అన్న అధికారి… తమ్ముడు మధ్యవర్తి

హన్మకొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇష్టారాజ్యం

హన్మకొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సీనియర్ పేరుతో ఆ సబ్ రిజిస్టార్ తన ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి…. కావాల్సింది ముట్టజెప్పితే చాలు ఎంతటి పనిఆయిన ఏ కాగితాలు లేకున్నా సులువుగా చేసిపెడుతూ ఈ అధికారి తన ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇదే ఆరోపణల్లో ఇటీవల ఉన్నతాధికారులనుంచి నోటీసులు అందుకున్న ఈ అధికారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదట. ఎప్పటి తీరుగానే తన చేతివాటాన్ని ప్రదర్శిస్తూ అందినకాడికి దండుకుంటున్నాడని రిజిస్ట్రేషన్ కోసం వెళ్లిన వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు.

అన్న అధికారి... తమ్ముడు మధ్యవర్తి- news10.app

తమ్ముడే మధ్యవర్తి….?

హన్మకొండ రిజిస్ట్రార్ కార్యాలయంలో అన్న సీనియర్ సబ్ రిజిస్టార్ గా కొలువు చేస్తుంటే స్వయానా ఆయన తమ్ముడు ఇక్కడే డాక్యుమెంట్ రైటర్ గా స్థిరపడి పోయి అన్నకు మధ్యవర్తిగా మారినట్లు తెలిసింది. అన్న ఏ పని చేయాలన్న తమ్ముడు దానికి సరిపడినంత పుచ్చుకొని సరే అని గ్రీన్ సిగ్నల్ ఇస్తే పని జరిగి పోతుందట. ఎంతటి జఠిలమైన సమస్య ఉన్న తమ్ముడిని సంప్రదిస్తే పని చక చక జరిగిపోతుందట. అందుకే కొంతమంది రియలేస్టేట్ దారులు తమ్ముడిని ప్రసన్నం చేసుకొని పనులు చక్కబెట్టుకొని దర్జాగా రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి వెళ్లిపోతున్నారట.

ఆయనకు తోడు ఓ సీనియర్ అసిస్టెంట్….?

సబ్ రిజిస్టార్,ఆయన తమ్ముడు వీరికి తోడు ఓ సీనియర్ అసిస్టెంట్ ఈ కార్యాలయంలో తమ పరపతిని తెగ వాడేస్తున్నారట. తమ్ముడు చెప్పడం అన్న చేయడం బాగానే ఉన్నా వీరిద్దరూ ఏ పని చేసిన 20 శాతం వాటా ముడితేనే తాను పని చేస్తానని ఇక్కడి సీనియర్ అసిస్టెంట్ సైతం ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నాడట.ఈ అధికారికి సహకరిస్తూ అందినకాడికి ఇతగాడు సైతం పుచ్చుకుంటున్నట్లు సమాచారం.

ఉన్నతాధికారుల అండ ఉంది?

హన్మకొండ రిజిస్టార్ కార్యాలయంలో మొన్నటికిమొన్న ఓ ఇద్దరు సస్పెండ్ ఐయిన ఈ అధికారికి ఏమాత్రం భయం లేకుండా పోయిందట. ఎందరు సస్పెండ్ ఐయిన తనకేం కాదని ఉన్నతాధికారుల అండదండలు తనకు పుష్కలంగా ఉన్నాయని ఈ అధికారి ధీమాగా ఉన్నాడట… ఉన్నతాధికారుల అండదండలు ఉన్నాయి కనుక తాను ఏంచేసిన చెల్లుతుందనే ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నాడట. ఈ సబ్ రిజిస్టార్ ఇటీవల ఓ వ్యవసాయ భూమిని ఎలాంటి అనుమతులు,నాల కన్వర్షన్ లేకున్నా మూడు వందల గజాలుగా విడగొట్టి మొత్తం 2500 గజాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిసింది. ఈ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో సదరు యజమాని వద్దనుంచి లకారాలల్లో పెద్దమొత్తంలో పుచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది… మరో 3 వందల గజాల రిజిస్ట్రేషన్ విషయంలో కూడా ఈ అధికారి కావాల్సింది తీసుకొని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిసింది. కాగా ఈ అధికారి మొదటి నుంచి ఓ విధానాన్ని ఆనుసరిస్తున్నాడట… ఏదైనా పెద్ద మొత్తంలో అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేస్తే ఎంతలేదన్న ఓ వారం పాటు సెలవు పెట్టి కార్యాలయానికి రాడట. ఇలాగే ఇటీవల నిభందనలకు విరుద్ధంగా 2500 గజాలు రిజిస్ట్రేషన్ చేయగానే సెలవుపై వెళ్లినట్లు సమాచారం. హన్మకొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈ సీనియర్ అధికారి ఇంతచేస్తున్న ఉన్నతాధికారులు చూసిచూడనట్లు వదిలేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ అధికారి అక్రమాలపై ఫిర్యాదులు ఉన్న ఉన్నతాధికారులు ఇటీవల నోటీసులతో సరిపెట్టారని కొందరు అంటున్నారు.ఇకనైనా ఈ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here