చెరువులోనే వెంచర్….!

అతను బూకబ్జాలు చేయడంలో సిద్ధహస్తుడని పేరున్న వ్యక్తి…అంతేకాదు చోట నయీమ్ అని ముద్దు పేరున్న వ్యక్తి అట… అధికార గులాబీ పార్టీలో కొనసాగుతూ అందినకాడికి దండుకుంటు…. బూకబ్జాలు చేస్తూ, వివాదాస్పద భూముల్లో పాగా వేసి తన సొంతం చేసుకుంటాడట… రెవెన్యూ అధికారులతో ఓ మోస్తరు గా కాకుండా భారీ ఎత్తున సంబంధాలు కలిగివుండీ ఈ శాఖలో ఏ పని ఉన్న చిటికెలో పరిష్కారం చేసుకొని భూమి తనది కాకున్నా తనదే అనుకునేల కాగితాలు సృష్టించగల ఘనాపాటి ఈ వ్యక్తి.. ఇంతటి అక్రమార్కుడి చరిత్ర కలిగిన ఇతగాడు అసలే అధికార పార్టీలో కొనసాగితున్నాడు మరోవైపు రెవెన్యూ అధికారులతో సత్సంబంధాలు ఉన్నాయి కనుక తనను ఎవరూ ఏమంటారని అనుకున్నాడోఎమోకాని ఏకంగా చేరువులోనే వెంచర్ వేసి ప్రభుత్వ భూమిని అమ్మకానికి పెట్టి కొనుగోలు చేసినవారికి దర్జాగా రిజిస్ట్రేషన్ చేయించి భారీగానే డబ్బులు వేసినట్లు తెలిసింది. ఒకటి కాదు రెండు కాదు ప్రభుత్వ భూమిలో 35 నుంచి 40 ప్లాట్లు వెంచర్ చేసి ” దేఖో మై సత్తా” అంటూ అధికారులు,సర్కారుకే సవాల్ విసురుతున్నాడట ఈ అక్రమార్కుడు.

చెరువులోనే వెంచర్....!- news10.app

ఇది బరితెగింపు…..

హసన్ పర్తి మండలం వంగపహాడ్ శివారులో చింతల చెరువు ఉంది .ఈ చెరువు కింద వందల ఎకరాల భూమి సాగు అవుతుంది.గతంలో ఈ చెరువు 85 ఎకరాలు ఉండగా ప్రస్తుతం 65 ఎకరాలు ఉన్నట్లు తెలిసింది.ఈ చెరువులో టీఆర్ఎస్ పార్టీ నాయకుడని చెప్పుకొనే ఓ వ్యక్తి కబ్జా కు తెర లేపాడు. ఏకంగా రెండున్నర ఎకరాల భూమిని కబ్జా చేసి ఆలస్యం చేయొద్దు అనుకున్నాడో ఏమో కాని ఆఘమేఘాల మీద వెంచర్ సిద్ధం చేస్తాడు… హాట్ కేకుల్లా ప్లాట్లన్నీ అమ్మి వేసి కోట్ల రూపాయలు వెనకేసినట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా ఏకంగా చేరువులోనే వెంచర్ వేసి అమ్మకానికి పెట్టిన రెవెన్యూ అధికారులు కండ్లు మూసుకున్నారు తప్పా అటు వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదట…

భూమి ఓ దగ్గర రిజిస్ట్రేషన్ మరోదగ్గర…..

వంగపహాడ్ పరిధిలో ఉన్న భూమికి పైడిపల్లి శివారు సర్వే నెంబర్ తో రిజిస్ట్రేషన్ లు చేయించినట్లు తెలియవచ్చింది.చెరువులో వేసిన వెంచర్ కు దానికి సంబంధించిన సర్వే నంబర్ వేస్తే ప్రభుత్వ భూమి చెరువని రిజిస్ట్రేషన్ కాదని గ్రహించిన ఈ ఘనుడు సర్వే నంబర్ మార్చి రిజిస్ట్రేషన్ తతంగం ముగించాడట. చాలా పకడ్బందీగా పైడిపల్లి శివార్లలోని ఓ సర్వే నెంబర్ ఎంచుకొని ఆ నెంబర్ తోనే ఓ సబ్ రిజిస్ట్రార్ సహాయంతో ఎలాంటి అనుమతులు లేకున్న రిజిస్ట్రేషన్ లు చేసినట్లు తెలిసింది.

