మావోయిస్టులు ప్రజావ్యతిరేక విధానాలు మానుకోవాలి

ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ఐపీఎస్

మావోయిస్టులు అమాయకులైన గిరిజనులను ఉపయోగించుకొని మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి కాకుండా అడ్డుపడుతున్నారు. అమాయక గిరిజనులు మరియు ఇతర ప్రజల నుండి బలవంతంగా డబ్బులు నిత్యావసర సరుకులు దౌర్జన్యంగా వసూలు చేస్తూ ప్రజలను వేధింపులకు గురి చేస్తున్నారు.

మావోయిస్టులు ప్రజావ్యతిరేక విధానాలు మానుకోవాలి- news10.app

విలాసవంతమైన జీవితాలు గడుపుతూ అమాయకులైన ప్రజలను వారి కోరికలను నెరవేర్చే నందుకు ఇన్ఫార్మర్ నెపంతో హత్యాకాండ కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి పద్ధతి మానుకోవాలి. కాలం చెల్లిన సిద్ధాంతాలకు తెలంగాణలో మనుగడ లేదు. మావోయిస్టులకు ఎవరైనా సహకరించి నట్లయితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోబడును. ఇప్పటికైనా ప్రజావ్యతిరేక విధానాలు మానుకొని మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోవాలి. లొంగి పోవాల్సిన వారు ఎక్కడైనా ఎవరి ముందైనా లొంగి పోవచ్చు. వారికి ప్రభుత్వం తరఫున పునరావాసం కల్పించబడుతుంది. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని కోరుకుంటున్నాము.