కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అమలవుతున్న లాక్డౌన్లో నిత్యం ప్రజలకు వార్తలు అందించిండంలో జర్నలిస్టు కృషి ఎనలేనదని డీసీసీబీ చైర్మన్ మార్నేనీ రవీందర్రావు అన్నారు. హన్మకొండలోని డీసీసీబీ కార్యాలయంలో బుధవారం ఆయన హన్మకొండ పరపతి సంఘంలోని సభ్యులకు నిత్యావసర వస్తువులు, కూరగాయలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్ర«ధానీ మోది, సీఎం కేసీఆర్లు ముందు చూపుతో లాక్డౌన్ను అమలు చేయడం వల్ల నేడు ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ దేశంతో పాటు రాష్ట్రంలో తీవ్ర స్తాయిలో వ్యాప్తి చెందలేదన్నారు. అయినప్పటికి ప్రతి ఒక్కరు మాస్కులను ధరించి పోలీసులకు, జిల్లా పాలనాయంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ మధు మాట్లాడుతూ లాక్డౌన్లో సేవలు అందిస్తున్న అన్ని వర్గాలకు చెందిన సిబ్బందికి నావంతుగా ఆర్గానిక్ కూరగాయలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో జర్నలిస్టుల పరపతి సంఘం అధ్యక్షుడు అలువాల సదాశివుడు, ప్రధాన కార్యదర్శి నాయకపు సుభాష్,కోశాధికారి కంకణాల సంతోష్, సహయ కార్యదర్శి సాయిప్రదీప్,సహాయ కోశాధికారి సిహెచ్ సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు ఎన్. బుచ్చిరెడ్డి, కొల్ల కృష్ణకుమార్రెడ్డి,గోకారపు శ్యామ్ కుమార్, వలిశెట్టి సుధాకర్ ,సభ్యులు పాల్గొన్నారు.
–––––––––––––––––––––––––––––––
జర్నలిస్టు పరపతి సంఘం సభ్యులకు నిత్యావసర వస్తువులను అందజేస్తున్న డీసీసీబీ చైర్మన్ మార్నేనీ రవీందర్రావు.