గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న వేళా వాయిదా పడుతూ ,వాయిదా పడుతూ వస్తూ ఎట్టకేలకు వరంగల్ మహానగరంలో సుడిగాలి పర్యటన చేసి ఒక్క రోజే 17 వందల కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి కేటీఆర్ కు వరంగల్ మహానగర ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు… వానకాలంలో వరదల కారణంగా త్రినగర ప్రజలు అల్లాడిపోతుంటే పర్యటన చేసి నాలల కబ్జాలపై,అక్రమ నిర్మాణాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్ ప్రస్తుతం ఈ పర్యటనలో వాటి సంగతి ఎలాఉందో ఆరా తీయకపోవడం నగర ప్రజలు బాధ పడిపోతున్నారు… మీరు ఆదేశాలు బలంగానే ఇచ్చిన అధికారుల అలసత్వం, నాయకుల బెదిరింపుల కారణంగా అక్రమనిర్మాణాలు ఎక్కడివి అక్కడే ఉన్నాయి… బహుశా ఈ నెలలో గ్రేటర్ వరంగల్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే మే నెలలో కొత్త పాలక వర్గం కొలువు తిరితే వెనువెంటనే వాన కాలం… మళ్ళీ సమస్య మొదటికి వస్తుంది… కనుక గ్రేటర్ ఎన్నికల ప్రచారం పాల్గొనడానికి వస్తే ఈసారి పర్యటనలోనైన కాసింత గట్టి వార్నింగ్ ఇచ్చి పార్టీలకు అతీతంగా వ్యవహరించి నాలల కబ్జా, అక్రమ నిర్మాణాలపై కాస్త దృష్టి సారిస్తారని కోరుకుంటున్నారు. మహా నగర ప్రజలు.
ఇక పోతే మీరు పర్యటనకు వస్తున్నారని అధికారులు, నాయకులు,మంత్రులు హడావిడి చేసి నగరంలోని జంక్షన్లను కళకళ లాడేలా చేసిన నగరంలో రహదారులు మాత్రం గతుకుల మయంగా మారి వీటిపై ప్రయాణం నరకంగా మారి అవి వెల వెల పోతున్నాయి… ఇక్కడి నగరపాలక సంస్థ అధికారులు సుందరికరణ పై పెట్టిన శ్రద్ధ కనీసం ఈ రహదారులపై పెట్టడం లేదు… మరోవైపు స్వచ్ఛ వరంగల్ అని గత పాలక మండలి చెప్పి అవార్డులు కూడా తీసుకున్న నగరంలో కొన్ని చోట్ల తప్ప మెజార్టీ ప్రాంతాల్లో అసలు స్వచ్ఛతే లేదు… ఎక్కడపడితే అక్కడ ఖాళీ చోటు కనపడితే చాలు మూత్ర విసర్జన చేసి కంపు చేస్తున్నారు… హన్మకొండ,వరంగల్, ఖాజీపేట లాంటి ప్రాంతాల్లో సరిపడా మూత్ర శాలలు లేక ఖాళీగా ఉన్న మైదానాలు మిత్ర విసర్జనతో కంపు కొడుతున్నాయి. వీటిని నగర పాలక సంస్థ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఇలా ఐయితే వరంగల్ మహానగరం స్వచ్ఛ నగరంగా మారేదెలాగో మంత్రి చొరవచూపి అధికారులను ప్రజా ప్రతినిధులను ప్రశ్నించాలి.
హన్మకొండ నగరంలో ఏనుగుల గడ్డ ప్రాంతంలో ఓ ఖాళీ స్థలం గాలి విస్తే చాలు కంపుగొడుతుంది… మీరు వస్తున్నారని కాసింత బ్లీచింగ్ చల్లి చేతులు దులుపుకొన్నారు తప్ప ఈ ఖాళీ స్థలం విషయంలో నగరపాలక సంస్థ అధికారులు అసలు ఆలోచనే చేయడం లేదు. గతంలో కొద్దీ రోజులు పెయిడ్ పార్కింగ్ స్థలం గా వాడారు.. మళ్ళీ ఏమైందో తెలియదు నిర్ణయం వెనక్కి తీసుకొని మానేశారు దింతో ఈ ఖాళీ స్థలం ఇప్పుడు అతిపెద్ద బహిరంగ మూత్రశాలగా మారింది… ఇక్కడ ఓ నిమిషం నిలుచోవాలంటే ముక్కు పుటాలు అదిరిపోతాయి.. ఇదంతా అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలిసిన ఎందుకో వారేమి చేయలేక పోతున్నారు. ఇక అండర్ డ్రైనేజీ పనులు కొనసాగుతున్నాయని దికారులు చెపుతున్న అవి ఎప్పటికి ముగింపు దశకు వస్తాయో తెలియడం లేదు… డ్రైనేజీ లు అస్తవస్త్యంగా ఉండడం వల్ల త్రినగరిలోని అనేక ప్రాంతాలు కంపు కొడుతున్నాయి… కాసిన్నీ నీళ్లు ఎక్కువైతే చాలు డ్రైనేజీ మురికి నీరు రోడ్డుపై పారి గబ్బు కొడుతోంది… ఇలా ఒకటా రెండా అనేక సమస్యలతో త్రినగరి సతమతం అవుతుంది.. చరిత్ర ఘనంగానే ఉన్న పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు అభివృద్ధి లేక మహానగర ప్రజలు బాధపడుతున్నారు… ఇవన్నీ మీకు తెలిసే ఉన్న నగర పాలక సంస్థ అధికారులు, మహా నగరం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు చెపుతున్నారో లేదోనని నగర ప్రజలుగా మీ దృష్టికి తెస్తున్నాం కనీసం మరో పర్యటన వరకైనా ఈ సమస్యలపై దృష్టి సారిస్తారని అనుకుంటున్నాం.. నగరంలోని పేదలకు కావాల్సిన ఉపాధి విషయంలో ఆలోచించి ఏదైనా ఓ పెద్ద పరిశ్రమకు మీరు శ్రీకారం చుట్టాలని మీము భావిస్తున్నాం… గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి మీరు కనుక వస్తే ఈ తీపి కబురు మాకు అందించి పరిశ్రమ స్థాపించి ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఉపాధికి మీరు కారణం అవుతారని మేము భావిస్తున్నాం యువరాజా… మీకు తెలిసే ఉంటది కదా… తప్పక మహానగర ప్రజలకు మీరు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం వచ్చే పర్యటన వరకు మాకు సకల సౌకర్యాలు అందుతాయని భావిస్తున్నాం.
ఇట్లు….
త్రినగరి ప్రజలు