సోషల్ మీడియా వచ్చాక ప్రజల జీవనవిధానమే మారిపోయింది. ఒక్కోరోజు కూడా వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం, యూట్యూబ్ లను వాడకుండా జనాలు ఉండలేకపోతున్నారు. కొంతమంది సొంతంగా యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. అలాగే ఇటీవల రీల్స్ హంగామా మొదలైంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ రీల్స్ హవా కూడా ఎక్కువగా నడుస్తోంది. వీటి ద్వారా ఏ విషయాన్నైనా ఒక్క నిమిషంలోనే చెప్పయవచ్చు. అలాగే వివిధ దృశ్యాలు చూపించవచ్చు. అందుకే ఈ మధ్య జనాలు వీటికి కూడా బాగా అలవాటు పడ్డారు. ఈ నేపథ్యంలో రీల్స్ చేసేవారి కోసం అద్భుతమైన అవకాశం అందించేందుకు ముందుకొచ్చింది.
హైదరాబాద్ అభివృద్ధిని..నగర ప్రాముఖ్యతను రీల్స్ వీడియోలు చేసి ప్రజలకు తెలియజేసేందుకు ఈ మధ్య జనాలు వీటికి కూడా బాగా అలవాటు పడ్డారు. ఈ నేపథ్యంలో రీల్స్ చేసేవారి కోసం అద్భుతమైన అవకాశం అందించేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్ అభివృద్ధిని..నగర ప్రాముఖ్యతను రీల్స్ వీడియోలు చేసి ప్రజలకు తెలియజేసేందుకు ఈ ఆలోచన చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా రీల్స్ పోటీని నిర్వహిస్తోంది. అంతేకాదు ఇందులో గెలిచిన వారికి మొదటి బహుమతిగా లక్ష రూపాయలు ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ మీడియా వింగ్ ప్రకటించింది.
రీల్స్ లో పాల్గొనాలనుకునే వారు యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రాం, ట్విట్టర్‌లో తమ షార్ట్ వీడియోస్ లను పోస్ట్ చేసేలా అవకాశం కల్పించింది. గత 9 ఏళ్లలో హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధిని..నగర ప్రాముఖ్యత గురించి ఆసక్తికరంగా 60 సెకండ్ల నిడివితో షార్ట్ వీడియో చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పోస్ట్ ను @DigitalMediaTS కు ట్యాగ్ చేయాలి. అంతేకాకుండా.. తమ వీడియోలను [email protected] కు మెయిల్ కూడా చేయొచ్చు. ఈ రీల్స్ ను పంపించే చివరి తేది ఏప్రిల్ 30 గా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కాంటెంస్ట్‌కు సంబంధించి ఇంకేమైన వివరాలు కోసం.. https://it.telangana.gov.in/contest/ ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.