బూతులే…బూతులు
కామా తురాణం…న భయం న లజ్జ సరిగ్గా ఓ గులాబీ నేత ఇది బాగా ఒంట బట్టించుకున్నట్లు ఉన్నాడు… బాధ్యతయుతమైన ఓ పదవిలో ఉండి పీకలదాక తాగి ఓ వివాహిత తో బూతులు మాట్లాడుతూ కామపురాణం చెప్పుకొచ్చాడు… ఏమాట్లాడుతున్నావ్ అంటూ ఆ మహిళ అబ్యఅంతరం వ్యక్తం చేసిన వినకుండా తన బూతుపురాణం మొత్తం చెప్పుకొచ్చాడు.. తనకు భయం ఎక్కువ అంటూనే కోళ్ల పామ్ కు వస్తావా… అంటూ తన వక్రబుద్ది చూపించాడు… వరంగల్ ఉమ్మడి జిల్లాలోని పరకాల నియోజకవర్గం లోని ఓ మండలానికి మండల పరిషత్ వైస్ ఎంపిపిగా వ్యవహరిస్తున్న ఇతగాడి బూతుపురాణం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగానే చక్కర్లు కొడుతోంది… ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ బూతు పురాణం ఆడియో విన్న గులాబీ నేతలు తలపట్టుకుంటున్నారు..
నాకు పదవి అడ్డం….
నీతో మాట్లాడాలి అంటే నాకు పదవి అడ్డం ఉంది… ఇదేం పదవి మొ….. పదవి అంటూ తనపదవిని తానే కించపర్చుకుంటు నోటికివచ్చిన బూతు పదాలు అందుకున్నాడు… తనలా ఎవరు ఎంజాయ్ చేయలేరంటూ పొంగిపోయాడు. ఇంట్లో ఇవన్నీ కుదరవని మంచి ఎంజాయ్ మెంట్ నువ్వే ఇవ్వాలంటూ.. నీకు ఇంకా ఎవరు లేరు కదా అంటూ ఆ మహిళను ప్రశ్నించాడు సదరు ప్రజాప్రతినిధి… నీకు నేను నచ్చాన అంటూనే మంచి ఆడదానివి నువ్వు అంటూ కితాబును కూడా ఇచ్చాడు
రికార్డ్ చేస్తలేవు కదా …
వివాహిత మహిళతో బూతుపురాణం మాట్లాడిన గులాబీ నేత… తన మాటలను రికార్డ్ చేస్తలేవు కదా అంటూ ప్రశ్నించాడు… నువ్వు రికార్డ్ చేసి ఎవడైనా మీడియా వాడికి ఇస్తే తనపని అయిపోతుందని అనుమానం కూడా వ్యక్తం చేశాడు… మళ్ళీ వెంటనే తనను ఎవరైనా అడిగితే తన గొంతును ఎవరో మిమిక్రి చేశారని అంటానని తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ ధీమా వ్యక్తంచేశాడు.. రోజు తనతో గడపాలని తన ఇంటి ముందు రోజు వందల మంది ఉంటరు గనుక ఇంటికి రావద్దని తనకు భయం ఎక్కువ కనుక పామ్ వద్దకే రావాలని గులాబీ నేత ఆ వివాహిత మహిళకు సూచించాడు… తమ పార్టీకి చెందిన నేతలంతా అమ్మాయిల విషయంలో అడ్డంగా బుక్ అవుతున్నారంటూ సదరు నేత ఆవేదన కూడా వ్యక్తంచేశాడు. సెల్ నాలెడ్జ్ నేర్చుకుంటే రోజు వీడియో కాల్ మాట్లాడుకోవచ్చని కొత్త సెల్ ఫోన్ కొనిస్తానని ఆఫర్ కూడా ఇచ్చాడు గులాబీ నేత…
పేద మహిళలే టార్గెట్…?
ఆ మండలంలో ఉన్న గులాబీ నేతల్లో ఎమ్మెల్యే కు అత్యంత దగ్గరి వ్యక్తిగా పేరున్న సదరు గులాబీ నేత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలనే టార్గెట్ చేసి ఇలా వేధిస్తుంటాడని ఆరోపణలు ఉన్నాయి…. అవసరరీత్యా తన వద్దకు వచ్చిన మహిళలను ఇలా ట్రాప్ చేసి పనులు చేస్తానని లోబర్చుకునే ప్రయత్నం చేస్తాడని మండలంలో జోరుగా ప్రచారం జరుగుతోంది… ఈ ఆడియో అక్కడి సోషల్ మీడియా గ్రూప్స్ లల్లో బాగా వైరల్ అవుతున్న స్థానిక ఎమ్మెల్యే ఈ విషయాన్ని చాలా లైట్ గా తీసుకోవడం విమర్శలకు దారి తీస్తుంది.