కరోన మహమ్మారి ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తుంది .దింతో ప్రజలు అప్రమత్తమై పూర్తిగా ఇంటికే పరిమితమైయ్యారు. దేశంలో గత నెల రోజులుగా లాక్ డౌన్ కొనదాగుతుండగా, ప్రజలందరు ఉపాధిని కోల్పోయి ఇంట్లోనే ఉంటున్నారు దింతో చాలామంది రోజు వారి కూలీలు,పేదలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీరి ఇబ్బందులను గమనించి వారికోసం ఏదైనా చేయాలనే సంకల్పం తో వరంగల్ ఆర్బన్ జిల్లా, హన్మకొండ కు చెందిన టీఆర్ఎస్వీ విద్యార్థి నాయకుడు కంజర్ల మనోజ్ కుమార్ పెద్దమ్మ గడ్డ ప్రాంతంలో 450 పేద కుటుంబాలకు తన సొంత ఖర్చు తో నిత్యావసరాలు పంపిణీ చేసి పెద్ద మనసును చాటుకున్నాడు.
పదిహేను వందల కిలోల కూరగాయలు 8 రకాలు, ఆరున్నర క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మనోజ్ మాట్లాడుతూ తాను నివాసం ఉంటున్న పెద్దమ్మ గడ్డ ప్రాంతంలో చాలామంది రోజువారీ కూలీలుగానే జీవనం గడుపుతున్నారని లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక బాధ పడుతుంటే వారికి తనకు తోచినంతలో సాయం చేశానన్నారు. ఇంత పెద్ద మనసు తో నిత్యవసారాలు తమకు అందించిన మనోజును స్థానికులు అభినందించారు.ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆకాంక్షించారు.
ఈ నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో స్థానికులు వేల్పుల వీరన్న,హన్మకొండ కిష్టి,అశోక్ ,చేరాలు, మహిళ నాయకురాలు కంజర్ల ఎలీషా, గొర్రె శాంత, యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.