీయ హిందుత్వం రాజకీయ గుత్తాధికారాన్ని వెంటనే నెలకొల్పుకోవడానికి పూనుకుంది. 2022 అక్టోబర్ నెలలో “సూరజ్ కుండ్ శిబిర్”లో మరో విప్లవ ప్రతిఘాతుక పథకాన్ని రూపొందించారు. దేశంలోని పీడిత వర్గాలపై, సెక్షన్లపై, జాతులపై పాశవికంగా దాడులు చేస్తున్నారు. తనకు ప్రత్యర్థులుగా వున్న పార్టీలు, గ్రూపులపై భయోత్పాత పాలనతో వేధింపులు తీవ్రం చేస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రశ్నించిన, రాసిన, పాడినా వ్యక్తులపై, సంఘాల ప్రతి నిధులపై, మేధావులపై, ప్రొఫెసర్లపై, జర్నలిస్టులపై, ప్రజాస్వామిక వాదులపై, అమాయక ఆదివాసులపై, మావోయిస్టులతో కలిసి హత్యలకు కుట్రలు చేస్తున్నారని, అర్బన్ నక్సలైట్స్ అనే పేరుతో చట్ట విరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (UAPA) కేసులు మోపుతున్నారు. లేదంటే ఎన్ఐఏ దాడులతో వేధిస్తున్నారు. నియంతృత్వాన్ని దగాకోరు పార్లమెంటరీ పద్ధతులను మిళితం చేసి తన వర్గ పునాదిని విస్తృతం చేసుకుంటుంది. భారత
రాజ్యాంగాన్ని నామమాత్ర సమాఖ్య (ఫెడరల్) వ్యవస్థను దెబ్బతీసి, బలమైన కేంద్రీకృత బ్రాహ్మణీయ హిందుత్వ నిరంకుశ కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంతో పని చేస్తుంది. అందుకే జమిలి ఎన్నికల పేరుతో 5 చట్ట సవరణలు చేయడానికి సిద్ధపడింది. ప్రతిపక్ష రహిత దేశంగా మార్చే ఏజెండాతో బూర్జువా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తూ బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చి అధికారాన్ని చేపట్టడం, లేదా తమ తొత్తు గవర్నర్లను నియమించి అక్కడి ప్రభుత్వాలను ఆస్తవ్యప్తం చేయడం అనేది బీజేపీ కుట్రపూరిత పథకంలో భాగమే. తన వర్గ ప్రయోజనాల కోసం బీజేపీ ఆర్ఎస్ఎస్ కూటమికి అగ్రగామిగా పని చేస్తూ ఫాసిజాన్ని అమలు చేస్తుంది. దేశభక్తి పేరుతో అనాగరిక జాతీయ అహంకారాన్ని రెచ్చగొడుతుంది. ప్రజా వ్యతిరేక దేశ ద్రోహకర సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలను, దళారీ పెట్టుబడిదారి, భూస్వామ్య 1. విధానాలను దూకుడుగా అమలు చేస్తుంది. అభివృద్ధి పేరుతో ప్రభుత్వ రంగ పరిశ్రమలను, సంస్థలను, ఆస్థులను సామ్రాజ్యవాదులకు, స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు తెగనమ్ముతున్నారు. 26 ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ, ఆదానీ, టాటా లాంటి దళారీ పెట్టుబడిదారులకు కారు చౌకగా అమ్మేసింది. అలాగే మరో 61 ప్రభుత్వ రంగ సంస్థలను స్టాక్ మార్కెట్ల లిస్టింగ్ లో పెట్టి కార్పొరేట్ల చేతుల్లో పెట్టింది. ఫలితంగా దేశం సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఫలితంగా నిరుద్యోగం విపరీతంగా పెరిగింది. వ్యవసాయం సంక్షోభంలో పడింది. కార్మికులు రోడ్డున పడుతున్నారు. చేతి, వృత్తులు ధ్వంసం అయ్యాయి. చిన్న, మద్య వ్యాపారులు దివాళా తీస్తున్నారు. నిత్యవసర ధరలు ఆకాశానంటుతున్నాయి. రానున్న రోజుల్లో రక్షణ రంగ సంస్థను, జీవిత బీమా సంస్థ (LIC)ను, రైల్వే, నౌకాశ్రయాలు, విద్యుత్ రంగ కంపెనీలు ఇలా ఒక్కొక్కటిగా చాలా వరకు ప్రవేట్ పరం చేయడానికి సిద్ధంగా వుంది. మొత్తంగా 2047 నాటికి ఒక ప్రభుత్వ రంగ సంస్థ కూడా వుండకూడదని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. కావున | అత్యంత అభివృద్ధి నిరోధకమైన బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజాన్ని విశాల ప్రజా రాశులంతా ఐక్యమై ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఆశన్నమైంది.

