ఇది మాట తప్పే సర్కార్…. న్యూస్10 ఇంటర్వ్యూ లో జంగా రాఘవరెడ్డి

ఎందరో తెలంగాణ అమరవీరుల త్యాగాల పై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగడం లేదు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాలకు అన్యాయమే జరుగుతోందని అంటున్నారు కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డి మిగులు బడ్జెట్ తో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిందని. రేపు పుట్టబోయే బిడ్డపై అప్పుల భారాన్ని మోపుతున్న ఘనత ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది. సమస్యలు వస్తే, రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా నిరసన తెలిపి అవకాశం లేకుండా ధర్నాచౌక్లో సైతం ఎత్తివేయడం ఏ ప్రజాస్వామ్యం అని… ఉద్యోగులకు నిరుద్యోగులకు కార్మికులకు రైతులకు ఈ ప్రభుత్వంలో భద్రత లేదు. రెక్కాడితేగాని డొక్కాడని రైతాంగాన్ని ఆంక్షల పేరుతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని కెసిఆర్ ప్రభుత్వాలు రైతులను దగా చేస్తున్నాయని ఆయన అన్నారు.

ఇది మాట తప్పే సర్కార్.... న్యూస్10 ఇంటర్వ్యూ లో జంగా రాఘవరెడ్డి- news10.app

ఈ రెండు ప్రభుత్వాలు దొందూదొందే.. రైతుల, కార్మికుల ఆత్మహత్యలకు ఈ ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. ఈ పాలకులు చేస్తున్న తప్పుడు విధానాల ఫలితంగా మరో సమ్మక్క సారలమ్మలు, నక్సలైట్లు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఉద్భవిస్తారని, 1200 మంది ఆత్మబలిదానం లతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం ఒక్కరే బాగు పడ్డారని, అన్ని వర్గాల ప్రజలు అడుగడుగున నష్టపోతున్నారని అన్నారు. ఈ ప్రాంత ప్రజల అభీష్టం మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియమ్మ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పేద వర్గాల, అట్టడుగు వర్గాల కార్మికుల, కర్షకుల రైతుల పక్షపాతిగా ఉంటూ వారి అభివృద్ధిని నిరంతరం కాంక్షిస్తోందని…. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వర్గాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా అంటున్న. జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి తో న్యూస్10 ప్రత్యేక ఇంటర్వ్యూ.

న్యూస్10 ప్రతినిధి.. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తుంది, అలాంటి ప్రభుత్వం పై మీరు ఏ విధంగా రాబోయే రోజుల్లో ఉద్యమించే బోతున్నారు.

జంగా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదు అన్ని వర్గాల ప్రజలను మాయమాటలతో మోసం చేస్తుంది. తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న అమరవీరులను ఈ ప్రభుత్వం విస్మరించింది, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పిన మాట తప్పింది, పంట పండించే రైతన్నల నడ్డి విరిచింది ప్రభుత్వం. గిట్టుబాటు ధర లేకుండా రైతుల ఆత్మహత్యలకు ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి . దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అని చెప్పి మాటతప్పింది ఈ ప్రభుత్వం. ఇచ్చిన మాట తప్పడం పేద ప్రజల బ్రతుకులు బుగ్గి చేయడం నిత్యకృత్యంగా ఈ ప్రభుత్వ పాలన సాగుతోంది.

ప్రతినిధి.. పేదింటి కల సాకారం చేస్తూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తున్న ప్రభుత్వంపై మీరు విమర్శించడం ఏమిటి?

జంగా! డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల బ్రతుకులు లతో చెలగాటం చేస్తుంది. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామంటూ పేదలను మోసం చేసి అధికారంలోకి వచ్చినా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ ఎంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చారు లెక్కలు చెప్పాలి. అక్కడ అక్కడ కట్టిన ఇల్లు నాణ్యతా లోపం కళ్లకు దర్శనమిస్తున్నాయి. కట్టిన ఇండ్లు సైతం ఏ ఒక్క పేద కుటుంబానికి అందజేయ కపోవడం ఈ ప్రభుత్వ పాలనకు దర్పణం అని చెప్పక తప్పదు. వరంగల్ ఉమ్మడి జిల్లా లో కట్టిన డబుల్ బెడ్రూం ఇల్లు ఎన్ని? ఆ కట్టిన ఇల్లు పేద ప్రజలు అయినా లబ్ధిదారులకు అందిన వా? నాణ్యత లోపంతో కడుతూ కాంట్రాక్టర్లకు కాసులు కురిపిస్తున్నాయి తప్ప పేద ప్రజల బ్రతుకులో వెలుగును నింపడం లేదనేది వాస్తవం.. ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు పై లబ్ధి లబ్ధిదారుల ఎంపిక పై పాలకులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు.

మా ప్రతినిధి ! టిఆర్ఎస్ ప్రభుత్వ పాలన సరిగా లేదంటే ఎందుకు ప్రతి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నారు కాంగ్రెస్ ఎందుకు ఓటమిపాలు చెందుతుంది.

జంగా! టిఆర్ఎస్ ప్రభుత్వం మాయమాటలతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుంది. ఆరాటపడి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగు పడ్డది అన్నారు. పన్నెండు వందల మంది ఆత్మబలిదానంతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అమరవీరుల కుటుంబాలు బాగుపడలేదు అన్నారు. తన కుటుంబంలోని కొడుకు కూతురు అల్లుడు బాగుపడ్డ విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు అన్నారు. పండిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు కంట కన్నీరు పెడుతున్నారు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేక అల్లాడుతున్నారు. కార్మికులకు , కర్షకులకు కనీస వేతనాలు లేక తల్లడిల్లుతున్నరు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సమిష్టిగా ఉద్యమించక తప్పదు. కాంగ్రెస్ పార్టీ పేద అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో ఈ కల్వకుంట్ల కుటుంబ పాలనకు చరమగీతం పాడే లా మా ఉద్యమం ఉంటుంది. ఈ దొరల పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో మరో ఉద్యమం చేపడతాం..