ఘన్ పూర్ ‘ఘనుడు’ ఎవరు..?

మొన్నటిదాకా సైలెంట్ గా ఉన్న ‘స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం’ ఇప్పుడు ఒక్కసారిగా హీటెక్కింది. కారణం..మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి జన్మదిన వేడుకలు. గతంలో స్టేషన్ ఘన్ పూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కడియం శ్రీహరి ప్రస్తుత ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా ఇద్దరు నాయకులు గులాబీ కండువా కప్పుకున్నారు. ఇద్దరు ఒకే పార్టీ లో ఉన్న కూడా ఉప్పు నిప్పుగానే వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యపై ఉన్న ప్రజావ్యతిరేకతను అవకాశం గా భావించి ఇప్పుడు మళ్ళీ నియోజకవర్గంలో ఆక్టీవ్ అయ్యారు కడియం. ఈమధ్యే జరిగిన కడియం శ్రీహరి జన్మదిన వేడుకలు ఆయన వర్గీయులు, అభిమానులు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈసారి జరిగే సాధారణ ఎన్నికల్లో ఎలాగైనా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే గా పోటీ చేయాలని కడియం డిసైడైపోయినట్లు అనుచరులు ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజయ్య కు వ్యతిరేకత ఉందని సర్వేలు కూడా వెల్లడిస్తుండటంతో టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం కూడా ఒకరకంగా ఆలోచనల్లో పడ్డట్టు తెలుస్తోంది. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఫైట్ మొదలైనట్టేనని, పార్టీ తాటికొండ రాజయ్య వర్గం, కడియం శ్రీహరి వర్గాలుగా చీలి ఎవరికీ వా‌రే సోంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఘన్ పూర్ 'ఘనుడు' ఎవరు..?- news10.app

స్టేషన్ లో తాటికొండ నా..? కడియం మా..?

అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఓవర్ లోడ్ తో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గం నుండి ఐదారుగురు నాయకులు టికెట్ రేసులో ఉన్నారు. దీంతో పార్టీ లో టిక్కెట్ల లొల్లి కామన్. అయితే ఇదే టికెట్ల లొల్లి కంటిన్యూ అయితే.. అసలు అభ్యర్థి ఎవరు అనే సందిగ్దత నెలకొంటుంది. అదే అదునుగా ప్రతిపక్షాలు క్లియర్ కట్ క్లారిటీతో ప్రచారాల్లో ఉంటూ.. ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తే కనుక ప్రతిపక్షాలదే గెలుపని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో అధికార పార్టీ కి ఎదురుదెబ్బ తలుగుతుంది. ఇక ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులు టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తారా అంటే.. కొంత అనుమానమే అనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ తన ఉనికిని కాపాడుకోవాలంటే.. కడియం శ్రీహరి అభ్యర్థిగా ఉంటె ప్రతిపక్ష పార్టీలకు గట్టి పోటీ ఉంటుందనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.

ప్రతిపక్షాలకు బలమైన అభ్యర్థులు కరువు..!

అయితే కాసేపు టీఆర్ఎస్ విషయాన్ని పక్కనపెడితే… ప్రతిపక్ష పార్టీలకు బలమైన అభ్యర్థులు లేకపోవడంతో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న తాటికొండ రాజయ్య సులువుగా గెలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి సింగపురం ఇందిర కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే అందుబాటులో ఉండటం, మీగితా సమయంలో ఆమె వ్యాపారులు చూసుకుంటూ ఉండటం తో స్థానికంగా ఉన్న సొంతపార్టీ నేతలు, కార్యకర్తలు ఆమె అభ్యర్థిత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పార్టీ లో చేరిన దోమ్మాటి సాంబయ్య కూడా అడపాదడపా నియోజకవర్గంలో పర్యటిస్తూ ముఖ్య నాయకులను కలుస్తున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ నుండి బీ ఫాం ఆశిస్తున్నా నేతలు చాలా మందే క్యూ లో ఉన్నారు.

ప్రస్తుతం స్టేషన్ లో బీజెపీ పరిస్థితి..?

స్టేషన్ ఘన్ పూర్ లో ప్రస్తుతం బీజెపీ పాత్ర కీలకమనే చెప్పాలి. బీజేపీ లో కూడా ఇద్దరుముగ్గురు అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జి పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, మాదాసి వెంకటేష్, బొజ్జపల్లి సుభాష్ ఎవరికీ వారే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టికెట్ తమకే వస్తుంది అని కార్యకర్తలు, నాయకుల వద్ద ప్రచారం చేసుకుంటున్నారు. నిజానికి ఇక్కడ అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చే నాయకుడు ఎవరు లేరని, బీజేపీ అధినాయకత్వం ఏ అభ్యర్థి ని బరిలోకి దింపుతుంది అనేది తేలితే పరిస్థితులు పూర్తిగా మారకపోయిన ఓట్లు చీలే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ లోకి యువత ఆకర్షితులు అవుతారనే అంచనా కూడా ఖచ్చితంగా ఉంది.ఇక మిగతా పార్టీల విషయానికొస్తే..సీపీఐ, సీపీఎం, తాజాగా బీఎస్పీ పార్టీల పాత్రలు ఎలా ఉండబోతున్నాయనేది పూర్తిగా ఎన్నికల సందర్భం వచ్చినప్పుడే బయటపడుతుంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తను చేపట్టిన రాజ్యాధికార యాత్ర కూడా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం పరిధిలోని ఖిలాషాపూర్ గ్రామం నుంచే ప్రారంభించడంతో బీఎస్పీ కూడా కీలకమైన పాత్ర పోషించవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి.. కడియం శ్రీహరి కి ఎమ్మెల్యే టికెట్ ప్రచారంతోనే స్టేషన్ ఘన్ పూర్ రాజకీయం హీటెక్కిందని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here