ఆయనో పేరుమోసిన వైద్యుడు ఆర్థోపెడిక్ ఆసుపత్రి నడుపుతూ అందరికి సుపరిచితుడుగా ఉండేవాడు… రోగులంతా నమ్మకంతో అతగాడి ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్తారు….పెద్ద సారు వైద్యం చేస్తాడని అనుకుంటారు కానీ అక్కడ జరిగేది మాత్రం వేరు పెద్ద సారు మరో చిన్న సారును పురమాయించి సర్జరీలు చేయిస్తాడట… ఇదెక్కడో మారుమూల ప్రాంతంలోనే చిన్న పట్టణంలో జరుగుతుంది కాదు హన్మకొండ నడిబొడ్డున ఉన్న ఆసుపత్రిలో జరుగుతున్న తతంగం ఇది.
ఆ డాక్టర్ సాబ్ పేరుకు ఆర్థోపెడిక్ డాక్టర్ కానీ ఆయన ఏ సర్జరీ చేయడని టాక్. అతని హాస్పిటల్ కు వచ్చే ఏ పేషంట్ కు అయినా సరే నాన్ మెడికల్ సర్జన్ అంటే బిఎఎంఎస్ డాక్టర్ తోనే సర్జరీ చేయిస్తాడట…. అలా పెద్ద సారు కాకుండా బి ఎ ఎం ఎస్ డాక్టర్ తో సర్జరీ చేయించడం వల్ల ఓ ఇద్దరు ముగ్గురు పేషంట్ ల సర్జరీ కూడా ఫెయిల్ అయిందని సమాచారం.
హన్మకొండ జిల్లా కాకాజీ కాలనీలోని ఓ ప్రముఖ ఆర్థోపెడిక్ హాస్పిటల్ లో ఆర్థోసర్జన్ కు బదులుగా ఓ అర్హత లేని బిఎఎంఎస్ డాక్టర్ తో సర్జరీలు చేపిస్తూ లక్షలరూపాయలు సంపాదిస్తున్నట్లు తెలిసింది. పైగా ఆ బిఎఎంఎస్ డాక్టర్ కు ఒకే కన్ను పనిచేయడం వల్ల అతగాడు చేసే సర్జరీల్లో సగానికి పైగా ఫెయిల్ అయినట్లు విశ్వసనీయ సమాచారం… గత కొన్ని నెలల క్రితం ఓ పేషెంట్ కు ఓ కాలుకు చేయాల్సిన సర్జరీ మరోకాలుకు చేయగా ఇది గమనించిన పేషెంట్ బంధువులు ఇదేంటని నిలదీస్తే బిల్లు మాఫీ చేసి ఇంటికి పంపినట్లు సమాచారం. అంతేకాకుండా సర్జరీ చేసే పేషంట్ లకు వాడే ఇంప్లాంట్ లు కూడా నాణ్యత లేనివి ఉపయోగిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.దీనివల్ల రోగులు తీవ్రఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. ఈ డాక్టర్ చేస్తున్న తతంగానికి అడ్డుకట్ట వేసి అతగాడి పై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.