ఎంజీఎం లో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం, ప్రశ్నించిన వారికి బెదిరింపులు,బూతులు అధికారులను సైతం లెక్కచేయని తనం….ఏమైనా అంటే మంత్రి మనిషిని ఏదైనా మంత్రి చూసుకుంటాడనే అతి ఇవన్ని కలిసి ఎంజీఎం లో ఆ కాంట్రాక్టర్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాడు…. ఇవన్నీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు దృష్టికి వచ్చిన పట్టింపు లేకుండా పోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి… కాంట్రాక్టర్ మంత్రి పేరు చెప్పి ఇష్టారీతిన వ్యవహరిస్తున్న మంత్రి మాత్రం తనకేం తెలియదన్నట్లు ప్రవర్తిస్తుండడం వల్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..
మంత్రి మనిషి కనుకనే చూసి చూడనట్లు వదిలేస్తున్నారని టెండర్ ఇప్పించిన దగ్గరనుంచి…బిల్లు మంజూరి వరకు అంతా మంత్రి చూసుకున్నాడని అందుకే కాంట్రాక్టర్ ఎవరిని లెక్కచేయని తనంతో అంతటి ధీమాగా ఉన్నాడనే గుసగుసలు ఎంజీఎం లో వినిపిస్తున్నాయి… కాంట్రాక్టర్ కొంతమంది వ్యక్తులను తన వద్ద పెట్టుకొని పనిచేస్తున్న సిబ్బందిని వేతనాల విషయంలో బెదిరిస్తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లించకుండా తన ఇష్టం వచ్చినట్లు కోత విధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఓ వైపు ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఆరోపిస్తున్నారు…
ఇటీవల వీరు ఓ ఐక్యవేదికగా ఏర్పడి వరంగల్ జిల్లా కలెక్టర్ కు పిర్యాదు సైతం చేశారు… ఇంతజరుగుతున్న మంత్రి మాత్రం తనకేమీ తెలియనట్లు…తన దృష్టికి అసలు విషయమే రానట్లు పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది సైతం కాంట్రాక్టర్ మంత్రి తనకు అండగా ఉన్నాడనే అతి చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు… ఎంతో మంది రోగులకు వైద్య సేవలు అందిస్తున్న పెద్దాసుపత్రిపై మంత్రికి ఎందుకు ఇంతటి నిర్లక్ష్యం అని వారు ప్రశ్నిస్తున్నారు…గతంలో ఇక్కడ పనిచేసిన ఓ ఏజెన్సీ పని సరిగా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసి టెండర్ రద్దు చేయాలని చెప్పిన మంత్రి ప్రస్తుత ఏజెన్సీ కాంట్రాక్టర్ పట్ల ఎందుకు మౌనం వహిస్తున్నారని … గత ఏజెన్సీ ని సాగనంపింది ఇతగాడి కోసమేన అని వారు అంటున్నారు… కాగా ఎంజీఎం లో పారిశుధ్యం సరిగా లేక ఇటీవల ఓ వార్డు లోకి పాము ప్రవేశిస్తే హుటాహుటిన అధికారులే యంత్రాలను రప్పించి ఆసుపత్రి పరిసరాలు శుభ్రం చేయించారు తప్ప కాంట్రాక్టర్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు..
అధికారులే చొరవ చూపి పారిశుధ్యం పనులు ఇతర పనులు చేయించుకుంటే ఎంజీఎం లో అసలు టెండర్ ఎందుకు…? కాంట్రాక్టర్ ఎందుకో…? అధికారులు మంత్రులకే తెలియాలి…పనులన్నీ చేయించి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోకుండా… అతడి బిల్లు లోంచి 8 లక్షలు కట్ చేసి అధికారులు గొప్ప పనిచేసినట్లు భావించారు తప్ప పారిశుధ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కాంట్రాక్టర్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విస్మయం కలిగిస్తోంది…. ఇదంతా కాంట్రాక్టర్ వెనకాల మంత్రి ఉన్నాడనే అధికారులు వెనకడుగు వేస్తున్నారని ఎంజీఎం లో ప్రచారం జరుగుతోంది…. ఎంజీఎం లో ఇంతజరుగుతున్న మంత్రి మౌనం వహించడం కాంట్రాక్టర్ తాను మంత్రి మనిషినని చెప్పుకునే మాటలకు మరింత బలం చేకూరుతుంది… అంతే కాదు ఎంజీఎం లో తనకు ఏ చిన్న ఆటంకం కలిగిన సదరు కాంట్రాక్టర్ మంత్రి వద్దకు పరుగులు తీసి తానంటే గిట్టని వారే ఈ ప్రచారం చేస్తున్నారని చెప్పుకుంటున్నాడట… ఇక మంత్రికి అసలు విషయం చెప్పేవారు లేక ఆయన సైతం కాంట్రాక్టర్ చెప్పేదే నిజమని నమ్మి ఎంజీఎం విషయంలో స్పందించకుండా ఉంటున్నారని… కావాలనే కాంట్రాక్టర్ తన కాంట్రాక్ట్ కాపాడుకోవడానికి మంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నాడని కొందరు అంటున్నారు… ఏదిఏమైనా పేదల పెద్దాసుపత్రి విషయంలో మంత్రి స్పందించకపోవడం పట్ల విమర్శలు వచ్చిపడుతున్నాయి… ఇకనైనా కాంట్రాక్టర్ అతి పై, ఎంజియంలో సమస్యల పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు దృష్టిసారించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.. మరి ఇకనైనా మంత్రి స్పందిస్తారా… లేక కాంట్రాక్టర్ తనవాడేనని వదిలేస్తారా…?వేచిచూడాలి.