సహజీవన మోసం…!

ఇది ఓ బరితెగించినోడు,బలిసినోడు ఓ ఒంటరి మహిళను ప్రేమ ,సహజీవనం పేరుతో వాడుకొని వదిలేసిన వైనం… నువ్వె నాసర్వస్వం అంటూ తన అన్ని అవసరాలు తీర్చుకొని భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న ఆ మహిళ ఉద్యోగిని వంచించిన మోసగాడి బ్లాక్ మెయిల్ బండారం ఇది…. ఒకటి కాదు రెండు కాదు ఆ మహిళకు సంబందించిన సర్వ ఆస్తిని తన సొంతం చేసుకొని 70 లక్షలకు పైగా వాడుకొని మూడు సంవత్సరాల పాటు సహజీవనం చేసి ప్రస్తుతం మొహం చాటేసి నీ నగ్న వీడియోలు ఫోటోలు ఉన్నాయి ఇంటర్ నెట్ లో అప్ లోడ్ చేస్తానని బెదిరిస్తున్న ఓ కామాంధుడి తీరిది…. డబ్బున్న వాడిని కనుక నువ్వు ఎక్కడ తనపై పిర్యాదు చేసిన తన ఆస్తిని కాజేయడానికి అబద్దాలు ఆడుతున్నావని చెప్తానని నిన్ను ఎవరు నమ్మరని బెదిరింపులకు దిగుతున్న తీరు ఆవేదన కలిగిస్తోంది… 75 లక్షల నగదు, 20 తులాల బంగారం,కాస్తో కూస్తో భూమి,ఇల్లు కొనిస్తానని కాజేసిన నగదుతో సర్వం కోల్పోయిన ఆ ఒంటరి మహిళ తన కొడుకుతో పాటు అష్టకష్టాలు అనుభవిస్తోంది…పోలీసులకు పిర్యాదు చేసిన లాభం లేకపోవడంతో తన కన్నీటి గాధ ఎవరికి చెప్పుకోవాలో తన బాధ ఎవరుతీరుస్తారో తెలియక ఆ మహిళ నరకయాతన పడుతోంది….తాను ఎలా మోసపోయిందో ఆ మాయగాడి మాటలు నమ్మి ఎం కోల్పోయిందో న్యూస్10 కు బాధిత మహిళ అందించిన పూర్తి వివరాల కథనం ప్రకారం.

సహజీవన మోసం...!- news10.app

మోసం తీరిది…

భర్తను కోల్పోయి ఓ ప్రభుత్వ శాఖలో ఉద్యోగం చేస్తూ తన కొడుకుతో సహా హన్మకొండలో నివాసం ఉంటున్న ఓ ఒంటరి మహిళకు హంటర్ రోడ్ లో కార్ రిపేరింగ్ సెంటర్ నడుపుతున్న ఓ వ్యక్తి ద్వారా కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి పరిచయం ఐయాడు…పరిచయం ఐయిన కొద్దిరోజులకే దగ్గరయ్యాడు..ఏవో మాయమాటలు చెప్పి సహజీవనం మొదలుపెట్టాడు.పథకం ప్రకారం ఆ మహిళ దగ్గర ఉన్న నగదునంత కాజేయడం మొదలుపెట్టాడు.. స్థలం కొని ఇల్లు కట్టిస్తానని,సోమిడిలో భూమి కొనుగోలు చేస్తానని 20తులాల బంగారంతో సహా ఉన్న నగదునంత ఊడ్చేశాడు.టూర్ ల పేరిట ఆ మహిళ డబ్బులతోనే దేశం అంత చుట్టేసాడు… బ్యాంకు అక్కౌంట్ లు, పాస్వర్డ్ లు,ఏటీఎం లు అన్ని తన అధీనం లో ఉంచుకొని తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరించాడు.ఇదంతా గమనించిన బాధిత మహిళ ఇదేంటని ప్రశ్నిస్తే మొహం చాటేసి బెదిరింపులకు దిగుతున్నాడు.

మాజీమంత్రి కొడుకును…

తాను మాజీమంత్రి కొడుకునని తన అమ్మ ప్రస్తుతం ఎంపీ గా ఉందని ఓ తప్పుడు విజిటింగ్ కార్డు ప్రింట్ చేయించి ఆ మహిళను నమ్మించి మోసం చేసాడు ఈ ప్రబుద్ధుడు.విషయం తెలిసిన ఆ మహిళ స్నేహితులు గూగుల్ లో సెర్చ్ చేసి ఎంపీ వివరాలు లేవని అడిగితే సెక్యూరిటీ కారణాల దృష్ట్యా బ్లాక్ చేశారని ఏవో సాకులు చెప్పాడు.

నగ్న ఫొటోలతో బ్లాక్ మెయిల్

తన డబ్బు ,బంగారం తనకు ఇవ్వాలని మహిళ నిలదీయడంతో బ్లాక్మెయిల్ కు దిగాడు ఆ మోసగాడు. తనతో కలిసిఉన్నపుడు తనకే తెలియకుండా రహస్యంగా అమర్చిన కేమరతో తీసిన నగ్న వీడియోలు,ఫోటోలు నెట్ లో పెడతానని బెదిరింపులకు దిగుతున్నాడు.శాంపిల్ చూడమంటూ నగ్న ఫోటోలు వాట్సాప్ చేసి బయపెడుతూ మానసికంగా తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడు. కాళ్ళవేళ్ళ పడిన కనీస కనికరం లేకుండా బూతులు తిడుతున్నాడని ఆ మహిళ కన్నీటిపర్యంతంఐయింది…

ఎవరా మోసగాడు…ఏమా కథ
పిర్యాదు చేస్తే ఆ సిఐ ఏమన్నాడు…?

రేపటి సంచికలో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here