కె ఎం సి లో అప్ అండ్ డౌన్ ప్రొపెసర్లు….? హైదరాబాద్ టు వరంగల్ కె ఎం సి

వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో అప్ అండ్ డౌన్ ప్రొపెసెర్ లు ఎక్కువైనట్లు తెలుస్తుంది. వైద్య విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఈ పెద్ద పంతుళ్ళు నిత్యం హైద్రాబాద్ నుంచి వరంగల్ కు అప్ అండ్ డౌన్ చేస్తూ తమ విధులను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. పోనీ అప్ అండ్ డౌన్ చేసిన విధులకు సక్రమంగా వస్తున్నారా… అంటే అది లేదు మెడికల్ కాలేజ్ వైపు వీరు కేవలం చుట్టపు చూపుగానే వస్తారట వారంలో కేవలం ఒక్కరోజే అతి కష్టం మీద కళాశాలకు వచ్చే ఈ ప్రొపెసెర్ లు హాజరు పట్టిక లో మిగతా రోజుల సంతకాలు సైతం దర్జాగా పెట్టేస్తారట…. ఇలా హైదరాబాద్ నుంచి పది మంది దాకా ప్రొపెసర్ లు వారంలో ఒకే సారి వస్తూ పోతూ ఉంటారట… అసలే పెద్ద సార్లు అందులో డాక్టర్ లు పెద్ద చదువులు చదివిన వారు కనుక వీరిని కనీసం ఎవరు ప్రశ్నించే ధైర్యం కూడా చేయడం లేదట.

కె ఎం సి లో అప్ అండ్ డౌన్ ప్రొపెసర్లు....? హైదరాబాద్ టు వరంగల్ కె ఎం సి- news10.app

ఎదుకంటే వీరు పెద్ద సార్లు కనుక పెద్ద స్థాయిలో సంబంధాలు ఉంటాయి కనుక మన పని మనం చూసుకుందాం వారితో మనకేం పని అని అందరూ గమ్మున ఉంటున్నారట. పాఠాలు కాకున్నా ,ప్రొపెసెర్ లు రాకున్నా విద్యార్థులు కూడా తమకు ఎక్కడ కొర్రి పెడతారేమోనని వారు సైతం ప్రొపెసెర్ సార్లు ఇదేంటి … అని ఏమాత్రం ప్రశ్నించడం లేదట. ఇక మెడికల్ కళాశాలను నిర్వహిస్తూ అంత చూసుకోవాల్సిన ప్రిన్సిపాల్ సైతం ఎందుకో ఏమో ఈ అప్ అండ్ డౌన్ ప్రొపెసెర్ లు చుట్టపు చూపుగావచ్చిన ఏమి అనడం లేదట… కళాశాల ప్రిన్సిపాల్ గా ఉన్న వారితో తనకేం తలనొప్పి అన్నట్లు గానే ప్రిన్సిపాల్ ఉండి పోతున్నారట. వీరి హాజరుపై ప్రిన్సిపాల్ ఏమాత్రం దృష్టి సారించకపోవడం వల్ల నెల నెలా వేతనం భారీగానే అందుకుంటున్న ఈ ప్రొపెసెర్ లు తమ ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నారట.నెలలో ఈ ప్రొపెసెర్ లు కనీసం ఎన్ని రోజులు వస్తున్నారో… తరగతుల నిర్వహణ ఎలా ఉందో ప్రిన్సిపాల్ కె అర్థం కాకుండా ఉందట… అందరూ పెద్ద సార్లే కనుక ఇక్కడ ఓ దశలో ప్రిన్సిపాల్ సార్ పప్పులు కూడా ఏమాత్రం ఉడకడం లేదని తెలిసింది.ఇంకొంతమంది ప్రొపెసెర్ లు నిబంధనలకు విరుద్ధంగా కళాశాలలో వివిధ శాఖలకు సంబంధించి పెత్తనాన్ని తమకు కట్టబెట్టాలని ప్రిన్సిపాల్ పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. వివిధ శాఖల అధిపతులు మార్పు విషయంలో ఏమాత్రం సంబంధం లేకున్నా తమకే కావాలని కొందరు వారికివారే పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. ఓ దశలో ప్రిన్సిపాల్ వారి ఒత్తిళ్లకు తలొగ్గి శాఖల అధిపతులను మార్చే పనిలో పడ్డారని మెడికల్ కళాశాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇంటర్ నెట్ నిర్వాహకుడి పెత్తనం….?

కాకతీయ మెడికల్ కళాశాలలో ప్రొపెసర్ల తో సమానంగా ఇంటర్ నెట్ నిర్వాహకుడి పెత్తనం ప్రిన్సిపాల్ కంటే ఎక్కువగానే నడుస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. విద్యార్థుల, ప్రొపెసర్ల హాజరు విషయంలో ఇతని పెత్తనమే ఉంటుందట. రోజువారి హాజరు కళాశాలలో ఇంటర్ నెట్ నిర్వహిస్తూ… దానిని బాగు చేసే ఇంటర్ నెట్ నిర్వాహకుడే చూసుకుంటాడట. కొంతమంది ప్రొపెసర్ లు కళాశాల విషయంలో ఏదైనా విషయం చెపితే అంత ఇంటర్ నెట్ నిర్వాహకుడు చూసుకుంటాడని ప్రిన్సిపాల్ సమాదానం చెపుతాడట. ఇంతకీ ఇంటర్ నెట్ నిర్వహిస్తున్న ఈ ప్రయివేటు వ్యక్తి పెత్తనం మెడికల్ కళాశాలలో ఏంటని పలువురు తలలు పట్టుకుంటున్నారట. ఇంటర్ నెట్ నిర్వాహకుడి పెత్తనం కళాశాలలో మితిమీరిపోవడం ప్రతి విషయానికి అతనికే తెలుసు… అతనికే చెప్పండి అని స్వయంగా ప్రిన్సిపాల్ అంటుండడం పలు అనుమానాలకు తావిస్తుందని కళాశాలలో పలువురు అంటున్నారు.

విధుల సమయంలో క్లినిక్ లు…?

ఇక కె ఎం సి లో పనిచేస్తున్న కొందరు ప్రొపెసెర్ లు స్థానికంగానే ఉంటూ విధులకు డుమ్మా కొట్టి నగరంలో ప్రైవేట్ క్లినిక్ లు నిర్వహిస్తున్నట్లు తెలిసింది… వీరు స్థానికంగానే ఉన్నా తమకు తోచినపుడు కళాశాలకు వెళుతూ క్లినిక్ ల నిర్వహణలో బాగా బిజీగా ఉంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.కాగా కళాశాలలో తమ ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తూ ఎగనామాలు పెడుతున్న ప్రొపెసెర్ లపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

కె ఎం సి లో పదిహేనేళ్లుగా తిష్ట…..?

కదలనంటున్న క్లర్క్ లు….

మరో సంచికలో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here