కోచ్ ప్యాక్టరీ ఆందోళనకు మావోయిస్టు విప్లవ కార్మిక సంఘం మద్దతు

లేఖ విడుదలచేసిన కార్యదర్శి ఆజాద్

ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరుతూ చేపట్టిన ఆందోళనకు విప్లవ కార్మిక సంఘం కార్యదర్శి ఆజాద్ సంపూర్ణ మద్దతు ప్రక్టటించారు. ఏప్రిల్ 5న జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసన దీక్షకు అన్ని వర్గాలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

కోచ్ ప్యాక్టరీ ఆందోళనకు మావోయిస్టు విప్లవ కార్మిక సంఘం మద్దతు- news10.app

దక్షిణ మధ్య రైల్వేలో అన్ని డివిజన్ల కంటే ఎక్కువ ఆదాయం కాజీపేట నుండే వస్తోందన్నారు. ఈ డివిజన్ నుండి 68.8 శాతం ఆదాయం వస్తుండగా అన్నింటికన్న ఎక్కువగా 12 వేల మంది ఉద్యోగులు ఇక్కడే పనిచేస్తున్నారని ఆజాద్ అన్నారు. పివి నరసింహరావు ప్రధానిగా ఉన్నప్పుడు మంజూరైన కోచ్ ఫ్యాక్టరీ నేటికీ ప్రారంబానికి నోచుకోలేదన్నారు.

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ములుగులో గిరిజన యూనివర్శిటీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, ఐఐఆర్ చట్టంలోని 13వ షెడ్యూల్ లో 10వ అంశగా కోచ్ ఫ్యాక్టరీ కెటాయింనట్టుగా పేర్కొన్నా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసేది లేదని తెగేసి చెప్తోందని వికాస కార్యదర్శి ఆజాద్ ఆరోపించారు. కేంద్రంలో మోడీ సర్కార్ బారత్ మాతకు జై అంటూనే భారతీయులకు ద్రోహం చేస్తున్నారన్నారు. నిజమైన దేశభక్తుల తామేనంటూ సామ్రజ్యావాదులకు, బహుళజాతి సంస్థలకు కార్పోరేట్ శక్తులకు, నిరంకుశ బడా బూర్జువాలు అంబానీ, అదానిీలకు దేశ సంపదను అమ్ముతున్న ఆసలైన ద్రోహులని ఆజాద్ మండిపడ్డారు. భారత రవాణా వ్యవస్థకు గుండెకాయలా ఉన్న రైల్వేను ప్రైవేటీకరించేందుకు చేస్తున్న కుట్రను తిప్పి కొడుతూ, ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటయ్యే వరకూ పోరాటం చేయాలని ఆజాద్ కోరారు.