మేం వస్తున్నాం

మీడియా చెప్పేవన్ని నిజాలా…?
వారు చెప్పినవన్నీ నిజంగా నమ్మే తీరాలా….?

జర్నలిజం పేరుతో మేము ప్రజాపక్షం అని చెపుతూ… నిజం కావాలా….? అబద్ధం కావాలా …? అంటూ… ప్రశ్నిస్తూ జనం కోసమే బ్రతుకుతున్నట్లు ఫోజులు కొడుతున్న కొందరు చేస్తున్న హడావుడిని చూసి అబ్బో…! వీరే అసలు, సిసలైన జర్నలిస్టులు అంటూ నమ్మేయాలా…? కొందరు వెలువరిస్తున్న వార్తల తీరు, ఏదో ఒక రంగు పూసుకొని ఎదో రాజకీయ పార్టీ తరఫున బాకాలు ఊదుతు పైగా వీరే సత్య ప్రవచనాలు వల్లిస్తారు… వీరు ఎన్ని సుద్ధపూస మాటలు చెప్పినా… ఏ ఛానల్ ఎవరి పక్షమో, ఏ పత్రిక ఎవరి కరపత్రమో… ప్రజలకు చాలా స్పష్టంగా తెలిసిన… అరిగిపోయిన రికార్డర్ల మేం జనం వైపు అంటూ ఊకదంపుడు మాటలు మాట్లాడితే నిజంగా నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లే ఉంతుంది.

జనం ట్యాగ్ లైన్ తో కొందరు మీడియాలో ఇలా మెదులుతుంటే… ఇంకో రకం అక్షరం ముక్క రాకుండా, పెన్ను పేపర్ చేతికిస్తే ఒక్క లైన్ వార్త రాయరాకున్నా.. కాపీ, పేస్టులు చేస్తూ ఇతరులు రాసిన వాటిని కాపీ కొడుతూ, ఇతరులు ప్రవేశపెట్టిన విధానాలను అనుసరిస్తూ… ఎలాంటి ఆలోచన లేకుండా ఒకరు ఏదైనా రాస్తే దానిని తిరగరాస్తు కేవలం డబ్బు బలంతో మీడియాలో అలా నెట్టుకొస్తున్నారు. ఇక వీరే అనుభవం ఉన్న జర్నలిస్టుల సాయం తీసుకొని పెట్టుబడుదారులుగా మారి చానళ్లు, పత్రికలు స్థాపించి తాము జర్నలిస్టులమే అని భ్రమల్లో తేలియాడుతూ “అసిలి కంటే నకిలీ ఎక్కువ” అన్నట్లు వృత్తినే నమ్ముకొని వృత్తి రీత్యా జర్నలిస్టులుగా స్థిరపడ్డ వారిని విమర్శిస్తూ… డబ్బు పలుకుబడితో శాసించాలనే దుర్బుద్ధితో వీరున్నారు … అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వీరు నిజానికి జర్నలిజంలో “పాలపొంగు” లాంటివారే అయినా ఈ రోజుల్లో నిజానికంటే అబద్దానికే బలం ఎక్కువ కనుక డబ్బుల బలంతో జర్నలిజంలో వీరు నిర్మిస్తున్న పేక మేడలు కూలడం తద్యమే… అయినా ఈ లోపు ఈ అసిలి ముసుగులో ఉన్న నకిలీలు అసలు జర్నలిజంతో సంబంధం లేని వారిని అందులో చొరగొట్టడం కొంత ఆందోళన కలిగించే విషయం.

జర్నలిజం లో వస్తున్న ఈ వింత వికృత పోకడలకు ఏదో ఒకచోట పులిస్టాప్ పెట్టాలి… డబ్బులతో జర్నలిజానికి మచ్చ తెస్తున్నవారిని కూకటివేళ్లతో సహా పెకిలించి వేయాల్సిన అవసరం ఉంది…. అందుకే ఎలాంటి పెట్టుబడిదారులు లేకుండా మంచి చేయాలని ఆలోచనలు ఉన్న స్వతంత్ర జర్నలిజం రావలసిన ఆవశ్యకత ఎంతో ఉంది… దానిలో భాగంగానే పూర్తి స్థాయి స్వతంత్ర జర్నలిజం తో జనం తరపున వకాల్తా పుచ్చుకోవడానికి వెనకాడకుండా…. ఎలాంటి ఆంక్షలు లేకుండా…. జర్నలిజాన్ని నమ్ముకుని రెండు దశాబ్దాలపై బడి జర్నలిజం లోనే కొనసాగుతున్న వృత్తిరీత్యా జర్నలిస్టుల సారధ్యంలో మీడియా 10 మీ ముందుకు వస్తుంది… ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే ప్రభువులు అని నమ్మే మేము మీ ఆశీస్సులు, ఆదరణ, సదా మీ ప్రోత్సాహాన్ని కోరుకుంటున్నాం ….

మీడియా10

స్వతంత్ర జర్నలిజం (independent journalism)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here