సృష్టి బిల్డింగ్ వ్యవహారం ఇప్పట్లో తేలెట్లు లేదు…నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి భవనం నిర్మించిన యజమానికి గ్రేటర్ వరంగల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎక్కడలేని అభయం ఇచ్చినట్లు కనపడుతుంది…అందుకే ఆసుపత్రి భవనానికి సెట్ బ్యాక్ లేకున్నా ,పైర్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలుస్తోంది….
విచారణ…జాప్యం
సృష్టి ఆసుపత్రి భవనం నిబంధనలకు విరుద్ధంగా ఉందని న్యూస్10 లో వార్త రాగానే ఆసుపత్రి బిల్డింగ్ యజమానికి నోటీసులు అందజేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు విచారణ లో జాప్యం చేస్తూ ఆసుపత్రి యాజమాన్యం పట్ల ఎక్కడలేని ప్రేమ కురిపిస్తున్నారు…ఈ విషయంలో విచారణ జరుపుతున్న అసిస్టెంట్ సిటీ ప్లానర్ విచారణ పేరుతో ఇప్పటికి జాప్యం చేస్తున్నారు… ఈ బిల్డింగ్ విషయంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ ను విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించిన ఇప్పటివరకు సిటీ ప్లానర్ కు ఏసీపీ నివేదిక అందివ్వలేదని తెలిసింది…