ప్రజలకు మావోయిస్టు పార్టీ పిలుపు
మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ …లేఖ, ఆడియో టేపు విడుదల..
కరోన వైరస్ సోకి ప్రాణాపాయ స్థితిలో ఉన్న సామాజికవేత్త వరవరరావు ను వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్
ఉఫా, NIA కేసులను ఎత్తివేసి, అడవుల నుండి గ్రేగ్రౌండ్ బలగాలను ఉపసంహరించుకోవాలి
కేసీఆర్, మోడీలు వరవరరావు ను అర్బన్ నక్సల్స్ అంటూ తప్పుడు కేసులు పెట్టారని ఆరోపణ
ఈ నెల 25న రాష్ట్ర బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చింది. బంద్ పాటించాలని కోరుతూ మంగళవారం మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ …లేఖ, ఆడియో టేపును మీడియాకు విడుదల చేశారు. కరోన వైరస్ సోకి ప్రాణాపాయ స్థితిలో ఉన్న సామాజికవేత్త వరవరరావు ను వెంటనే విడుదల చెయ్యాలని, ఉఫా, NIA కేసులను ఎత్తివేసి, అడవుల నుండి గ్రేగ్రౌండ్ బలగాలను ఉపసంహరించుకోవాలని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ లేఖలో డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా జులై 25 నా తెలంగాణ రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తున్నట్లు ఆయన అన్నారు.
వరవరరావు పరిస్థితి విషమంగా మారిందని, ఆయన ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్లు సరైన బులిటెం ప్రకటించడం లేదన్నారు. కేసీఆర్, మోడీలు వరవరరావు ను అర్బన్ నక్సల్స్ అంటూ తప్పుడు కేసులు పెట్టారని, మోడీ, కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అణిచివేత ప్రారంభించారని జగన్ ఆరోపించారు. హిందు పాసిస్టు లైన మోడీ, అమిత్ షా తో జతకలిసిన కేసీఆర్ కుట్రలను బహిర్గతం చేస్తామన్నారు. రాజకీయ ఖైదీలను బేషరతుగా విడుదల చేయాలన్న ఆయన 60 ఏళ్ళు పైబడిన సాధారణ ఖైదీలందరిని విడుదల చేయాలన్నారు. తెలంగాణ ప్రజలందరూ కలిసి కట్టుగా పోరాడి వరవరరావు ను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని దీనిని తెలంగాణ ప్రజలు బాధ్యతగా చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఒక పథకం ప్రకారమే వరవరరావు ను అక్రమ కేసులో ఇరికించారని ఇందులో సీఎం కేసిఆర్ భాగం పంచుకున్నాడని జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు.