విచారణ షురూ…!

  • ఆర్టీఏ లో ఆ అధికారి పై వేటుకు రంగం సిద్ధం?
  • ఆర్టీఏ లో పరిపాలనాధికారి పై విచారణ మొదలు
  • న్యూస్10 లో వచ్చిన వరుస కథనాల నేపధ్యంలో విచారణ
  • బి రిజిస్టర్ వాహన వివరాలు ,అంతరాష్ట్ర వాహనాల లైఫ్ టాక్స్ ,వాహన రూట్ పర్మిట్ తదితర కోణాల్లో విచారణ
  • విచారణ పూర్తి చేసి నివేదికను పై అధికారులకు పంపనున్న డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమిషనర్

వరంగల్ రవాణా శాఖ కార్యాలయంలో జరిగిన అవినీతి విషయంలో ఆ ఆర్టీఏ అధికారిపై విచారణ మొదలయింది. వరంగల్ అర్బన్ రవాణా శాఖ కార్యాలయంలో వివిధ పనుల్లో ఓ అధికారి అవినీతికి పాల్పడడాన్ని న్యూస్10 కథనాల ద్వారా వెలుగులోకి తెచ్చింది. ఈ కథనాల నేపథ్యంలో పరిపాలన అధికారి తీరుపై ఉన్నతాధికారులు విచారణ షురూ చేసినట్లు తెలిసింది. కార్యాలయంలో బి రిజిస్టర్ వాహన వివరాలు, అంతరాష్ట్ర వాహనాల లైఫ్ టాక్స్, వాహన రూట్ పర్మిట్ విషయంలో అవినీతి జరిగిందని అసలు సంబందం లేని అధికారి వీటి విషయంలో జోక్యం చేసుకుంటూ తానే అన్ని జారీ చేస్తున్నాడని న్యూస్10 పరిశీలనలో వెల్లడికాగా, ఇదే విషయాన్ని వార్త కథనాల ద్వారా అధికారుల దృష్టికి న్యూస్10 తీసుకెళ్లింది. దింతో ఈ విషయాలపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిసింది.

విచారణ షురూ...!- news10.app

విచారణ చేస్తున్నాం… రవాణా శాఖ అధికారి పురుషోత్తం

వరంగల్ రవాణా శాఖ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై విచారణ చేస్తున్నామని రవాణా శాఖ అధికారి పురుషోత్తం వెల్లడించారు. విచారణ షురూ నేపథ్యంలో న్యూస్10 డి టి సి ని వివరణ కోరగా కార్యాలయంలో అవినీతి జరుగుతుందనే వార్తలు వెలువడిన నేపథ్యంలో విచారణ చేస్తున్నామని… విచారణలో నిజమే అని తేలితే ఆ అధికారి పై వేటు తప్పదని ఆయన స్పష్టం చేశారు. విచారణ అనంతరం నివేదికను రవాణా శాఖ ఉన్నతాధికారులకు సమర్పిస్తామని అయన తెలిపారు.