గులాబీ పార్టీలో ఇప్పుడు టికెట్ల రగడ నడుస్తుంది.. టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీచేయాలని భావిస్తున్న అందరూ వివిధ డివిజన్ లనుంచి నామినేషన్ వేయగా వారు ఇప్పుడు టికెట్ తమకంటే తమకే ఇవ్వాలని పట్టు బడుతున్నారట… దింతో ప్రస్తుతం ఆ పార్టీలో ఆశావహుల తలనొప్పి రోజురోజుకు ఎక్కువై పోతోందట.. ఓ వైపు నామినేషన్ ల ఉపసంహరణ గడువు దగ్గర పడుతున్న వీరు నామినేషన్ ఉపసంహరించుకునేదే లేదని భీష్మించుకుని ఉండడంతో ఎం చేయాలో తెలియని స్థితిలో గులాబీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.
తాము అసలే పట్టువిడేది లేదంటున్న ఆశవహులను బుజ్జగించేందుకు సీనియర్ నేతలు కొందరు రంగంలోకి దిగిన పార్టీ కోసం సంవత్సరాల తరబడి కష్టపడుతున్న తమకు ఇంకెప్పుడు అవకాశం వస్తుంది… తామేందుకు పోటీ చేయకూడదని వారు ఎదురు ప్రశ్నిస్తుండడంతో సీనియర్ లు సైతం చేసేదేమీ లేక గమ్మున ఉంటున్నారట… అన్ని పార్టీలకంటే గులాబీలో అధికసంఖ్యలో ఆశావహులు ఉండగా… నామినేషన్ లు సైతం అధికంగానే ఈ పార్టీ నుంచి వేశారు… దింతో ఎవరు విరమించుకోకుండా ఉన్నా ఓట్ల నాటికి టీఆర్ఎస్ కు ఎక్కడ గండి పడుతుందేమోనని పార్టీ నాయకులు ఆందోళన పడుతున్నారు… ఎలాగైనా నామినేషన్ ఉపసంహరించుకునేల చేయాలని వారు తీవ్రంగానే ప్రయత్నిస్తున్న ఊకునేది లేదని ఆశావహులు తేల్చి చెపుతుండడం కొందరు ప్రజాప్రతినిధులకు ఆగ్రహం తెప్పిస్తోందట… వారిని అలాగే వదిలేస్తే ఎంతో కొంత గులాబీ ఓట్ల కే నష్టమని ఉపసంహరణ కోసం బ్రతిమిలాడితున్నారట.
కొంతమంది తాము స్వతంత్రులగానైన పోటీలో ఉంటామని తేల్చడంతో టీఆర్ఎస్ బి పామ్ తో పోటీలో నిలువబోతున్న అబ్యర్దులో భయం మొదలయిందట.. పరిస్థితులు ఒకవేళ తారుమారు ఐయిపోతే ఎలా అని వారు తమ సన్నిహితుల వద్ద ఆవేదన చెందుతున్నారట. ఇక నామినేషన్ వేసిన ఆశవహుల్లో కొంతమంది ప్రజాప్రతినిధులకు, డివిజన్ బాద్యులకు అందుబాటులో లేకుండా పోయారట… ఎలాగైనా తమతో నామినేషన్ ఉపసంహరింప చేస్తారని భావించిన వీరు మొబైల్ ఫోన్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయారని సమాచారం. ఇక మరికొంతమంది తమకు టికెట్ ఎలాగు దక్కదని ఒక్కరుగా పార్టీని వీడితున్నారు. ఇప్పటికే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గులాబీ నుంచి టికెట్ ఆశించిన ఇద్దరు పార్టీ మార్చి బరిలో నిలువబోతున్నారు. తూర్పు నియోజకవర్గం లోని 23 వ డివిజన్ కు చెందిన సతీష్ ఆల్ ఇండియా పార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరి బరిలో నిలుస్తున్నారు. అలాగే ఇదే నియోజకవర్గ పరిధిలోని 32 వ డివిజన్ కు చెందిన సింగరి రాజ్ కుమార్ తన వంద మంది అనుచరులతో కలిసి కొండా మురళి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొత్తానికి టీఆర్ఎస్ పార్టీకి ఆశావహుల తాకిడి పెరిగి అదే స్థాయిలో నిరసన పెరిగి కొత్త బాధలు మొదలయ్యాయి. నామినేషన్ ఉపసంహరించుకోకుండా వీరంతా టీఆర్ఎస్ రెబల్స్ గా బరిలోనే ఉంటే పార్టీకి ఎంతోకొంత నష్టం జరుగుతుందని గులాబీలో చర్చ జరుగుతుంది. ఓ వైపు ఉపసంహరణ గడువు దగ్గర పడుతుండటంతో వీరిని గులాబీ నాయకులు ఎలా బుజ్జగిస్తారో చూడాలి.