చోటా నయీమ్….

భూ కబ్జాలు,వివాదాస్పద భూములను తన హస్తగతం చేసుకోవడంలో ఆరితేరిన ఇతగాడిని ఆ ప్రాంతంలో అందరూ ముద్దుగా చోట నయీమ్ అని పిలుస్తారట.పేరుకు తగ్గట్టుగానే ఇతగాడు తన కబ్జాల పరంపరను కొనసాగిస్తూ అమాయకుల భూములను టార్గెట్ చేస్తూ వస్తే మొత్తం లేదంటే చెరో సగం అంటూ భూములు తన వశం చేసుకుంటాడని తెలిసింది. ఇటీవల పైడిపల్లి గ్రామంలో ఓ ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన 26 గుంటలభూమిని యజమానులకే తెలియకుండా తన పేర పాస్ బుక్కులు చేసుకొని వారిని ముప్పుతిప్పలు పెడుతున్నాడట…ఇతగాడి బాధలు భరించలేక 18 గుంటల భూమి ఉన్న యజమాని ఉత్తపుణ్యానికి 9 గుంటలు ఇస్తానని ఒప్పుకోవడంతో సరేఅన్నాడట. 8 గుంటలు ఉన్న భూ యజమాని ససేమిరా అనడంతో అతనిని ఇంకా తిప్పలు పెడుతూనే ఉన్నాడట.ఇది ఇలా ఉంటే వంగపహాడ్ శివారులో చింతల చెరువును అనుకోని ఉన్న ఎకరం 27 గుంటల పట్టా భూమిని 8 వేల గజాలుగా మార్చి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో భూ యజమానులు పిర్యాదు చేయడంతో రిజిస్ట్రేషన్ రద్దు చేసుకున్నట్లు తెలిసింది. ఏకంగా చేరువునే కబ్జా చేసి వెంచర్ వేసిన ఇతను ఇదే చెరువు సమీపంలో ఉన్న అసైన్డ్ భూమిని సైతం కబ్జా చేసి ఎకరం 20 గుంటలకు ప్రహారి గోడ నిర్మించినట్లు తెలిసింది. ఈ అసైన్డ్ భూమిలో 36 గుంటలు కొనుగోలు చేసిన ఇతను ఇది ఆసరాగా చేసుకొని ఎకరం పైన కబ్జా చేసినట్లు తెలిసింది. కాగా కొనుగోలు చేసిన అసైన్డ్ భూమికి హసన్ పర్తి రెవెన్యూ అధికారులు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేశారట… అసైన్డ్ భూమికి రెవెన్యూ అధికారులు పాస్ బుక్ ఎలా జారీ చేశారో తెలియదు కాని ఇదే ప్రాంతంలో అసైన్డ్ భూమి ఉన్న వారు వెళ్తే మాత్రం అసైన్డ్ భూమి పట్టా కాదని అంటున్నారట.మరి అసైన్డ్ భూమి పట్టా కానప్పుడు ఆ వ్యక్తి కి ఎలా చేశారని ప్రశ్నిస్తే రెవెన్యూ అధికారులు ఎం సమాధానం చెప్పడం లేదట.ఎలాంటి నాల కన్వర్షన్ ,ఎఫ్ టి ఎల్ అనుమతులు లేకుండా చేరువులోనే వెంచర్ వేసి కాసులు వెనకేసుకున్న ఇతగాడిపై అధికారులు ఎం చర్యలు తీసుకుంటారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here