ఎల్లపూర్ లో కాలువలు మింగిన చలనం లేదు…

హాసన్ పర్తి మండలం ఎల్లపూర్ గ్రామంలో రియల్టర్ల ఇష్టారాజ్యం నడుస్తోంది… ఎం చేసిన అడిగేవారు లేరని అక్కడ రియల్టర్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు.వారికి తోడుగా వారు ఏంచేసిన పట్టించుకోకుండా ఇరిగేషన్ అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎల్లాపూర్ గ్రామంలోని చెరువు దాదాపు వెయ్యి ఎకరాలకు సాగునీరు అందిస్తుండగా… ఈ చెరువు ద్వారా పంటపొలాల కు నీటిని అందించే కాలువలను ఇక్కడ రియల్ దందా చేస్తున్న కొందరు వాటిని పూర్తిగా పూడ్చివేసి ఆనవాలు లేకుండా చేసి తమ వెంచర్ వ్యాపారాన్ని ప్రారంభించారు. అనేక ఎకరాల పంట పొలాలకు నీటిని అందించే ఈ కాలువలను మూసి వేయడం మూలంగా నీరు అందక పంటపొలాలు బీళ్లుగా మారాయి. దీంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్న ఇరిగేషన్ అధికారులు ఏమాత్రం కదలకుండా మొద్దు నిద్ర నటిస్తున్నారు. ఈ విషయంపై ఈనెల 10 న న్యూస్10 ఓ కథనం వెలువరించగా ఎదో కదిలినట్లు నటించిన ఇరిగేషన్ అధికారులు మళ్ళీ ఆ విషయాన్ని పూర్తిగా మరిచిపోయారు. చెరువుకు సంబందించిన కాలువలను మూసివేసి దర్జాగా రియల్ దందా చేస్తున్న రియల్టర్ లపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు.పంట కాలువలు మూసివేసి కబ్జా చేసి వెంచర్ సిద్ధం చేసి గజాల చొప్పున భూమిని అమ్మేస్తున్నారు మొర్రో అని రైతులు ఎంతగా తమ గోడు వెళ్లబోసుకున్న అదిమాత్రం ఇరిగేషన్ అధికారులకు ఏమాత్రం వినపడినట్లు లేదు… చెరువు, చెరువుకు సంబందించిన కాలువలు ఎక్కడ పోయిన తమకేం సంబంధం లేనట్లు వారి వ్యవహారశైలి కనపడుతుందని విమర్శలు వస్తున్న అధికారుల్లో మాత్రం చలనం లేకుండా పోయింది.

ఎల్లపూర్ లో కాలువలు మింగిన చలనం లేదు...- news10.app

రియల్టర్ లతో కుమ్మక్కు…?

పంట కాలువలు పూడ్చివేసి భూమిని కబ్జా చేసి వెంచర్ నిర్వహిస్తున్న ఇరిగేషన్ అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోకుండా ఉండడానికి కారణం రియల్టర్ లతో వారు పూర్తిగా కుమ్మక్కు కావడమేనని ఇక్కడి స్థానికులు ఆరోపిస్తున్నారు.అనేకసార్లు ఈ విషయంపై తాము పిర్యాదు చేసిన కనీసం ఎంజరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం ఇరిగేషన్ అధికారులు చేయలేదని ఇందుకు కారణం వెంచర్ నిర్వహిస్తున్న రియల్టర్లు ఇరిగేషన్ అధికారులను ప్రసన్నం చేసుకొని కావాల్సింది సమర్పించడం మూలంగానే మౌనం నటిస్తున్నారని రైతులు అంటున్నారు. ఏకంగా చెరువుకు సంబందించిన కాలువలను మూసివేసి వెంచర్ వేసిన తమకేం పట్టనట్లు అధికారులు వ్యవహరించడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.

రెండేళ్లుగా పొలాలు బీడుగా ఉంచుతున్నా….

కే. కాశిం. బాధిత రైతు ఎల్లపూర్ గ్రామం

చెరువు నిండా నీళ్లు ఉన్నా పైన కాలువలు పూడ్చడంతో కిందికి నీళ్లు రాక రెండేళ్లుగా పొలాలు బీడు భూమిగానే ఉంచినం. మీద వెంచర్లు నిర్మించి కాలువలను లెవల్ చేసుకొని అక్రమించిర్రు అడుగబోతే తిడుతూ కొట్టడానికి వస్తాళ్ళు. ఉన్న కొద్దీ భూమిని నీళ్లు లేక బీడు గా ఉంచి వాచ్ మెన్ గా పని చేసుకుంటానా….ఎన్ని సార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here