లిక్కర్ డాన్ తో అన్నా నీ అనురాగం అనుకుంటూనే అతని తనయుడితో పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న ఓ ముగ్గురు సిఐ లు చెట్టాపట్టాలేసుకుని తిరిగినట్లు నిఘా విభాగం దర్యాప్తులో తెలినట్లు తెలిసింది. లిక్కర్ డాన్ తనయుడి వ్యవహారం బయటపడిన తర్వాత పోలీసు అధికారుల పాత్ర విషయంలో నిఘా వర్గాల నిఘా వర్గాల దర్యాప్తులో నిజమేనని తెలినట్లు సమాచారం.
బ్యాంకాక్ వెళ్లిన ఆ ముగ్గురు సిఐలు ఎవరు..?
ఇది ఇలా ఉంటే లిక్కర్ డాన్ తనయునితో బ్యాంకాక్ వెళ్లిన ఆ సీఐలపై విచారణ పూర్తి చేసిన అధికారులు సదరు సీఐలపై వేటు వేయడానికి అన్ని ఆధారాలను పోలీసు బాస్ సమర్పించినట్లు తెలిసింది. ఏ తేదీన వెళ్లారు… ఎంత మంది వెల్లారు అనే విషయాలు అన్ని సేకరించి ఇప్పటికే నిఘా వర్గాలు సమాచారాన్ని పోలీసు బాస్ కు అందజేసినట్లు తెలియవచ్చింది. కాగా బ్యాంకాక్ వెళ్లిన సదరు సీఐలు ముగ్గురు వరంగల్ పోలీసు కమిషనరేట్ లో పని చేస్తున్నార ని సమాచారం… వీరిలో ఓ సిఐ ప్రస్తుతం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పని చేస్తున్నట్లు నిఘా వర్గాల దర్యాప్తు లో తేలినట్లు తెలిసింది. అంతేకాదు వీరిలో
గతంలో ఇంతేజార్ గంజ్ పోలీసు స్టేషన్లో ఎస్సై గా పని చేసిన సదరు అధికారి ఇప్పుడు సీఐడీ విభాగంలో సీఐగా పని చేస్తున్నారు అని నిర్దారణ చేసినట్లు తెలిసింది. వరంగల్ పోలీసు కమిషనరేట్ సెంట్రల్ జోన్లో పని చేస్తున్న లిక్కర్ డాన్ తనయుడికి రియల్ ఎస్టేట్ వ్యాపార భాగస్వామి అయిన సీఐ బ్యాంకాక్ వెళ్లినట్లు అధికారుల విచారణ తేలినట్లు తెలుస్తోంది.
లిక్కర్ డాన్ వీరాభిమాని ఆ సిఐ….?
లిక్కర్ డాన్ తనయుడి విషయంలో ఇంత జరుగుతున్నా ఓ సిఐ వారితో సంబంధాలు వదులుకోవడానికి ససేమిరా అంటున్నాడట. అవకాశం దొరికినప్పుడల్లా సాయం చేయడానికి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదట. డ్యూటీ కన్నా మీరే ముఖ్యం అన్నట్లు వ్యవహరిస్తున్నాడట. ప్రస్తుతం పరకాల సబ్ డివిజన్ పనిచేస్తున్న ఈ సిఐ వీరికి వీరాభిమాని అని పోలీస్ సర్కిల్స్ లోనే తెగ చర్చ నడుస్తుందట. ఓ వైపు సిఐ ల పాత్ర పై నిఘా విభాగం దర్యాప్తు జరుగుతున్న ఈ సిఐ తనకు అవేం పట్టానట్లు లిక్కర్ డాన్ అతని తనయుడితో టచ్ లో ఉన్నట్లు తెలిసింది.మొత్తానికి ఈ సిఐ ల వ్యవహారంలో నిఘా విభాగం పోలీస్ బాస్ కు నివేదిక సమర్పించగా త్వరలోనే వీరిపై వేటు పడుతుందని సమాచారం.