చాలా కాలంగా అధికారాన్ని కోల్పోయి నిరాశ, నిస్పృహల్లొ వున్న కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోసం గట్టి • ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవల తుక్కుగూడలో బహిరంగ సభ నిర్వహించి మహాలక్ష్మి రైతు బరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం, చేయూత ఇవేవి ప్రజల జీవితాలకు భరోసానిచ్చే గ్యారంటీ లేని పథకాలను ప్రకటించారు. వాస్తవానికి అధికార మార్పిడి నుండి కేంద్రంలో, రాష్ట్రంలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీనే పరిపాలించింది. ఇన్ని యేండ్ల కాలంలో అమలు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలతో విసుగు చెందిన 2 ప్రజలు ఇప్పటికీ ఆ పార్టీపై అసంతృప్తితోనే వున్నారు. సిపిఐ, సిపిఎం రివిజనిస్టు పార్టీలు అవకాశ వాద పద్ధతులతో ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీల చంకన చేరుతాయి. ఇటీవల బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొన్నప్పటికీ ఇప్పుడు బీఆర్ఎస్ కాదనడంతో కాంగ్రెస్ పంచన చేరడానికి మంతనాలు జరుపుతున్నాయి. వీరికి వాళ్ళ సొంత ప్రయోజనాలు తప్పా ప్రజల ప్రయోజనాలు అసలు పట్టవు.

1947 అధికార మార్పిడి జరిగి 75 సంవత్సరాలు గడిచింది. ఇప్పటికి మన దేశంలో పార్లమెంట్ ప్రజాస్వామ్యంతో వీడిత ప్రజలకు | ఒరిగింది ఏమి లేదు. భూస్వామ్య కుల వ్యవస్థపై ఆధారపడిన రాజకీయ రంగంలో గ్రామ పంచాయితీల నుండి మొదలుకొని అసెంబ్లీ, పార్లమెంట్ వరకు సామ్రాజ్యవాద, దళారీ పెట్టుబడిదారి, భూస్వామ్య వర్గాల ఆధిపత్యమే కొనసాగుతుంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన వారి నిరంకుశ వర్గ ప్రయోజనాల ఈడేర్చుతాయే కాని ప్రజల సంక్షేమం వారికి పట్టదు. వారి వర్గ ప్రయోజనాల కోసం అనుసరిస్తున్న దోపిడీ విధానాల ఫలితంగా రాజకీయ, సామాజిక, ఆర్ధిక అసమానతలు మరింత ఎక్కువ పెరిగాయి. అందుకే ప్రజలారా! పాలకులను ప్రశ్నించండి ప్రజలకు కావల్సింది పనికి మాలిన పథకాలు కాదు. భూమి లేని రైతాంగానికి భూమి ఇవ్వగలరా? ప్రతి మండల సెంటర్లో మండిలు ఏర్పాటు చేసి పండించిన పంటలకు న్యాయమైన ధర, ఉచిత ఎరువులు, సాగునీరు కల్పించగలరా? ప్రభుత్వ రంగ పరిశ్రమలను, సంస్థలను, ఆస్థులను ప్రవేటీకరణ చేయకుండా ఆపగలరా? ప్రజలను నిర్వాసితులను చేస్తున్న సామ్రాజ్యవాద, కార్పొరేట్ కంపెనీలను అడ్డుకోగలరా? నాణ్యతమైన ఉచిత విద్యను అందించరా? నిరుద్యోగులకు ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించగలరా? సంవత్సరాలు తరబడి చాలి చాలని జీతాలతో కాంటాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పని చేస్తున్న వారికి పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించగలరా? రోగులకు కావల్సింది. ఫించన్లు కాదు. మెరుగైనా వైద్యం ఉచితంగా కల్పించగలరా? ప్రతి గ్రామంలో ఒక హాస్పిటల్ ఏర్పర్చి అర్హత కలిగిన వైద్యులను నిరంతరం అందుబాటులో వుంచగలరా? ఇలాంటి మౌళిక సమస్యలకు గ్యారంటీ ఇవ్వకుండా ఓటు బ్యాంకు కోసం నిరుపయోగ పథకాలను ఉచితంగా కల్పిస్తామంటూ ప్రజలను మోసగించాలనుకుంటున్నారు. వారిని నిలదీయండి. నిగ్గు తేల్చండి.

