మున్సిపల్ అధికారులు కదలరెందుకు……?

హన్మకొండ లష్కర్ బజారు లో ఉన్న ,ఆర్థరైటిస్,రుమటాలజీ ఆసుపత్రి పై గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులు వల్లమాలిన ప్రేమ చూపినట్లు కనపడుతుంది… నిబంధనలకు విరుద్ధంగా జి ప్లస్ పోర్ భవనాన్ని ఎలాంటి అనుమతులు లేకున్నా కనీస రక్షణ చర్యలు లేకుండా నిర్మించిన అధికారులు మాత్రం కిమ్మనడం లేదు …గత కొన్ని రోజుల క్రితం న్యూస్10 ఈ ఆసుపత్రి అక్రమ నిర్మాణం పై పలు కథనాలు వెలువరించగా మున్సిపల్ అధికారులు భవనాన్ని చూసి వెళ్తున్నారు తప్పా ఎలాంటి చర్యలు మాత్రం తీసుకోవడం లేదు.బిల్డింగ్ ను ప్రధాన రహదారిపై నుంచి చూస్తే చాలు అది అక్రమనిర్మాణం, నిబంధనలకు విరుద్ధంగా ఉందని తెలిసిన మున్సిపల్ అధికారులు మాత్రం ఆ ఆసుపత్రి యాజమాన్యం పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటున్నట్లు కనపడుతోంది. ఈ బిల్డింగ్ విషయంలో ఓ మున్సిపల్ అధికారి అక్కడికి వెళ్లి ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి అక్రమ నిర్మాణం,అనుమతులు లేవు అనే దానినుంచి ఎలా బయటపడాలో సలహాలు ఇస్తూ అక్రమంగా నిర్మించిన భవనాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.అధికార పార్టీ కార్పొరేటర్ నిర్మించిన భవనాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ఇటీవలే కూల్చివేయించిన మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్యను ఈ అధికారి ఆసుపత్రి భవనం విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చి చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నట్లు సమాచారం. ఆసుపత్రి యాజమాన్యంతో ఈ అధికారి మిలాఖత్ ఐయి వారికి అన్నివిధాల సహకరిస్తున్నట్లు తెలుస్తుంది… ఆసుపత్రి యాజమాన్యం సైతం తమకు ఆ అధికారి ఉన్నాడనే ధీమాతో ఉన్నట్లు కొందరు అంటున్నారు.

మున్సిపల్ అధికారులు కదలరెందుకు......?- news10.app

ఎందుకు చర్యలు తీసుకోరు….

గ్రేటర్ పరిధిలో నివాస స్థలంలో ఇల్లు కట్టుకొని ,ప్రహారి గోడ కట్టుకొని ఒక ఇంచు స్థలం ముందుకు జరిగిన ఆఘమేఘాల పై అక్కడ వాలి కూల్చి వేసే మున్సిపల్ అధికారులు ఈ ఆసుపత్రి విషయంలో అంతటి వేగంగా పనిని ఎందుకు పూర్తి చేయడం లేదో అర్థం కావడం లేదు. కనీస సెట్ బ్యాక్ లేకుండా ప్రధాన రహదారిని ఆనుకొని వంద లోపు గజాల స్థలంలో ఓ అగ్గిపెట్టే లాంటి నిర్మాణం అందులో నిభందనలకు విరుద్దంగా జి ప్లస్ పోర్ భవనాన్ని నిర్మించడం ఏ మేరకు సక్రమమో మున్సిపల్ అధికారులకే తెలియాలి.

స్పందన లేని సిటీ ప్లానర్…

ఆసుపత్రి భవనం విషయంలో వివరణ కోసం ఎన్ని సార్లు ప్రయత్నించిన సిటీ ప్లానర్ ఏమాత్రం అందుబాటులోకి రావడం లేదు… ఆసుపత్రి భవనం విషయంలో న్యూస్10 ప్రతినిధి వివరణ అడిగితే చాలు రేపు , మాపు అంటూ సమాధానం చెపుతున్నారు.వివరణ చెప్పినట్లే చెప్పి ఇప్పుడే వద్దు అంటూ సలహాలు ఇస్తున్నారు… శనివారం సైతం న్యూస్10 ప్రతినిధి పలుమార్లు ఫోన్ చేసిన ఆ అధికారి కనీసం ఫోన్ ఎత్తి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు.ఇప్పటికి తాను బిజీ అంటూ మాటలు చెపుతున్నారు తప్పా ఆసుపత్రి భవనాన్ని కనీసం కన్నెత్తి కూడా చూడలేదు.

అనుమానాలన్ని అధికారులపైనే….?

నగరం నడిబొడ్డున అతి తక్కువ గజాల స్థలంలో జి ప్లస్ ఫోర్ భవనం అక్రమంగా కనీస రక్షణ చర్యలు లేకుండా ఉన్న చర్యలు తీసుకోకుపోవడంపై మున్సిపల్ అధికారులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగు అంతస్తుల భవనం అనుమతులు లేకుండా నిర్మాణం అవుతున్నప్పుడు మున్సిపల్ అధికారుల కంట ఎంతమాత్రం పడలేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇన్ని రోజులు చర్యలు లేకుండా ఏ అధికారి భవనాన్ని కాపాడుతూ వచ్చారనే అనుమానాలు కలుగుతున్నాయి. మరి ఈ విషయంలో ఎవరికి ఎం సంబంధం లేకుంటే ఇప్పుడు అక్రమం అని వెలుగులోకి వస్తే చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నట్లో వారికే తెలియాలి.ఇకనైనా మున్సిపల్ అధికారులు ఈ ఆసుపత్రి భవనం విషయంలో చర్యలు తీసుకుంటారా…లేక కాపాడే ప్రయత్నం చేస్తారా… చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here