అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన గ్రేటర్ వరంగల్ టౌన్ ప్లానింగ్ అధికారులు నిద్రమత్తులో ఉన్నట్లు కనపడుతోంది.. ప్రధాన రహదారిని ఆనుకొని ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణం జరిగిన ఏమాత్రం పట్టించుకునే స్థితిలో వారు లేరని విమర్శలు వస్తున్నాయి. భవన యజమానితో కుమ్మక్కు కావడం వల్లే ఈ బిల్డింగ్ ను అక్రమంగా నిర్మించిన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు బాగానే వినపడుతున్నాయి.అధికారుల తీరువలన గ్రేటర్ వరంగల్ పరిధిలో కుడా మాస్టర్ ప్లాన్ అమలయ్యేలా కనిపించడం లేదు…కొంతమంది అధికారుల వక్రబుద్ది వల్ల భవన యజమానులు మా బిల్డింగ్ మా ఇష్టం అనే రీతిలో నిర్మాణం చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. హన్మకొండ సుబేదారిలోని శాంతినగర్ వీధి నెం1 లో భవన యజమాని మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా సెట్ బ్యాక్ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా భవనం నిర్మిస్తున్నట్లు తెలిసింది.నిత్యం అక్రమ నిర్మాణాల పై నిఘా పెట్టి అక్రమ కట్టడాలను అడ్డుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ బిల్డింగ్ విషయంలో చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.. ఇంత బహిరంగంగా హైదరాబాద్ ప్రధాన రహదారిని ఆనుకొని ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా ఆ యజమాని బిల్డింగ్ ను నిర్మిస్తున్నారంటే ఏ స్థాయిలో అధికారుల ఆశీస్సులు ఉన్నాయో ఇట్టే అర్ధమవుతుంది.
అధికారుల నిర్లక్ష్యమా?లకారాల మహిమా?
హన్మకొండ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి సుబేదారి శాంతినగర్ వీధి నెం 1 లో హైదరాబాద్ ప్రధాన రహదారి ని ఆనుకొని మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా ఆ బిల్డింగ్ యజమాని ఇష్టారాజ్యంగా నిర్మాణం చేపట్టినా అధికారులకు కనపడకపోవడం విమర్శలకు తావిస్తోంది .ఆ బిల్డింగ్ టౌన్ ప్లాన్ అధికారులకు కనబడటం లేదా?లేదంటే ఆ బిల్డింగ్ యజమాని ఇచ్చే లకారాలకు కళ్ళు మూసుకున్నారా…?అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.అనుమతి ఒకలా నిర్మాణం మరోలా చేసిన అధికారులు ఎందుకు చూసి చూడనట్లు వదిలేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి… బిల్డింగ్ యజమాని సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణం చేసి టౌన్ ప్లానింగ్ అధికారులను ప్రసన్నం చేసుకోవడం మూలంగానే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విశ్వసనీయ సమాచారం.అధికారులను ప్రసన్నం చేసుకుంటే చాలు అనుమతులు ఎలా ఉన్నా నిర్మాణం ఇష్టారీతిన చేసుకోవచ్చని ఈ బిల్డింగ్ నిర్మాణం చూస్తే అర్థమైపోతుంది. తీసుకున్న అనుమతులకు విరుద్ధంగా నిర్మాణం చేసిన ఈ బిల్డింగ్ యజమానిపై టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకొని నిర్మాణ పనులను ఆపుతారా లేక మాకెందుకులే అని భవన యజమాని చెప్పినట్లే తలలు ఊపుతారా వేచిచూడాలి..