తెలంగాణలో అధికారం కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోటి కనబడుతున్నప్పటికీ బీజేపీ కూడా అధికారం కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నది. ఈ రాష్ట్రంలో బీజేపీకి నిర్మాణ బలం లేకపోవడంతో బీఆర్ఎస్ తో అంతర్గత పొత్తును కొనసాగిస్తుంది. బీఆర్ఎస్ గెలుపుకు బీజేపీ మద్దతు అవసరం కావడంతో బీజేపితో చేతులు కలిపి నడుస్తున్నది. ప్రజలారా ఓట్ల కోసం వస్తున్న అభివృద్ధి నిరోధక పార్టీలయిన ఫాసిస్టు బీజేపీ, బీఆర్ఎస్ లను తన్ని తరమండి. కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలను నిలదీయండి.

పార్లమెంట్ ప్రజాస్వామ్యమంటే ఒక బూర్జువా ప్రభుత్వం స్థానంలో మరొక్క బూర్జువా పార్టీని అధికారంలోకి తీసుక రావడం ప్రజలకు | ప్రత్యామ్నాయ రాజకీయ అధికారం అసలు కాదు. అలా చేయడమంటే బూర్జువా ప్రజాస్వామ్యం స్థానంలో మరొక్క తరహా ప్రభుత్వ రూపాన్ని బహిరంగ, భయానక నియంతృత్వాన్ని నెలకొల్పడమే అవుతుంది. భారతదేశంలో భూస్వామ్య ఉత్పత్తి సంబంధాలను, పెట్టుబడిదారి ఉత్పత్తి సంబంధాలను రద్దు చేయడం ద్వారా సామాజిక వ్యవస్థను సమూలంగా విప్లవీకరించి అంటే సామ్రాజ్యవాదాన్ని, దళారీ నిరంకుశ పెట్టుబడి దారులను, భూస్వామ్యాన్ని కూల్చి స్వాతంత్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం, శాంతి, శ్రమ సూత్రాలపై ఆధారపడిన నూతన సమాజం ఏర్పర్చడం. ఈ మహత్తర, మహోన్నత లక్ష్యాన్ని పీడిత ప్రజా బాహుళ్యపు ప్రయోజనాల కోసం రైతాంగం, అన్ని ప్రగతిశీల సామాజిక శక్తుల సహకారంతో. కార్మిక వర్గం దీనిని సాధించాల్సిన అవసరం వుంది.



తెలంగాణ రాష్ట్ర కమిటీ

భారత కమ్యూనిస్టు పార్టీ ( మావోయిస్టు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular