గ్రేటర్ వరంగల్ నగరంలోని 52 డివిజన్ ఎస్సి కాలనీ వాసులు తమకు తాముగా సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించుకున్నారు… కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చుతుండగా ఆ కాలనీ వాసులు సెల్ఫ్ లాక్ డౌన్ తో మిగతా కాలనీలకు ఆదర్శంగా నిలుస్తున్నారు… సోమావారం కాలనిలో సమావేశం నిర్వహించుకున్న కాలనీ వాసులు సెల్ఫ్ లాక్ డౌన్ నిర్ణయాన్ని ప్రకటించారు… కరోనా వ్యాపించే అవకాశం ఉందని నివారణ చర్యలు తీసుకొని కాలనిలో కరోన కట్టడి చర్యలు చేపట్టాలని అధికారులకు పలుమార్లు విన్నవించుకున్న పెడ చెవిన పెట్టడంతో కాలనీ వాసులు అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేసి లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ కారణం..
సోమిడి 52 వ డివిజన్ ప్రాంతం ఎస్సీ కాలనీలో అర్బన్ హెల్త్ సెంటర్ ఉంది. ఈ హెల్త్ సెంటర్ కు పలు ప్రాంతాల నుండి ప్రజలు కోవిడ్ టెస్టుల కోసం మరియు వ్యాక్సిన్ తీసుకోవడానికి భారీగా తరలి వస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడికి వచ్చే వారు ఏలాంటి నిబంధనలు పాటించడం లేదు… వారు కనీస నిబంధనలు పాటించేలా అధికారులు చొరవ చూపడం లేదు.. దింతో ఇక్కడి కాలనీ ప్రజల్లో భయాందోళన మొదలైంది. కోవిడ్ పేషంట్ల రాక పెరిగి పోవడంతో హాస్పిటల్ ఎదురుగా గృహాలలో నివసిస్తున్న ప్రజలు ఇళ్ళు ఖాళీ చేసి వేరే ప్రాంతానికి తరలి వెళ్లారు.. కాగా ఇక్కడ కనీస నిబంధనలు పాటిచడం లేదని అధికారులకు కాలనీ వాసులుపలుమార్లు ప్రభుత్వానికి తెలిసే విధంగా సమస్యలు చెప్పిన…. ఎలాంటి చర్యలు తీసుకోకుండా… కనీస నిబంధనలు పాటించకుండా హాస్పటల్ సిబ్బంది మరియు మున్సిపాలిటీ అధికారులు వ్యవహరిస్తున్న తీరును కాలనీ వాసులు నిరసిస్తున్నారు… అధికారుల స్పందన ఎంతమాత్రం లేకపోవడంతో అందరూ ఏకమై లాక్ డౌన్ ను ప్రకటించుకున్నారు.
ఇకనైనా అధికారులు మేలుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఇక్కడి నుండి వేరే చోటుకు మార్చే ప్రయత్నం చేస్తారని కాలనీ వాసులు కోరుతున్నారు… ఆరోగ్య కేంద్రం ఒకవేళ కొనసాగిన పకడ్బందీ చర్యలు చేపట్టి, జాగ్రత్తలు తీసుకొని కోవిడ్ నిబంధనలు పాటించేలా కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు… ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారి అస్తవ్యస్త పార్కింగ్ మూలంగా కాలనీ వాసులు కనీసం నడిచివెళ్లే దారి కూడా ఉండడం లేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఇకనైనా అధికారులు స్పందించి ఈ కాలనీ వాసులు సమస్యకు పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు…మరి అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.