తన కుమారుడి పేరుపై ఉన్న భూమిని అప్పటి అవసరాలకు ఓ వ్యక్తికి విక్రయించి భూమి ధర పెరగగానే తన భూమి తనకు కావాలని కొనుగోలుదారుణ్ణి ముప్పుతిప్పలు పెడుతున్న తహశీల్దార్ అవినీతి ఘనకార్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
నగరంలోని ఉనికి చర్ల భూ వివాదం విషయం “న్యూస్ 10” వెలికి తీసిన విషయం తెలిసిందే. “ముంచుతున్న తహశీల్దార్” పేరుతో కథనం వెలువడగానే ఈ కథనం నేపథ్యంలో అనేక కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. సదరు తహశీల్దార్ జనగామ జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్నప్పటికీ గతంలో ల్యాండ్ లిటిగేషన్ లో 2017లోనే అతడిపై ఓ చీటింగ్ కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది…. కేసు నమోదు ఐనప్పటికీ నేటి వరకూ సదరు తహశీల్దార్ కొలువు చేస్తూనే ఉన్నాడు.భూముల వ్యవహారంలో ఆరితేరిన ఈ రెవెన్యూ అధికారి భూముల విషయంలో చాలామందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిసింది. ఇంత జరుగుతున్నా ఇతను ఇంకా బాధ్యతాయుతమైన తహశీల్దార్ కొలువులో ఎలా కొనసాగుతున్నాడనే విషయం అనేక ప్రశ్నలకు తావిస్తోంది.
ప్రస్తుతం జనగామ జిల్లాలోని ఓ మండలంలో కొనసాగుతున్న సదరు తహశీల్దార్ పై తన గత రెవెన్యూ అక్రమ లీలలపై సమగ్ర విచారణ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. మరో వైపు ఉనికిచర్ల లో తన కుమారుడి పేరు మీద అమ్మిన భూమిని బాధితునికి ఇవ్వకుండా తిరకాసు చేస్తున్న తహశీల్దార్ అక్రమ వ్యవహారంపైన ఉన్నతాధికారులు విచారణ చేయాల్సిన అవసరం ఉందని బాధితుడు అంటున్నాడు జనగామ జిల్లాలో ఓ మండల తహశీల్దార్ గా పనిచేస్తున్న ఆ అధికారి భూ లీలలపై సమగ్ర విచారణ జరిపితే మరిన్ని భూలీలలు వాటి వెనకాల ఉన్న పెఫ్ఫా మనుషులు బయటకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. భూమిని అమ్మివేసి మళ్ళీ తనభూమి తనకే కావాలని భూమిని కొనుగోలు చేసిన కుటుంబాన్ని కొంతమంది పెద్దమనుషుల ద్వారా నిత్యం వేధిస్తూ ఎలాగైనా భూమిని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్న ఆ తహశీల్దార్ గత చరిత్ర అంత భూ అక్రమాలపైనే ఆధారపడి ఉందని విశ్వసనీయ సమాచారం.
గతంలో తప్పుడు పద్దతిలో పట్టాలు జారీ చేసిన విషయంలో కేసు నమోదు కాగా ఇప్పటికి ఆ కేసు అలాగే ఉందని తెలిసింది… ఇంతటి అక్రమ చరిత్ర ఉన్న తహశీల్దార్ తన రెవెన్యూ పలుకుబడిని ఉపయోగించి భూమి కొనుగోలుచేసినవారిని అష్టకష్టాలు పెడుతున్నట్లు తెలిసింది… అప్పట్లో భూమిని ఎలాగైనా అమ్మివేయాలని ఎందుకు పనికి రాదని భావించి ప్రస్తుతం అతడి అంచనాలు తలకిందులై భూమి ధరకు రెక్కలు రాగానే తన రెవెన్యూ తెలివితో ఆ భూమిని తనకే ఇవ్వాలని కొనుగోలు దారుడిని అన్ని రకాలుగా బెదిరిస్తున్నాడని తెలిసింది.. తహశీల్దార్ కు తోడుగా ఓ ఉద్యోగుల సంఘం నాయకుడు, మరో రంగంలో పలుకుబడి కలిగిన పెద్దమనిషి నిత్యం బాధితుడి కి ఫోన్ చేసి ఎదో ఒకటి పరిష్కారం చేసుకోవాలని… ఎన్ని చెప్పిన తహశీల్దార్ కే భూమి వదిలి వేయాలని అంటున్నారట… ఈ వ్యవహారంలో తహశీల్దార్ తో పాటు ఈ ఇద్దరు పెద్దమనుషుల పై సైతం అధికారులు విచారణ చేస్తే అసలు విషయం బయట పడే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
సమగ్ర వార్తా సమాచారం మరో సంచికలో….