ఆరోగ్యశాఖ మంత్రి అవశ్యం…

తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడొక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కావాలి…మొన్నటి వరకు మంత్రిగా కొనసాగిన ఈటల రాజేందర్ భూకబ్జా ఆరోపణలతో భర్తరఫ్ కాగా ప్రస్తుతం ఆ శాఖ ఖాళీగా ఉంది.. రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను భయపెడుతుండగా ఆ శాఖ మంత్రి లేకుండా ఉండడం కాసింత వెలితిగానే ఉంది…ఈటల భర్తరఫ్ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ బాధ్యతలు ప్రస్తుతం తానే చూస్తున్నారు… ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ… చీఫ్ సెక్రటరీ ద్వారా కొవిడ్ నియంత్రణ చర్యలు తీసుకుంటున్న ఆశాఖకు మంత్రి ఉంటే మరింత వేగంగా పనులు చేయవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది… అందుకే ఎవరిని పలకరించిన ఆరోగ్య శాఖ కు మంత్రి అవశ్యం అనే టాకే వినపడుతోంది… నిన్నటికి నిన్న ప్రధాన మంత్రి, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో సీఎం రాష్ట్రంలో కరోన పరిస్థితులపై సమీక్షా జరగగా వేర్ ఈస్ యువర్ హెల్త్ మినిస్టర్ అనే ప్రశ్న కేంద్రం నుంచి వచ్చింది దింతో రాష్ట్రంలో త్వరలోనే నూతన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని నియమిస్తారని గులాబీ వర్గాల్లో సైతం చర్చ జరుగుతుంది… మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందా… అనే విషయాన్ని పక్కన పెడితే త్వరలోనే వైద్య ఆరోగ్య శాఖ కొత్త మంత్రితో భర్తీ కావడం ఖాయంగానే కనిపిస్తోంది… ఈ శాఖ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి త్వరలోనే మంత్రిని నియమించనున్నారనే ప్రచారం జరుగుతోంది… ఐయితే ఈ శాఖను ఎవరికి కట్టబెడతారనే చర్చ సైతం ప్రస్తుతం జోరందుకుంది… గతంలో మంత్రిగా ఉన్న వారెవరికి ఈ శాఖ వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది… గతంలో మంత్రులుగా ఉంది తీసివేయబడ్డ వారికి,రెండో సారి టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే గతంలో మంత్రి ఐయిన తిరిగి మంత్రి పదవి రానివారికి అసలు గులాబీ బాస్ ఛాన్స్ ఇచ్చే అవకాశం లేనట్లు తెలిసింది… ఇలా చేస్తే మళ్ళీ విమర్శలు వచ్చే అవకాశం ఉన్నందున భర్తరఫ్ చేయబడ్డ బిసి సామాజిక వర్గానికి చెందిన ఈటల స్థానంలో ఎంబిసి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మంత్రిగా నియమించి లోటును భర్తీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది…ఈ వ్యూహాన్ని అనుసరిస్తే ప్రజల్లో మరింత ఆదరణ పొందవచ్చని ఈటల విషయంలో అక్కడక్కడ వస్తున్న బిసి సామాజిక వర్గ ఆరోపణలకు చెక్ పెట్టవచని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.

ఆరోగ్యశాఖ మంత్రి అవశ్యం...- news10.app

గంప గోవర్ధన్ కు ఛాన్స్…?

తెలంగాణ ఉద్యమం ముందునుంచి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కేసీఆర్ నియమించనున్నట్లు తెలుస్తుంది… ప్రస్తుతం ప్రభుత్వ విప్ గా కొనసాగుతున్న ఆయన తెలంగాణ ఉద్యమం సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2011 లో టిడిపి నుంచి టీఆర్ఎస్ లో చేరాడు…1994 లో ఎమ్మెల్యే గా టిడిపి నుంచి గెలుపొంది శాసనసభ లో అడుగుపెట్టిన ఆయన తెలంగాణ రాష్ట్రం వచ్చాక రెండు సార్లు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గా కామారెడ్డి నియోజకవర్గం నుంచి గెలుపొందారు… టీఆర్ఎస్ పార్టీలో చేరిన దగ్గరనుండి గులాబీ అధిష్టానానికి అత్యంత విధేయుడిగా, కేసీఆర్ కు ఆప్తుడిగా ఉంటున్న గంప గోవర్ధన్ త్వరలోనే మంత్రి కావడం ఖాయమని కామారెడ్డి జిల్లాలో ఇప్పటికే ప్రచారం జరుగుతోంది… బిసి సామాజిక వర్గానికి చెందిన గంప కు బిసి సమీకరణాల నేపథ్యంలో కేసీఆర్ తప్పక స్థానం కల్పిస్తారని తెలుస్తుంది… నియోజకవర్గంలో ప్రజలతో మంచి సంబంధాలు ఉండి 1994 నుంచి వరుసగా ఎమ్మెల్యే గా గెలిసిన గంపకు కేసీఆర్ దృష్టిలో మంచి మార్కులే ఉన్నట్లు తెలిసింది… ఇప్పటివరకు ఏ పదవి ఆశించని తనకు మంత్రి పదవి ఇస్తారని కొందరు గులాబీ నాయకులు సైతం అంటున్నారు… తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖకు మంత్రి తక్షణమే అవసరం కనుక ముఖ్యమంత్రి కేసీఆర్ గంపకు మంత్రి అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.