మందులు,వైద్య పరికరాల పై ట్యాక్స్ ఎత్తివేయాలి

మందులు, వైద్య పరికరాలపై కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ ఎత్తివేయాలని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కేంద్రాన్ని కోరారు .అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ కాన్పారెన్స్ లో పాల్గొన్న మంత్రి ఈటెల రాజేందర్ , వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలు, ఇసిఐఎల్, డిఆర్‌డిఒ వంటి సంస్థల్లో తయారు చేసిన పరికరాలు రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయాలని కోరారు. ఎన్-95 మాస్కులు, పిపిఇ కిట్స్, టెస్టింగ్ కిట్స్, సాధ్యమైనంత త్వరగా అందజేయాలని విజ్ఞప్తి చేశారు.

మందులు,వైద్య పరికరాల పై ట్యాక్స్ ఎత్తివేయాలి- news10.app

తెలంగాణ కరోనా కేసులు 85 శాతం మర్కజ్ నుంచి వచ్చినవేనని, తెలంగాణలో ఇప్పటి వరకు 8550 మందికి పరీక్షలు చేశామని, లాక్‌డౌన్ పొడిగింపు అంశంపై తెలంగాణ అభిప్రాయాల తీసుకోవాలని సూచించారు. భారత్ దేశంలో కరోనా బాధితుల సంఖ్య 6910కి చేరుకోగా 230 మంది మృత్యువాతపడ్డారు. తెలంగాణలో కరోనా వైరస్ 471 మందికి సోకగా 12 మంది చనిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here