చుక్క ఆగింది…దందా నడుస్తోంది?

వరంగల్ ఆర్టీఏ లో ఆగిన చుక్క సింబల్
అక్రమ దందా మాత్రం యధాతధం
మోపెడు ఫైళ్ళతో కార్యాలయంలోకి ప్రవేశిస్తున్న సీనియర్ అధికారుల బినామిలు
మూడో కంటికి కనపడకుండా సంతకాలు…వసూళ్లు
సీనియర్ అధికారులపై చర్యలు తీసుకోకుండా ఏజంట్లపై గరం అవుతున్న రవాణా శాఖ అధికారి?

వార్తలు రావడానికి వారే కారణం…..కార్యాలయం లోకి రానివ్వకూడదని ఆదేశాలు…?

వరంగల్ రవాణా శాఖ కార్యలయంలో నడుస్తున్న అక్రమదందా సీనియర్ అధికారుల వసూళ్లపై గత మూడు రోజులుగా న్యూస్10 పత్రికలో వరుసకథనాల నేపథ్యంలో రవాణాశాఖ కార్యాలయంలో హుష్..గప్ చుప్ పరిస్థితి కొనసాగుతుంది. పత్రికలో వరుస కథనాలు రావడానికి ఏజెంట్లు కారణమని తేల్చిన రవాణా శాఖ అధికారి ఇకపై ఎజెంట్లను ఎవరిని కార్యాలయంలో కి అనుమతించకూడదని నిర్ణయించారట. ‘ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డ’ చందంగా రవాణా శాఖ కార్యాలయంలో అవినీతికి కారణమైన సీనియర్ అధికారులను,వారి బినామిలు,బ్రోకర్లను వదిలి ఏజంట్ల పై రవాణాశాఖ అధికారి ఆగ్రహం వ్యక్తం చేయడం కార్యాలయంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

చుక్క ఆగింది...దందా నడుస్తోంది?- news10.app

చుక్క ఆగింది……

న్యూస్10 వరస కథనాల నేపథ్యంలో రవాణాశాఖ కార్యాలయంలో ఆ ఇద్దరు సీనియర్ అధికారులు చుక్క విధానానికి తాత్కాలిక పులిస్టాప్ పెట్టిన అక్రమ దందాను మాత్రం అలాగే కొనసాగిస్తున్నట్లు తెలిసింది. సీనియర్ అధికారులకు చెందిన బ్రోకర్లు బినామిల వద్ద నుంచి జనాల ధరకాస్తు లు సేకరించి కమిషన్ దండుకొని మోపెడు ఫైళ్ళను ఒకేసారి తీసుకువెళ్లి సంతకాలు పెట్టించి పనికానిస్తున్నారట. ఈ తతంగం అంతా మూడో కంటికి తెలియకుండా జరుగుతుందట. అంటే బయట జనాలకు కనపడకుండా చుక్క పద్ధతికి విరామం ఇచ్చారు కానీ అక్రమ దందాను మాత్రం యధావిధిగా నడు పుతున్నారన్నమాట. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు ఇక్కడ పనిచేస్తున్న అధికారులందరు ఇదే అక్రమ పద్ధతిని అనుసరించడం వల్ల ఇక్కడి అక్రమాదందాను అడ్డుకోవడం కష్టసాధ్యమేనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.