వరంగల్ ట్రై సిటిలో లాక్ డౌన్ ఉత్తర్వులను అతిక్రమించే వారిని గుర్తించేందుకు వరంగల్ నగరంలో ఇకపై డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా పెట్టడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ గురువారం వెల్లడించారు.
కరోనా వ్యాధి కట్టడి చేయడం కోసం ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వులు అతిక్రమించిన వారిని గుర్తించడంతో పాటు నో మూమేంట్ జోన్ల పరిధిలో నిఘా కోనసాగించించేందుకు ఎర్పాటు చేసిన డ్రోన్ కెమెరాల పనీతీరును వరంగల్ పోలీస్ కమిషనర్ క్షేత్ర స్థాయిలో అధికారులతో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ జులైవాడ లోని నో మూమెంట్ ప్రాంతాన్ని డ్రోన్ కెమెరాతో పర్యవేక్షించారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ అయా పోలీస్ స్టేషన్ పరిధిలో నో మూ మెంట్ జోన్లలో డ్రోన్ కెమెరాలలో సర్వేలేన్స్ కోనసాగించాల్సి వుంటుందని. అధే విధంగా ఇతర ప్రాంతాల్లోను అధికారులు ద్రోన్ సహయంతో లాక్ డౌన్ ను అతిల్రమించే వారిని గుర్తించాల్సి వుంటుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమములో హన్మకొండ ఎ.సి.పి జితేందర్ రెడ్డి , సుబెదారి, హన్మకొండ ఇన్స్‌పెక్టర్లు అజయ్, దయాకర్ పాల్గోన్నారు.