బయటకు అందరూ మిత్రులే… లోలోపల ఎవరి వ్యూహాలు వారివి
హేమాహేమీలందరు గులాబీలోనే…
వరంగల్ తూర్పు పై ఆశ వదులుకోని మంత్రి సోదరుడు
ఒక్కో డివిజన్ లో నాలుగేసి గ్రూపులు
కడుపులో లేనిది కావలించుకుంటే వస్తుందా… అనేది గ్రామీణ ప్రాంతాల్లో తరుచుగా వాడే ఓ నానుడి ఐయితే ఈ నానుడి వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని గులాబీ నాయకులకు సరిగ్గా సరిపోతుంది. తూర్పు నియోజకవర్గం లో ప్రస్తుతం అందరూ హేమహేమీలే ఉన్నారు. ఎవరికి వారే తమ ఉనికిని కాపాడుకోవడానికి నిత్యం పాట్లు పడుతున్న వారే. ఎదో కాలం కలిసొచ్చి ఎవరైనా తమకంటే పెద్ద పదవిలో ఉంటే బయటకు హాయ్ బాయ్ అంటూ నవ్వుతూ పలకరించుకున్న సమయం ఎప్పుడొస్తుందా మనం గద్దెనెప్పుడు ఎక్కుదామ… అని చూసే వారే ఎక్కువ ఇది రాజకీయాల్లో మాములు అంశమే అయిన ప్రస్తుతం పదవిలో ఉన్నవారికి ఇది కాస్త తలనొప్పిగా మారిందట వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే కు ఈ తలనొప్పి సాధారణం కంటే ఓ మోస్తరు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది. మేయర్ నుంచి ఎమ్మెల్యే గా ఎన్నికైన దగ్గరనుంచి ఈ హేమాహేమీలను తట్టుక్కని నిలబడేందుకు వారిని కలుపుకు పోయేందుకు ఆ ఎమ్మెల్యే ఎంత ప్రయత్నం చేసినా ఎక్కడో.. ఒక దగ్గర అసంతృప్తిగానే ఆ నాయకులు ఉంటున్నారట బయటకు సహకరించినట్లుగానే కనిపించిన లోలోపల వారు చేసే పనులు వారు చేస్తుండడంతో ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను చూసి ఒకింత బాధపడుతున్నట్లు సమాచారం.
గులాబీ హేమాహేమీలు
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుతం హేమాహేమీలందరు ఉన్నారు. గులాబీ లో కొనసాగుతున్న వీరు రానున్న భవిషత్ పై మెండుగానే ఆశలు పెట్టుకున్నారట, మాజీమంత్రి బస్వరాజు సారయ్య, గుండు సుధారాణి, ఎర్రబెల్లి ప్రదిప్ రావు, వద్దిరాజు రవిచంద్ర ప్రస్తుతం పదవులకోసం వెయిటింగ్ లో ఉన్నారట. వీరిలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పులో అడుగుపెట్టిన వద్దిరాజు రవిచంద్ర తప్ప మిగతావారు ఇక్కడ సినియర్లే.
గ్రేటర్ ఎన్నికలే వేదిక
తూర్పు గులాబీ లో కొనసాగుతున్న వారు సినియర్లే కనుక రానున్న గ్రేటర్ ఎన్నికలను వేదికగా మార్చుకొని తమ సత్తా చాటుకొని అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ కోర్కెల చిట్టాను బయట పెట్టాలని పెద్ద దీర్ఘకాలిక వ్యూహమే రచించుకున్నారట. అంటే ఇప్పుడు తమ బలం ఎంటో డివిజన్లవారిగా నిరూపించుకొని ఎమ్మెల్యే రేసులో తాము ఉన్నామని నిరూపించుకునే ప్లాన్ లో వారు ఉన్నట్లు తెలుస్తుంది. ఐయితే ఈ సినియర్లల్లో సూపర్ సీనియర్ గా ఉన్న బస్వరాజు సారయ్య గులాబీలో చేరిన దగ్గర నుంచి ఎలాంటి పదవిని చేప్పట్టలేదు. టీఎస్ ఆర్ టి సి ఛైర్మెన్ నామినేటెడ్ పోస్టు వస్తుందని అనుకున్న తీరాసమయానికి ఆ పోస్టు చేయిజారిపోయింది. ఎన్నికల సమయంలో కరీంనగర్ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన ప్రస్తుతం తన సత్తా ఏంటో తూర్పులో నిరూపించుకోవాలనే చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఆశ వదులుకొని మంత్రి తమ్ముడు
వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం వెయ్యబ ప్రయత్నం చేసినా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఇప్పటికి వరంగల్ తూర్పు నియోజకవర్గం పై ఆశలు వదులుకోలేదట. రానున్న గ్రేటర్ ఎన్నికలలో తన సత్తా ఏంటో నిరూపించుకోవడానికి ప్రదీప్ రావు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్నికలు ముగిసిన దగ్గరనుంచి ప్రస్తుత ఎమ్మెల్యే తో ఆంటీముట్టనట్లుగానే ఉంటున్న ఈయన వరంగల్ తూర్పులో ప్రస్తుత ఎమ్మెల్యే కు ఓ సవాలుగానే మారినట్లు తూర్పులో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రదీప్ రావు తూర్పు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం నిర్వహించిన అందులో స్థానిక ఎమ్మెల్యే ప్రస్తావన రాకుండా అసలు సంబంధమే లేకుండా జాగ్రత్త పడతాడట. మొన్నటికి మొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు జన్మదినం సందర్భంగా వరంగల్ పోచమ్మ మైదానం వద్ద ఓ భారీ హోర్డింగ్ ను ప్రదీప్ రావు ఏర్పాటు చేశారు. అందరి ఫోటోలు ఆ హోర్డింగ్ లో ఉన్న కేవలం స్థానిక ఎమ్మెల్యే ఫోటో అందులో లేకుండా ప్రదీప్ రావు జాగ్రత్త పడ్డాడు. దీన్ని బట్టి చూస్తే స్థానిక ఎమ్మెల్యే తో నువ్వా.. నేనా అన్నట్లుగానే ప్రదీప్ రావు ఉన్నట్లు స్పష్టం అవుతోంది.
ఎవరి గ్రూప్ వారిదే…
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుతం ఎవరి గ్రూపును వారు ప్రోత్సహిస్తున్నారు. ఏ డివిజన్ కువెళ్లిన కనీసం నాలుగు గ్రూప్ లు కనపడతాయి.గులాబీలోనే ఈ గ్రూపులు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. నలుగురు నాయకులకు చెందిన ఈ గ్రూపులు డివిజన్లలో చీమ చిటుక్కుమన్న తమ నాయకునికి సమాచారం చేరవేస్తారట. ఈ గ్రూపుల్లో ఎర్రబెల్లి ప్రదీప్ రావు గ్రూప్ ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రదీప్ రావు యువసేన పేరుతో వీరు తూర్పులో పలు కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారట. మొత్తానికి తూర్పు నియోజకవర్గంలో నువ్వా.. నేనా అనే రీతిలో ఎవరికి వారు తమ ఉనికిని కాపాడుకొనే స్థితిలో ఉన్నారట. అవసరం వస్తే పదవికోసం తమ తమ అనుచరగణంతో బల నిరూపణకు సైతం సిద్ధమేనని సంకేతాలు ఇస్తున్నారట. రానున్న గ్రేటర్ ఎన్నికలు ఈ బలనిరూపణలకు వేదిక కానున్నాయట.