Thursday, July 25, 2024

ఆ సబ్ రిజిస్ట్రార్ అంతే….!!

ఆ సబ్ రిజిస్ట్రార్ అంతే తనకు నచ్చినట్లు చేస్తుంది తప్ప… నిబంధనలు ఏమాత్రం పట్టించుకోదనే ఆరోపణలు బాగానే వినిపిస్తున్నాయి….సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి భవనం అద్దెకిచ్చిన భవన యజమాని పిల్లలు ఇక్కడ ఆడింది ఆటగా పాడింది పాటగా ప్రవర్తిస్తున్న ఆ సబ్ రిజిస్ట్రార్ తన శాయశక్తులా సహకరిస్తుంది తప్ప వారి అక్రమ వసూళ్లకు ఏమాత్రం చెక్ పెట్టడం లేదు….ఇక్కడ అక్రమ వసూళ్లు సబ్ రిజిస్ట్రార్ కనుసన్నల్లోనే కొనసాగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి…సబ్ రిజిస్ట్రార్ వ్యవహరిస్తున్న తీరును చూస్తే ఇలాంటి అనుమానాలే కలుగుతున్నాయి…

చలనమేది…..?

హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో యధేచ్చగా అక్రమ వసూళ్లు,డాక్యుమెంట్లు సరిగా లేకున్నా కావాల్సింది దండిగా సమర్పిస్తే క్షణాల్లో పని జరిగిపోతోందని సర్వత్రా విమర్శలు వచ్చిపడుతున్న ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ లో ఏమాత్రం చలనం లేకపోవడం ఇక్కడ చర్చకు దారితీస్తుంది…. సబ్ రిజిస్ట్రార్ భవన యజమాని పిల్లలు ఒకరు డాక్యుమెంట్ రైటర్ గా,ఇంకొకరు మీసేవ నిర్వాహకుడిగా వ్యవహరిస్తూ కార్యాలయ పనుల్లో జోక్యం చేసుకొని పనికో రేటు ఫిక్స్ చేసి ఇష్టారీతిన వ్యవహరిస్తున్న చర్యలు తీసుకోవాల్సిన సబ్ రిజిస్ట్రార్ వేడుక చూస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది… సబ్ రిజిస్ట్రార్ తీరుపై విమర్శలు వెల్లువలా వచ్చి పడుతున్న ఈ అధికారిపై చర్యలు ఏవి లేకపోవడంతో తనపై చర్యలు తీసుకునే ధైర్యం ఎవరికి లేదన్న రేంజ్ లో సబ్ రిజిస్ట్రార్ ఎక్కడలేని ధీమా వ్యక్తంచేస్తున్నట్లు తెలియవచ్చింది…..

ఆదేశాలు భేఖాతరు…

ఉన్నతాధికారుల ఆదేశాలు భేఖాతరు చేయడంలోనూ భీమదేవరపల్లి సబ్ రిజిస్ట్రార్ ముందు వరుసలో నిలుస్తున్నారు…తన కార్యాలయంలో అక్రమ వసూళ్లు, అక్రమ రిజిస్ట్రేషన్లు ఎన్ని జరుగుతున్న గమ్మున ఉంటూ మధ్యవర్తిత్వం వహిస్తూ అవి చేయించేవారికి సబ్ రిజిస్ట్రార్ సహకరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో తనను ఉన్నతాధికారులతో సహా ఏ అధికారి ఏమి అనడం లేదనే ధీమాతో భీమదేవరపల్లి సబ్ రిజిస్ట్రార్ వారి ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ గ్రేటర్ వరంగల్ పరిధిలో ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయకూడదని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ ఉత్తర్వులు జారిచేసీన ఆ ఉత్తర్వులను ఏమాత్రం పట్టించుకోకుండా గ్రేటర్ పరిధిలోని ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల తో సహా మండల పరిధిలోని కొన్ని భూములు సబ్ రిజిస్ట్రార్ మున్సిపల్ కమిషనర్ ఆదేశాలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలుస్తోంది…

ఉన్నతాధికారులు మౌనం…?

భీమదేవరపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రయివేటు వ్యక్తులు తమ హవాను కొనసాగిస్తూ…ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు ఏమాత్రం స్పందించక పోవడం పలు అనుమానాలు కలిగిస్తున్నాయి….రిజిస్ట్రేషన్ కార్యాలయానికి భవనం అద్దెకిచ్చిన భవన యజమాని కుమారుడు ఏకంగా కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ సీట్లో కూర్చొని అచ్చం ఉద్యోగిలా విధులు నిర్వహిస్తున్న అధికారులకు ఏమాత్రం కనిపించకపోవడం శోచనీయం …ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోకపోవడం వల్ల శాఖ ఉన్నతాధికారులపై విమర్శలు వచ్చిపడుతున్నాయి….

విజిలెన్స్ విచారణ చేస్తే….?

భీమదేవరపల్లి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చోటుచేసుకున్న వ్యవహారంపై విజిలెన్స్ విచారణ జరిగితే విస్తుపోయే విషయాలు బయటపడే అవకాశం ఉంది…ఇక్కడ జరుగుతున్న రిజిస్ట్రేషన్ల తీరు,ఉన్నతాధికారుల ఆదేశాలు భేఖాతరు చేసి చేసిన రిజిస్ట్రేషన్లు ,డాక్యుమెంట్లు సరిగా లేకున్నా డబ్బులతో మ్యానేజ్ చేసి చేసిన రిజిస్ట్రేషన్లు తదితర అక్రమ లీలలు బయటకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై విజిలెన్స్ అధికారులు ఓ కన్నేసి ఉంచిన ఇప్పటికిప్పుడు భీమదేవరపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు చేస్తే అక్రమాలు బయటకు రావడం ఖాయంగా కనిపిస్తుంది… మరి ఈ విషయంలో రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు,విజిలెన్స్ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి….

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అద్దె భవనం చెరువు శిఖంలో ఉందా…?

మరో సంచికలో….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular