ప్రజలకు , ప్రభుత్వ యంత్రాగానికి వారధులు జర్నలిస్టులు

ప్రజలకు, ప్రభుత్వ యంత్రాగానికి వారధులు జర్నలిస్టులు – ఉమ్మడి జిల్లా ట్రెస్సా అధ్యక్షుడు రాజ్‌కుమార్‌

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వ అమలు చేస్తున్న లాక్‌డౌన్‌లో జరుగుతున్న పరిణామాలు, విషయాలను ప్రజలకు, ప్రభుత్వయంత్రాగానికి మద్య వారధులుగా అనునిత్యం జర్నలిస్టులు అందిస్తున్నారని తహసీల్దార్ల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గనిపాక రాజ్‌కుమార్‌ అన్నారు.

ప్రజలకు , ప్రభుత్వ యంత్రాగానికి వారధులు జర్నలిస్టులు- news10.app

శుక్రవారం హన్మకొండ సర్క్యూట్‌ గెస్ట్‌హౌస్‌ సమీపంలో హన్మకొండ జర్నలిస్టుల పరపతి సంఘం సభ్యులకు బియ్యం, నిత్యావసర వస్తువులను అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న విషయాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ యంత్రాంగానికి తెలిసే విధంగా జర్నలిస్టుల తమ కథనాలతో అందించడం వల్ల పేద వర్గాలకు, వలస కార్మికులకు సహాయం అందిస్తున్నామన్నారు.

ట్రెస్మా రాష్ట్ర నాయకులు రియాజోద్దిన్‌ మాట్లాడుతూ కరోనా కట్టడికి స్వీయ నియంత్రణతోనే సాధ్యమన్నారు. ఈసమయంలో జర్నలిస్టు మిత్రులు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. తహసీల్దార్‌ సంఘం అధ్యక్షడుఉ కిరణ్‌ప్రకాశ్‌ మాట్లాడుతూ కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితమై సామాజిక దూరం పాటించాలన్నారు. వీఆర్వోల సంఘం రాష్ట్ర నాయకులు కందారి బిక్షపతి మాట్లాడుతూ ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు లేకుండా ఉన్నారని అన్నారు. హన్మకొండ జర్నలిస్టుల పరపతి సంఘం అధ్యక్షుడు అలువాల సదాశివుడు, ప్రధాన కార్యదర్శి నాయకపు సుభాష్,కోశాధికారి కంకణాల సంతోష్, సహయ కార్యదర్శి సాయిప్రదీప్, సహాయ కోశాధికారి సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు ఎన్‌. బుచ్చిరెడ్డి, కొల్ల కృష్ణకుమార్‌రెడ్డి, గోకారపు శ్యామ్‌ కుమార్, వలిశెట్టి సుధాకర్, సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here