టి టిడిపి శకం ముగిసినట్లేనా….?

తెలుగుదేశం పార్టీ నట సార్వభౌముడిగా సినీ ప్రేక్షకులు మదిలో చెరగని ముద్ర వేసిన నందమూరి తారకరామారావు స్థాపించిన పార్టీ అప్పట్లో తెలుగు ప్రజల ఆత్మ గౌరవం అంటూ స్థాపించిన కొద్దీ రోజుల్లోనే జాతీయ పార్టీ కాంగ్రెస్ను మట్టి కరిపించి తెలుగు రాజకీయాల్లో ఓ సంచలనాన్ని నమోదు చేస్తూ అధికారంలోకి వచ్చిన పార్టీ తెలుగుదేశం. ఆతర్వాత ఎన్నో ఒడిదోడుకుల తర్వాత చంద్రబాబు చేతిలోకి వెళ్ళాక తొమ్మిది సంవత్సరాలు టిడిపి సమైక్య రాష్ట్రంలో అధికారంలో ఉంది ఆ తర్వాత వైయస్ చరిష్మాతో అధికారానికి దూరం ఐయింది. ఆతర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతమని ప్రచారం… తెలంగాణ ఏర్పాటు… ఆంద్ర లో బాబు కు అధికారం ఇవన్నీ చక చక జరిగిపోయాయి. కానీ తెలంగాణలో కేసీఆర్ రెండో సారి అధికారంలోకి వచ్చిన సేమ్ టు సేమ్ సమైక్య రాష్ట్రంలో టి డి పి అధికారానికి వైఎస్ గండి కొట్టినట్లే జగన్ ప్రస్తుతం ఆంధ్రలో బాబు అధికారానికి గండి కొట్టి అధికారంలోకి వచ్చాడు. గతంలో మంచి చరిష్మా కార్యకర్తలు, నాయకులను కలిగి ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రాభవం తెలంగాణలో కొంచెం కొంచెం గా కనుమరుగవుతూ నిన్నటి పరిణామంతో పూర్తిగా మాయమైపోయింది… దింతో తెలంగాణలో టి టిడిపి పూర్తిగా తన శకాన్ని తానే ముగించుకుందనే అభిప్రాయాలు వక్తం అవుతున్నాయి.

టి టిడిపి శకం ముగిసినట్లేనా....?- news10.app

ఇది తాజా స్థితి… మూలాలు పోతాయా…?

తెలుగుదేశం పార్టీ ఏర్పాటు ఐయిన దగ్గరనుంచి తెలంగాణలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాలతో సహ నేటికి కరడుగట్టిన దేశం కార్యకర్తలు ఉన్నారు. నాయకులు పార్టీ నుంచి గెలిసిన నాయకులు కండువాలు మార్చిన కార్యకర్తలు మాత్రం నేటికి చెక్కు చెదరలేదనేది… ఎవరు అవునన్న కాదన్న ఇది నమ్మాల్సిన విషయమే ఇప్పటికి కొందరు సీనియర్ కార్యకర్తలు సైకిల్ పై ఉన్న తమ అభిమానాన్ని కాదనలేక పోతున్నారు. ప్రస్తుతం పదవులు లేని కొందరు నాయకులు పార్టీలో ఉన్న పార్టీని ముందుకు తీసుకోలేక పోతుండడంతో తెలంగాణలో చతికిల పడిపోయిందనేది వాస్తవం. పరిస్థితులు తెలుగుదేశం పార్టీకి ఎంతటి ప్రతికూలంగా ఉన్న పార్టీ మూలాలు మాత్రం క్షేత్ర స్థాయిలో బలంగానే ఉన్నాయనేది నిజమని ఆ పార్టీ కార్యకర్తలు నమ్మకంగా చెపుతున్నారు.

బాబు ఏంచేయబోతున్నాడు…?

కొంతమంది నాయకులు పార్టీ మారి తెలుగుదేశం శాసనసభ పక్షాన్ని విలీనం చేశాం ఇక తెలంగాణాలో టిడిపి లేదని ప్రకటించిన… అసెంబ్లీ ఎన్నికల వరకు తెలంగాణలో టిడిపి మరింతగా బలపడేందుకు చంద్రబాబు వ్యూహం రచిస్తున్నట్లు టిడిపి సీనియర్లు కొందరు అంటున్నారు… అప్పట్లో పార్టీని వీడి ప్రస్తుతం అధికార పార్టీలో కీలకంగా ఉంటూనే కొద్ది కొద్దిగా నిరాదరణకు గురి అవుతూ అసంతృప్తిగా ఉన్న నేతలను చేరదీసి పార్టీ కి తెలంగాణలో మళ్ళీ జవసత్వాలు కలిపించేలా బాబు ప్రయత్నాలు చేయబోతున్నట్లు తెలుస్తుంది. రాజకీయంగా క్రియాశీలతను కోల్పోయి ఉన్నవారిని, తెలంగాణలో ఉన్న కొంతమంది తటస్తులను చేరదీసి చంద్రబాబు మళ్ళీ తెలంగాణలో కొంత పూర్వ వైభవాన్ని తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. కొంతమంది టిడిపి సీనియర్లు అప్పటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టిడిపి ని వీడారు తప్ప బాబు పై కోపంతో కాదని అలాంటి వారంతా తిరిగి బాబూ ఆహ్వానించి పార్టీ బలోపేతానికి కావాల్సిన ఆర్థిక జవసత్వాలు అందిస్తే మళ్ళీ సైకిలెక్కి సవారీ చేయడం ఖాయమని కొందరు అంటున్నారు. అందుకే ప్రస్తుతం మౌనం పాటిస్తున్న బాబు కొద్దిరోజుల్లో పార్టీ కి తెలంగాణలో మళ్ళీ ఆక్సిజన్ అందిస్తారని సైకిల్ ను పరుగులు పెట్టిస్తాడాని తెలంగాణలో కరడుగట్టిన కొందరు తెలుగు తమ్ముళ్లు ఆశతో ఉన్నారని తెలిసింది. మరి బాబు రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడ ఇక్కడ ఎలా మ్యానేజ్ చేస్తారో. ఏ వ్యూహం తో ముందుకు కదులుతారో వేచిచూడాలి.